Take a fresh look at your lifestyle.

చెప్పింది చెప్పినట్టే, అన్నది అన్నట్టే ఈ పుస్తకం ‘‘ఉన్నది-ఉన్నట్టు’’

మనం కవిత్వం రాసుకోవచ్చు. రామాయణం, భారతం, భాగవతం…కూడా రాసుకోవచ్చు. పురాణాలు, ఇతిహాసాలు.. వేదాలకు భాష్యాలు న్నయినా, ఎలాగైనా రాసుకోవచ్చు. కానీ, సమకాలీనులు, కులీనుల గురించి, అందునా జనమెరిగిన, జగాన్నెరిగిన, జగమెరిగిన రామోజీరావు లాంటి వ్యక్తుల గురించి రాయడం కత్తిమీద  సామే. ఆయనలోని తెలిసిన మనిషికన్న మనకు తెలియని, ఇతరులకు తెలిసిన వ్యక్తే ఎక్కువ కావచ్చు. మనకు సంబంధించి ఈనాడు-రామోజీరావు. రామోజీరావు లేకపోతే ఈనాడు ఉండదనడంలో సందేహం లేదు.  కానీ.. ఈనాడు లేకపోయినా తన వ్యాపార సామర్థ్యంతో రామోజీరావు మాత్రం తనకంటూ ఒక స్థానాన్ని నిర్మించుకునే వాడనడంలో విప్రతిపత్తి లేదు.. అని కరాఖండిగా చెబుతారు ఆయనతో ఆరు దశాబ్దాల సాన్నిహిత్యం ఉన్న దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి. సమకాలీన జర్నలిజం చరిత్రకు అద్దం పట్టే ఈనాడు-రామోజీరావుల తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శించే మంచి పుస్తకం రాసినందుకు డా, గోవిందరాజు చక్రధర్‌ ‌కు అభినందనలు అని మెచ్చుకున్నారు చంద్రశేఖరరెడ్డి.

పుష్కరకాలం ఆ అక్షరాల వనంలో ఒక పుష్పంలా విరబూసి, పత్రికా రణభూమిలో కలం ఝళిపించి, సంస్థ నుంచీ బయటకొచ్చి మరో మూడు దశాబ్దాలు ఇతరేతర పత్రికలు, జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌ ‌గా అనుభవం గడించి రచన-పాత్రికేయం వంటబట్టించుకున్న సహచర పాత్రికేయ మిత్రుడు గోవిందరాజు చక్రధర్‌ ‌రామోజీరావు మీద ఒక గ్రంధ రచనకు సాహసం చేసారు. రామోజీరావు గురించి మన అభిప్రాయాలు మనకున్నట్లే, ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. అలాగే రచయితకూ నిర్దిష్ట అభిప్రాయాలున్నాయి. పుస్తకంలో రామోజీరావు వ్యాపార సామ్రాజ్యంలో మమేకమైన అసంఖ్యాకుల అభిప్రాయాలను సేకరించడం, వారు అన్నది అన్నట్టు రాయడం ఒక యజ్ఞమే. రామోజీరావు గురించి ఆయన చెప్పదలచుకున్నది చెప్పడమేగాక, ఆయనను విభిన్న కోణాలలో, శైలిలో అధ్యయనం చేసి అర్ధం చేసుకున్న పలువురితో మాట్లాడి, వారు చెప్పింది చెప్పినట్టే, అన్నది అన్నట్టే రాసిన పుస్తకం ‘‘ఉన్నది-ఉన్నట్టు’’.

2024 ఆగస్ట్ 10‌వ తేదీ నాటికి ‘‘ఈనాడు’’ స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడిగిడుతోంది.  పత్రికాధిపతిగా, ఎడిటర్‌ ‌గా రామోజీరావు భావ ప్రకటన సవెచ్ఛకు, పత్రికా స్వేచ్ఛకు ఎంతో విలువ ఇస్తారు. ఆరెంటినీ కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసమే ఆయన అహరం ప్రయత్నించారు అని చక్రధర్‌ అం‌టారు.

‘‘రామోజీరావు – ఈ అయిదక్షరాల పేరులోనే  ఏదో మేజిక్‌ ఉం‌ది. ఈ అయిదక్షరాల పేరు పట్టుదల పరిశ్రమలకు నిలువెత్తు రూపం. ఈ అయిదక్షరాల పేరు అద్భుతాలెన్నో చేసింది. తన పేరిట  ఒక సువిశాల సమాచార వినోద సామ్రాజ్యానికి రూపమిచ్చింది. ఈ అయిదక్షరాల పేరు తల్లిదండ్రులో, గురువులో పెట్టింది కాదు. తనకు తాను పెట్టుకున్న పేరు. తన స్వతంత్ర వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను చాటుకున్న పేరు..’’ అని ఆయన గురించి పరిచయం చేస్తారు రచయిత ప్రారంభంలో.

ఈనాడులో పన్నెం డేళ్ళపాటు పనిచే సినప్పటి అనుభ వాలను నెమరు వేసుకునే ప్రయత్నమే పుస్తక రచనకు శ్రీకారం చుట్టినట్ల యిందన్నారు. రామో జీరావు-ఈనాడు సహా ఆవిశాల సామ్రా జ్యంతో సంబంధం వున్న దాదాపు ఓ పాతిక మందిని కలసి మాట్లాడి ప్రోదిచేసిన సమాచారమే ‘‘ఉన్నది ఉన్నట్టు’’. కాక తాళీయంగా ఒక సారి విమానంలో ప్రయాణిస్తున్న రామోజీరావు పక్క సీటులో కూర్చున్న నాటి పత్రికాధిపతి, పార్లమెంట్‌ ‌సభ్యుడు కె ఎల్‌ ఎన్‌ ‌ప్రసాద్‌ ‌తో మాటలు కలిపినప్పుదు పుట్టుకొచ్చిన ఆలోచనే  ఈనాడు పత్రికకు పురుడు పోసిందట. 372 పేజీల గ్రంథాన్ని 9 ప్రధాన భాగాలలో  37 అధ్యాయాలలో  రచయిత పొందుపరచారు. ది బిగినింగ్‌ – అనే మొదటి భాగంలో అయిదు అధ్యాయాలుగా రామోజీరావు వ్యక్తిగత వివరాలు తెలిపారు. కళింగా సీమలో ఉషోదయం- రెండవ భాగంలో మూడు ఎడిషన్ల ముచ్చట, రామోజీ గీతోపదేశం, తొలి సంపాదకీయం ప్రస్తావించారు. ముడో భాగంలో రచయిత అనుభవించిన 12 ఏళ్ళ నరకం కళ్ళకు కట్టారు. స్టాఫ్‌ ‌దట్‌ ‌మాటర్స్, ‌కింగ్‌ ‌మేకర్‌, ఇన్నర్‌-‌వ్యూలు, కాంట్రవర్సీలకు కేర్‌ ఆఫ్‌ అ‌డ్రస్‌, ‌ఫోకస్‌, ‌ముగింపులేని అంటూ మొత్త తొమ్మిది భాగాలుగా 37 అధ్యాయాలలో రామోజీ కథను రామాయణంలా చెప్పుకొచ్చారు.

కథా గమనంలో ఈనాడే ఎందుకు నబర్‌ ‌వన్‌ ‌గా నిలుస్తున్నదీ, రామోజీ విజయం వెనుక కారణం ఏమిటి, ఎవరిని ఎలా చూసుకుంటారు, సంస్థలో జరిగిన రెండు సమ్మెలు కమ్ముకున్న ఆరు భయాలు, ఈనాడులో యోధాను యోధులు, సంస్థ ఎందుకు ఫాక్టరీగా పేరొందింది, సిబ్బందిని బయటకు ఎలా పంపుతారు, రాష్ట్ర రాజకీయ ఎత్తుగడలో ఆయన పోషించిన రాజగురువు పాత్ర ఏమిటీ, ఇతర పత్రికల వైఫల్యాలు ఈనాడు విజయానికి ఎలా కారణాలయ్యాయి, రాజకీయ ప్రముఖ్లతో, సినీ దిగ్గజాలతో విభేదాలు తలెత్తడానికి కారణాలేమిటి…. ఇలా సుదీర్ఘంగా ఒకదాని వెంట ఒక విషయ ప్రస్తావన సాగుతుంది.

ఆరంభం నుంచీ సంస్థతో మమేకమై.. రామోజీ అడుగులో అడుగై, మనసులో మాటై, రాజబాటలో తోడు నడచి, పత్రిక పేరు ప్రతిష్ఠలకు ప్రాణపదంగా నిలిచి, ఏళ్ళపాటు అండదండలుగా నిలిచిన ప్రముఖులెందరో రామోజీరావు నీడనుంచీ తప్పుకుని ఏటువటి అభిప్రాయాలు వెలిబుచ్చారో తెలుసుకుంతే.. రామోజీరావు అంటే వాస్తవాలు ఇంత విరుద్ధంగా ఉంటాయా అని ఆశ్చర్యం, అనుమానం కలుగుతాయి.

రామోజీ రావు తరువాత సంస్థానం వంటి సంస్థలో దాదాపు రెండో స్థానం అలంకరించిన ఎస్‌ ఆర్‌ ‌రామానుజన్‌ ‘‘‌రామోజీరావు విమర్శలను వినరు, వెనక్కి తగ్గరు. జీతాల విషయంలో పిసినారి. దొంగదెబ్బతీసి నన్ను బయటకు గెంటారు’’ అన్నారు. రామోజీరావు సమీప బంధువు, డాల్ఫిన్స్ ‌పూర్వ ఎండి ఎం. అప్పారావు అంటారు, ‘‘రామోజీది యూజ్‌ అం‌డ్‌ ‌త్రో పాలసీ. బంధాలు బాంధవ్యాలకు విలువే లేదు. తెరచాపను ఎప్పుడు ఎటు తిప్పాలో తెలిసిన నేర్పరి. దేవుడికైనా గేలం వేయగల ఘనాపాఠి’’, అని.

సమకాలీన పత్రిక రంగంలో ఒక లైట్‌ ‌హౌజ్‌, ‌తెలుగునాట అనేక పత్రికల పుట్టుకకు పురుడుపోసి, అసంఖ్యాక, అసమాన పాత్రికేయులను తయారు చేసిన వ్యక్తి, ఈనాడు తొలి ఎడిటర్‌ ఎ ‌బి కె ప్రసాద్‌ ‘‘‌రామోజీ  మంచి ఆర్గనైజర్‌, అం‌తే. అధికారులను బాగా దువ్వుతారు. రచనా నైపుణ్యం ఏమీ లేని ఆయనకు సంపాదకుడిగా పద్మభూషణ్‌ ఇచ్చారు. పెయిడ్‌ ‌జర్నలిజానికి రామోజీ శ్రీకారం చుట్టారు…’’ అంటూ శస్త్రాలు సంధించారు. అలా ఒక రాంభట్ల కృష్ణమూర్తి, వి, హనుమంతరావు, అట్లూరి రామ్మొహనరావు, కె బాపినీడు, టి ప్రకాశ్‌, ఐ ‌వెంకట్‌, ‌టంకసాల అశోక్‌, ‌పొత్తూరి, బూదరాజు రాధాకృష్ణ, సుబ్బారాయుడు, దుగ్గరాజు శ్రీనివాసరావు, ఎ సాయిశేఖర్‌, ఎం ‌వీఅర్‌ ‌శాస్త్రి, సి వి నరసింహారెడ్డి, సూరావజల రాము, వి ఎల్‌ ఎన్‌ ‌రావు, పెద్దాడ నవీన్‌… ‌నేను సైతం, రామోజీరావుపై అభిప్రాయాలను సూటిగా డొంక తిరుగుడులేకుండా కుండబద్దలు కొట్టారు ఈ పుస్తకంలో.

ఈ పుస్తకం మొత్తానికి మకుటాయమానం .. నాలుగో ప్రధాన భాగం ‘‘స్టాఫ్‌ ‌దట్‌ ‌మాటర్స్’’, అయిదో అధ్యాయం ‘‘యోధానుయోధులు’’. గత అయిదు దశాబ్దాలకాలంలో ఈనాడులో వివిధ హోదాల్లో పనిచేసి మాజీలైన వందలమంది జర్నలిస్టులు  మీడియా సహా, ఎన్నోరంగాల్లో సమున్నత శిఖరాలకు చేరారు. కాల్వ శ్రీనివాసులు, కురసాల కన్నబాబు మంత్రులయ్యారు, పలువురు ఎమ్మెల్యేలయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్‌, ‌జివిడి కృష్ణమోహన్‌.. ఆం‌ధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వ సలహాదారులు, టంకసాల అశోక్‌ ‌తెలంగాణ ప్రభుత్వ సలహారు అయ్యారు. పొత్తూరి వెంకటేశ్వరరావు, డి అమర్‌, ‌టి సురేందర్‌ ‌ప్రెస్‌ అకాడెమీ అధ్యక్షులయ్యారు. గజ్జల మల్లారెడ్డి, ఎబికె ప్రసాద్‌ అధికార భాషా సంఘం అధ్యక్షులయ్యారు. రాపోలు ఆనంద భాస్కర్‌ ‌రాజ్యసభ సభ్యులయ్యారు. ఇవాళ సంస్థలో లేకున్నా, ఒకనాడు రామోజీరావు ఈనాడు ఫాక్టరీ ఉత్పత్తి చేసిన జర్నలిస్టుల్లో నేనూ ఒకడినన్న గర్వం నాకుంది.

అనేక దిన, వార, పక్ష, మాస పత్రికల్లో ఎడిటర్లుగా ఎదిగారు. ఎన్నో ఎన్నెన్నో శిఖరాలు అధిరోహించారు. జి ఎస్‌ ‌వరదాచారి, ఎబికె, పొత్తూరి, విహెచ్‌, ‌టివి కృష్ణ, రాంభట్ల,చలసాని ప్రసాదరావు, ఎం. రాజేంద్ర, వాసిరెడ్డి సత్యనరాయాణ, జి శ్రీరామమూర్తి, ఎం వి ఆర్‌ ‌శాస్త్రి, కె ఎన్‌ ‌వై పతంజలి, ఎం ఇ వి ప్రసాదరెడ్డి, జి వల్లీశ్వర్‌, ‌దిలీప్‌ ‌రెడ్డి, సత్యమూర్తి, వై ఎస్‌ ఆర్‌ ‌శర్మ, ముళ్ళపూడి సదాశివశర్మ, తిగుళ్ళ కృష్ణమూర్తి, పాశం యాదగిరి, ఆర్వీ రామారావు, ఎ విశ్వేశ్వరేడ్డి, జె చెన్నయ్య… ఒకళ్ళా ఇద్దరా.. ఇలా వందల సంఖ్యలో  వ్యాపార, చలనచిత్ర, ఎలక్ట్రానిక్‌ ‌చానల్‌, ‌శాస్త్ర, కళా..రంగాల్లో దివ్వెలుగా వెలుతున్న వైనం వివరించారు రచయిత.

చివరగా… తెలుగువారి అడుగడుగులో మమేకం అయి ఉన్న రామోజీ జీవితమూ, కార్యకలాపాలు కూడా బహిరంగ వ్యవహారమే అని చక్రధర్‌ ‌చెబుతూ, ‘‘ 75 ఏళ్ళ పండగను, ఆ పై నూరేళ్ళ పండగనూ అలా జరుపుకుంటూ ముందుకు పరుగులిడుతూ, రామోజీ మానస పుత్రిక అయిన ఈనాడు తెలుగువారందరి మానస పుత్రికగా,  దారి దీపంగా ప్రవర్ధమానం కావాలని  నిండు మనసుతో కాంక్షిస్తున్నాను’’, అంటారు గోవిందరాజు చక్రధర్‌. ‌పుస్తకం పూర్తిగా చదివితే రామోజీరావు లోని ఆ వ్యక్తి ఏమిటో పూర్తిగా మనకు తెలుస్తుంది.   – నందిరాజు
ముద్రణ, ప్రచురణకర్త బి డా. గోవిందరాజు చక్రధర్‌,

‌వెల రు. 300/-
ప్రతులకు హైదరాబాద్‌ ‌నవోదయ  బుక్‌ ‌హౌజ్‌,
‌జి చక్రధర్‌, ‌గూగుల్‌ ‌పే, ఫోన్‌ ‌పే 98498-70250

Leave a Reply