Take a fresh look at your lifestyle.

అన్నదానానికి సహకరిస్తున్న దాతలకు దన్యవాదాలు

కరోనా మహామ్మారి బారిన పడకుండా కాపాడేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌ ‌డౌన్‌ ‌నేపథ్యంలో మా తండ్రి కీ.శే.బూసిరెడ్డి సీతారామిరెడ్డి చారిటబుల్‌ ‌ట్రస్ట్ ‌పేరుతో నేటికి 33 రోజులుగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం లో గురువారం మధ్యాహ్నం 550 మంది అన్నార్తులకు భోజనాల వితరణ జరిగింది.నేటి దాత పత్తి కోటిరెడ్డి చేతుల మీదుగా నేటి మధ్యాహ్నం అన్నదాన భోజన పొట్లాల పంపిణీ ప్రారంభించడం జరిగింది.

అన్నపూర్ణ ఫంక్షన్‌ ‌హాలు నందు తాత్కాలికంగా వసతి పొందుతున్న నిరాశ్రయులకు, భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందలి రోగులకు సహాయకులకు, భద్రాచలం పట్టణ మరియూ భద్రాచలం పట్టణ మరియు సరిహద్దుల లోని తెలంగాణా మరియు ఆంద్రా పోలీసు చెక్‌ ‌పోస్టులలో, ఎటపాక, కన్నాయిగూడెం చెక్‌ ‌పోస్టులలో అహర్నిశలు విధులు నిర్వహిస్తున్న పోలీసు రక్షక భటులకు, బూర్గంపహాడ్‌ ‌పియస్‌ ‌నందలి సారపాక, వేలేరు పోలీసు చెక్‌ ‌పోస్టుల నందు విధులు నిర్వహిస్తున్న పోలీసు రక్షక భటులకు అక్కడ విధుల్లో వున్న ఇతర సిబ్బందికీ మరియు స్వంత ఊళ్ళు వెళ్లలేక భద్రాచలం లొనే చిక్కుకు పోయిన ప్రభుత్వ బిఈడీ కళాశాల విద్యార్థిని విధ్యార్థులకు అన్నార్తులకు మూడు వాహనాల ద్వారా 550 భోజన పొట్లాలను పంపిణీ జేయడం జరిగింది.ఈ•

కార్యక్రమంలో పత్తి కోటిరెడ్డి తో పాటుగా పలువురు వాఉకర్స క్లబ్బు సభ్యులతో పాటుగా బాచినేని రామకృష్ణ, న్యాయవాది పామరాజు తిరుమలరావు, సేవాబృంద సభ్యులు గంజి సంపత్‌, ‌వంటమాష్టరు జబర్దస్త్ ‌రమేష్‌ ‌కంచర్ల, సహాయ వంట మాస్టర్‌ ‌హైదరాబాద్‌ ఉపేందర్‌ ‌సింగ్‌, ‌కావూరి ప్రభాకర్‌, ‌కాకరాల శ్రీనివాసశర్మ, యాకుబ్‌ ‌రెడ్డి, బిందు ప్రభాకర్‌, ‌రాంగోటి గిరి, కొండారెడ్డి, రమేష్‌, ‌సన్నీ, సాహిత్‌, ‌రామచందర్‌, ‌గుండే రామారావు, హసీనా, నూర్జహాన్‌, ‌షేక్‌ ‌మీరా అన్వేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply