Take a fresh look at your lifestyle.

సుజాత మాకు చెల్లెలాంటిది

నేను, ఎంపి కేపీఆర్‌ ‌కుడి, ఎడమ భుజంగా పని చేస్తాం
ఆర్‌ఎల్‌ఆర్‌  ‌తుది శ్వాస వరకు
ప్రజా సేవకు పాటుపడ్డారు
సుదీర్ఘ ప్రజా సేవకు పార్టీ ఇచ్చిన గుర్తింపు
టికెట్‌ ఇచ్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు: మంత్రి హరీష్‌రావు

దివంగత దుబ్బా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి  ఎనలేని సుదీర్ఘ ప్రజా  సేవలకు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ గౌరవాన్ని ఇస్తూ.. ఆయన సతీమణి  సోలిపేట సుజాతకు సీఎం కేసీఆర్‌  ‌దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చిట్టాపూర్‌లో రామలింగారెడ్డి చిత్రపటానికి పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమెకు  అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన విషయాన్ని తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రచారానికి కి తీసుకెళ్లడానికి వచ్చాను అని చెప్పారు. రామలింగారెడ్డి  2004లో శాసనసభ్యుడుగా ఎన్నికైన తర్వాత  అనేక ఉద్యమాలు చేశారనీ,  తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారన్నారు.  ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారనీ గుర్తు చేశారు..

దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని చేశారని రామలింగారెడ్డి కుటుంబం  అటు ఉద్యమంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాల్పంచుకున్నారన్నారు. నియోజకవర్గ  వ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉందన్నారు. 4పర్యాయాలు ఎమ్మెల్యే ఃగా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం దుబ్బాక ప్రాంతానికి ఎనలేని సేవ చేశారన్నారు. రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగించాలని వారి కుటుంబానికి టిక్కెట్‌ ఇచ్చినందుకు సిఎం కేసీఆర్‌ ‌ధన్యవాదాలు తెలుపుతూ..రామలింగారెడ్డిని ఏ విధంగా అయితే  ఆశీర్వదించారో సోలిపేట సుజాత కూడా అదే విధంగా  ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. రామలింగారెడ్డి   తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొంసాగిస్తామని ఈ సందర్భంగా చెప్పారు..

తెలంగాణ లో ఉన్న సంక్షేమ పథకాలు దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌గా నిలిచాయని.. అదే స్ఫూర్తితో దుబ్బాక నియోజక వర్గాన్ని రామలింగారెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు. ఇప్పుడు రామలింగారెడ్డి ని స్ఫూర్తి గా తీసుకుని ఆయన సతీమణి పనిచేసి పూర్తి చేస్తదన్నారు.  పేదల కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి రామలింగారెడ్డి.. దుబ్బాక దశ దిశ మార్చిన గొప్ప వ్యక్తి.. రామలింగారెడ్డి భార్య అంటే మాకు చెల్లె లాంటిది. నేను, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇద్దరం  కుడి ఎడమ భుజం వలే పనిచేస్తామన్నారు.   ముఖ్యమంత్రి ఆదేశానుసారం రామలింగారెడ్డి సతీమణిని కలిసి.. మాతో పాటు ప్రచారానికి తిరిగేందుకు తీసుకెళ్లడానికి వారి ఇంటికి వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి. మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ ‌రెడ్డి, ఆందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, ‌సుడా డైరెక్టర్‌ ‌మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, స్థానిక నాయకులు రొట్టె రాజమౌళి తదితరులు ఉన్నారు.

దుబ్బాక గాంధీ చౌరస్తా వద్దకు చర్చకు వస్తారా?
కాంగ్రెస్‌, ‌బిజెపి నేతలకు మంత్రి హరీష్‌రావు సవాల్‌
‌సిద్ధిపేట జిల్లా దుబ్బాక రెడ్డి ఫంక్షన్‌ ‌హాల్‌లో దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపూర్‌ ఎం‌పిటిసి మాధవి-చంద్రశేఖర్‌రెడ్డి (ఆర్‌ ‌సిఆర్‌ ) ‌తో పాటు సుమారు వందమంది మంత్రి హరీష్‌ ‌రావు,  ఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. ఈ సందర్భంగా  మంత్రి హరీష్‌ ‌రావు  మాట్లాడుతూ..  మల్లన్నసాగర్‌ ‌ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్న వ్యక్తులే ఈ రోజు దుబ్బాక ఎన్నికలలో బరిలో ఉన్నారనీ, అలాంటి వారికి వోట్లు ఎలా వేస్తారనీ ప్రశ్నించారు.   మల్లన్న సాగర్‌ ‌నిర్మాణంపై వారి ఖాతా నుండి ప్రైవేట్‌ ‌లాయర్లకు డబ్బులు ఇవ్వలేదా?అని నిలదీశారు.   కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీల నేతలు ప్రాజెక్టులను అడ్డుకున్నది వాస్తవం కాదా? అది నిజం కాదంటే దుబ్బాక గాంధీ వద్ద చర్చకు వస్తారా? అంటూ సవాల్‌ ‌విసిరారు.  తెలంగాణ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న మాట వాస్తవమా కాదా? అన్నారు. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ జెండా ఎగరడం ఖాయమనీ మంత్రి హరీష్‌రావు  ధీమా వ్యక్తం చేశారు.   ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు దుబ్బాకలో వోట్లు అడిగే నైతిక అర్హత లేదనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి.

Leave a Reply