Take a fresh look at your lifestyle.

వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో … 30శాతం కేటాయింపులు

  • వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు  నాబార్డ్ ‌శ్రద్ధ చూపాలి
  • వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత
  • నాబార్డ్ ‌రుణప్రణాళిక సదస్సులో ఆర్థిక మంత్రి తన్నీర్‌హరీష్‌ ‌రావు 

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని, బడ్జెట్‌లో 30 శాతం వ్యవసాయానికి కేటాయిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీర్‌ ‌హరీశ్‌రావు స్పష్టం చేశారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు నాబార్డ్ ‌రుణప్రణాళికలను రూపొందించాలలని మంత్రి సూచించారు. గురువారం ఒక ప్రైవేట్‌హోటల్‌లో జరిగిన నాబార్డ్ ‌రుణప్రణాళిక సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన  తొలి ఏడాది నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వ్యవసాయానికి  మొట్టమొదటి ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారని, రాష్ట్రంలో జలకళతో నిండిన ప్రాజెక్ట్‌లే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన ప్రాసెసింగ్‌, ‌మార్కెటింగ్‌, ‌స్టోరేజీ,ఎగుమతి తదితర రంగాలపై శ్రద్ధవహించాలని సూచించారు. నాబార్డు కార్యాచరణ ప్రణాళికలు  రూపొందించే సందర్భంలో ఉత్తమ రైతులను ఆహ్వానించాలని చెప్పారు.తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు నాబార్డ్ ‌చాలా సాయం అందించిందని చెప్పారు.2014లో గోదాముల సామర్థ్యం చాలా తక్కువగా ఉండేదని సీఎం.కేసీఆర్‌  ఆదేశాలతో గోదాముల సామర్థ్యం పెంచామని చెప్పారు. తాను మార్కెటింగ్‌ ‌శాఖ మంత్రిగా వ్యవరించిన సందర్భంలో 1056కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా గోదాముల నిర్మాణం చేపట్టామని వివరించారు. ఆ తర్వాత మైక్రో ఇరిగేషన్‌కు రెండో ప్రాధాన్యం ఇచ్చామని  మైక్రో ఇరిగేషన్‌కు నాబార్డ్ ‌రూ.874కోట్ల రుణసదుపాయాన్ని కల్పించిందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయానికి బడ్జెట్‌లో 30 శాతం నిధులను కేటాయించడంలేదని మంత్రి చెప్పారు.రైతులకు బీమాసౌకర్యం కల్పించామని , దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ సదుపాయం లేదని, దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ సదుపాయాలను కల్పించేందుకు ఆలోచనలు చేస్తున్నాయని, తెలంగాణలో అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలను అధ్యయనం చేస్తున్నాయని తెలిపారు.గత ఐదేళ్లుగా రుణమాఫీ పథకం అమలు చేస్తున్నామనిచ,,ఈ పథకం కోసం ఏటా రూ. ఆరువేల కోట్లు ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి వివరించారు.

రైతు ఏ కారణంతో చనిపోయినా, ఆ రైతు కుటుంబానికి రూ. 5లక్షలు బీమా  అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ  బీమా సౌకర్యం కోసం రూ.1136కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.వ్యవసాయ బావులకు ఉచిత విద్యుత్తు సదుపాయం  అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మేజర్‌ ‌లిఫ్ట్ ఇరిగేషన్‌  ‌ప్రాజెక్ట్‌లు కాళేశ్వరం, నెట్టెంపాడు, బీమా వంటి లిఫ్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్ట్‌లద్వారా ఉచిత విద్యుత్తు సదుపాయం కల్పించి నీటి సరఫరా చేస్తున్నామని  మంత్రి పేర్కొన్నారు.ఈ విధంగా సరఫరా చేస్తున్న ఉచిత కరెంట్‌కోసం ఏటా రూ.8వేలకోట్లు వ్యయం చేస్తున్నామని తెలిపారు. పశుసంవర్ధకశాఖ ద్వారా వ్యవసాయ ఆధారితాలైన డైరీ, ఫిషరీస్‌, ‌పౌల్ట్రి, గొర్రెల పెంపకం కోసం నిధులు కేటాయిస్తున్నామని తద్వారా వ్యవసాయ ఆధారిత రంగాలన్నీ  ధృఢంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నీటిపారుదుల ప్రాజెక్ట్‌లకోసం బడ్జెట్‌ ‌ద్వారా రూ.9వేల కోట్లు,  బ్యాంకులు ఇచ్చే రుణసదుపాయం ద్వారా రూ.25వేలకోట్లు ఖర్చు చేస్తున్నామని, నీటి పారుదల ప్రాజెక్ట్‌లు గొప్ఫ ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ం ఏర్పడకముందు పేపర్లలో రైతుల  ఆత్మహత్యల వార్తలు ఉండేవని, అన్నీ పేపర్లలో ఆ వార్తలు లేకుండా పోయాయని, ఇది  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వ్యవసాయ రంగంపై చూపుతున్న శ్రద్దకు నిదర్శనమని మంత్రి వివరించారు,. వ్యవసాయం దండుగ అనే స్థాయి నుంచి వ్యవసాయం పండుగ అనే దశకు చేరుకున్నామని చెప్పారు.

