Take a fresh look at your lifestyle.

అదీ తన మంచికే …

“ప్రియాంక ఆ బంగళాలో  1997 నుంచి ఉంటున్నారు.   బీజేపీ అనుసరిస్తున్న కాంగ్రెస్‌ ‌ముఖ్త్ ‌భారత్‌  ( ‌కాంగ్రెస్‌ ‌లేని   భారత్‌) ‌లక్ష్య సాధనలో భాగంగానే   ప్రభుత్వం ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.  అదే సందర్భంలో బేజేపీ సీనియర్‌ ‌నాయకులు పదవుల నుంచి దిగిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నారు. వారికి స్పెషల్‌ ‌ప్రొటెక్షన్‌ ‌గ్రూపు  (ఎస్‌ ‌పిజీ) భద్రతను కూడా కొనసాగిస్తోంది.”

కొన్ని సందర్భాల్లో అవకాశాలు అనుకోని విధంగా, పసిగట్టలేని రీతిలో వస్తుంటాయి..! నరేంద్రమోడీ ప్రభుత్వం వాస్తవాధీన రేఖ నుంచి చైనా సైనికులను పారద్రోలిందో లేదో స్పష్టత రాలేదు కానీ,కొత్త ఢిల్లీలో ప్రతిపక్ష నాయకులను , ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులనూ, ప్రభుత్వ అధికార భవనాల నుంచి (బంగళాల నుంచి) ఖాళీ చేయించడంలో విజయం సాధించిందనే చెప్పాలి. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాను ఢిల్లీలోని బంగళా నుంచి ఖాళీ చేయమని ప్రభుత్వం ఆదేశించిన ందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు, శ్రేణులు సందేహిస్తున్నారు. నిజానికి మాజీ ప్రధాని కుమార్తె, మరో మాజీ ప్రధాని మనవరాలు అయిన ప్రియాంక బంగళాను ఖాళీ చేయించడం రాజకీయ కక్షే. అధికార పార్టీ బీజేపీ ప్రత్యర్ధి రాజకీయ నాయకుల పట్ల ఈ మాదిరిగా వ్యవహరించడం ఇది కొత్త కాదు.

ప్రియాంక ఆ బంగళాలో 1997 నుంచి ఉంటున్నారు. బీజేపీ అనుసరిస్తున్న కాంగ్రెస్‌ ‌ముఖ్త్ ‌భారత్‌ ( ‌కాంగ్రెస్‌ ‌లేని భారత్‌) ‌లక్ష్య సాధనలో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. అదే సందర్భంలో బేజేపీ సీనియర్‌ ‌నాయకులు పదవులనుంచి దిగిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నారు. వారికి స్పెషల్‌ ‌ప్రొటెక్షన్‌ ‌గ్రూపు (ఎస్‌ ‌పిజీ) భద్రతను కూడా కొనసాగిస్తోంది. వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాలు దూసుకుని వస్తున్నా, మోడీ ప్రభుత్వం నిష్క్రియా పరత్వంగా వ్యవహరించడాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ ఇటీవల తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. కాంగ్రెస్‌ ‌విమర్శలకు బీజేపీ నాయకత్వం తలెత్తుకోలేకపోతోంది. ఆ కారణంగా కాంగ్రెస్‌ ‌నాయకుల వేధింపులు ఎక్కువయ్యాయి. అందులో భాగంగానే ప్రియాంక భవనం ఖాళీ చేయాలని నోటీసులు పంపి ఉండవచ్చు.

బీజేపీ కక్షపూరిత రాజకీయాలను గురించి వివరించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం కాదు. ప్రియాంక గాందీ ఉత్తర ప్రదేశ్‌ ‌లో కాంగ్రెస్‌ ‌పూర్వ వైభవానికి కృషి చేసేందుకు సంసిద్ధమవుతున్నారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రమే కాకుండా నెహ్రూ కుటుంబానికి ఈ రాష్ట్రం మొదటి నుంచి రాజకీయంగా కోటగా ఉంది. అయితే, 1996 నుంచి రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని మెరుగు పర్చేందుకు తీసుకునే చర్యల్లో అక్కడి ప్రచార బాధ్యతలను ఆమెకు అప్పగించారు. ఆమె ఇప్పటికే ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలో కలయదిరిగి అందరితో పరిచయాలు పెంచుకున్నారు. 2022లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచార సారథ్యం చేపట్టేందుకు ఢిల్లీ నుంచి యూపీకి మకాం మార్పు ఆమెకు కలిసొచ్చే అంశం. లోక్‌ ‌సభ ఎన్నికల్లో కూడా ఆమె ప్రచారం చేశారు. మళ్లీ చేసేందుకు అవకాశం లభిస్తుంది. రాష్ట్రంలోని అనేక బ్లాకుల్లో పార్టీ శాఖలు లేవు, పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేసే బాధ్యత ఆమె పై ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడటం ఆమెకు పెను సవాలే. ఆమె ఇప్పటికే సిఏఏ వ్యతిరేక పోరాటాల్లో ప్రదర్శనల్లో పాల్గొని ప్రజలకు చేరువయ్యారు.రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో యోగి ప్రభుత్వ వైఫల్యాలను ఆమె నిలదీస్తున్నారు.. కరోనా నేపథ్యంలో వలస కార్మికులకు ఉపాధి, పునరావాసం కల్పించడంలో యోగి ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇప్పుడున్న వాతవారణంలో ఆమె ఎంత వరకూ ముందుకు దూసుకుని పోగలరనేది చూడాల్సి ఉంది. ఢిల్లీలో ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయమని మోడీ ప్రభుత్వం తాఖీదు ఇవ్వడం ఆమెకు ఒకందుకు మంచిదే..!.

Leave a Reply