Take a fresh look at your lifestyle.

వీరులకు వందనాలు

కర్మ భూమి గుండె కంపిస్తున్నది
గాలి ఆగి ఆగి కదులుతోంది
నీరు నిశ్శబ్ద అశ్రువులు అర్పిస్తోంది
కడలి అల నాట్యాన్నే మరచింది
సరిహద్దు కంచె కన్నీరు పెడుతోంది
సైన్య ఆయుధం ఎక్కెక్కి ఏడుస్తోంది
భరతమాత కన్నీటి పర్యంతమైంది
భరతజాతి ఊపిరి పీల్చడమే మరిచింది
హిందుస్థాన్‌ ‌కన్నీటి నివాళి ఇస్తోంది !

అలుపెరుగని అసమాన ధీరుడు
శత్రు దేశాల గుండెల్లో సింహస్వప్నం
భయాన్నే భయపెట్టగల సైన్యాధినేత
తొలి త్రివిధ దళాల అధిపతి రావత్‌
‌భయమే ఎరుగని బలమైన బిపిన్‌
ఆధునిక యుద్ధతంత్రల్లో దిట్ట రావత్‌
‌సర్జికల్‌ ‌స్ట్రైక్‌ ‌వ్యూహచతుకరుడు
అసమాన ధీర సైనిక వ్యూహకర్త !

విధి బలీయపు దుర్ఘటన శాపం
పొగ మంచు ప్రతికూల గడియన..
గగనాన్ని సైనిక విహంగ విషాదం
బలిగొన్న హెలికాప్టర్‌  ‌బాహుబలి
వీర యోధుల్ని కబళించిన ఛాపర్‌
‌మేరునగ శిఖరాలు కమిలిపోయి..
నీలగిరిలో నేలరాలిన భారత వీరులు !

మరణంలోనూ మధులిక తోడుగా
స్వర్గ భద్రత విధుల నిర్వహణకు
భగవంతుడే పిలిపించుకున్నాడేమో..
భారతిని వదలి శివైక్యం పొందిన..
భారత బలగాల మేధో అగ్రాధిపతి
అమరుల త్యాగాలకు శిరస్సు వంచి..
దేశ రక్షకుల అసమాన త్యాగాలకు..
యావద్భారతి వందనాలర్పిస్తోంది !

యోధుల పాదధూళి తగిలి..
జాతిహితవరులను మదిన తలచి..
అసమాన త్యాగాలకు తలవంచి..
యువత పౌరుషంతో మేల్కొని..
భరతమాత సేవలను శ్వాసిస్తూ..
శత్రువుల గుండెల్లో సింహస్వప్నాలై..
జాగృత భారతిని భుజాన మోద్దాం
దివ్య భవ్య ధైర్య సాహసులవుదాం !

 – మధుపాళీ,  కరీంనగర్‌, 9949700037

Leave a Reply