తెలంగాణ సీడ్‌బౌల్‌ ఆఫ్‌ ఇం‌డియాగా అభివృద్ధి చెందుతున్నదని, కేవలం ఇండియాకే కాదు, ఆఫ్రికా, ఆసియా, దేశాలకు,  విత్తన ఎగుమతి రంగంలో తెలంగాణ భాగస్వామ్యం  పెరిగిందని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చొరవతో రెవెన్యూ రికార్డుల సమస్యలను  పారదర్శకంగా పరిష్కరించామని, దేశంలో ఎక్కడా లేని విధంగా రెవెన్యూ విధానాలతో రైతుల సమస్యలకు పరిష్కారాలను చూపామని చెప్పారు.96శాతం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరిగిందని, మిగిలిన నాలుగుశాతం లీగల్‌ ‌కేసులకు సంబంధించినవేనని చెప్పారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను బలోపేతం చేసేందుకు బ్యాంకులు రుణాలను ఇవ్వాలని సూచించారు. తమ ప్రభుత్వం తరపున గొల్ల కురుమల కోసం రూ.4500కోట్లతో గొర్రెల యూనిట్లు ఇస్తున్నామ  ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 3లక్షల 75వేల యూనిట్లు లబ్దిదారులకు ఇచ్చామని మంత్రి చెప్పారు. దేశంలోనే తొలిసారిగా మోబైల్‌ ‌వెటర్నరీ క్లినిక్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలో ఎక్కువ ఫిషరీస్‌ ‌యూనిట్లు ఉన్న రాష్ట్రం కూడా తెలంగాణాయేనని అన్నారు.రాష్ట్రంలో 4400 ఫిషరీస్‌ ‌సొసైటీలు  ఉన్నాయని  తెలిపారు.ఈ సొసైటీల ద్వారా 2లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయని చెప్పారు.మిషన్‌కాకతీయ  ద్వారా చెరువులను బాగుచేసి రిజర్వాయర్లలలో  రూ.64కోట్లతో 3.4 కోట్ల ఫిష్‌సీడ్స్ ఉచితంగా పంపిణీ చేశామని, దీనితో వేలకోట్ల ఆదాయం పెరిగిందని,  ఫిషరీస్‌రంగంలో కేరళ తర్వాత తెలంగాణ రెండోస్థానంలో ఉన్నదని మంత్రి తెలిపారు.  పండించిన పంటలకు మార్కెటింగ్‌ ‌సదుపాయం కల్పించడం  ప్రధాన సమస్యగా ఉన్నదని ప్రాసెసింగ్‌ ‌సౌకర్యం కల్పించినట్లయితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.నాబార్డ్ , ‌రూరల్‌బ్యాంకులు, వాణిజ్యబ్యాంకులు, వ్యవసాయశాఖ, గ్రామీణాభివృద్ధిశాఖలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. వ్యవసాయ రంగంలో  కూలీల సమస్య పెరిగిపోతున్నదని చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సమస్యలపైన దృష్టిసారించారని తెలిపారు.జపాన్‌,ఇ‌జ్రాయెల్‌ ‌దేశాలకు చెందిన టెక్నాలజీని సాంకేతిక పరికరాలను పరిశీలించాలని, వ్యవసాయరంగంలో సాంకేతిక తను, ఆధునికతను పెంచాలని ఆయన  ఆదేశించారని, వ్యవసాయశాఖ తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నదని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.వరినాట్ల యంత్రం, కలుపుతీసే యంత్రం, కుప్పనూర్పేయంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రాయితీలను ఇస్తున్నదని, బ్యాంకులు మద్దతును ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply