Take a fresh look at your lifestyle.

పాఠ్య పుస్తకాల ‘అమ్మకాలు’ అంతంత మాత్రం

కొరోనా కారణంగా 2020 21 విద్యా సంవత్సరం నాలుగు నెలలు ఆలస్యంగా ప్రారంభం కావడం…అదీ ప్రభుత్వం పాఠశాలల్లో ఆన్‌లైన్‌ ‌విద్యా బోధనకే అనుమతించడంతో పాఠ్య పుస్తకాల విక్రయదారులకు ఆర్థికంగా తీవ్ర నష్టాలను మిగిల్చింది.  1 నుంచి 10 తరగతి పాఠ్య పుస్తకాల ముద్రణా, అమ్మకం బాధ్యతను చేపట్టిన ప్రింటర్లు, పబ్లిషర్లు అమ్మకాలు లేక తీవ్రంగా నష్ట పోతున్నారు. కొరోనా కారణంగా అసలే ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌ప్రింటింగ్‌ ఆర్డర్లు లేక పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయిన ముద్రాపకులకు ముద్రించిన పుస్తకాలు సైతం అమ్ముడుపోకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 2020 21 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు కావలసిన తరగతులు 1 నుంచి 10 వరకు పాఠ్య పుస్తకాల ముద్రణ, అమ్మకం కోసం తెలంగాణ టెక్సట్‌బుక్స్ ‌ప్రెస్‌ ఈ ‌సంవత్సరం టెండర్లు పిలిచింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ముద్రాపకులు పాల్గొన్న 33 మంది ముద్రాపకులు పాఠ్యపుస్తకాలు ముద్రించినప్పటికీ విక్రయాలు జరగకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

venkateswara sharma

కొరోనాతో పబ్లిషర్లకు ఆర్థికంగా నష్టం వాస్తవమే : వెంకటేశ్వర శర్మ డైరెక్టర్‌
‌రాష్ట్రంలో లాక్‌డౌన్‌లో కారణంగా ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ
జరగకపోవడంతో ముద్రా పకులకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిన విషయం వాస్తవమేనని రాష్ట్ర పాఠ్యపుస్తకాల ముద్రణ కేంద్రం డైరెక్టర్‌ ‌వెంకటేశ్వర శర్మ అన్నారు. ప్రభుత్వం ఎప్పటిలాగే ముద్రాపకులకు పాఠ్య పుస్తకాల ముద్రణకు టెండర్ల ద్వారా అవకాశం కల్పించిందన్నారు. అయితే, కొరోనా కారణంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని చెల్లించలేమన్న ముద్రాపకుల అభ్యర్థన మేరకు పాఠ్యపుస్తకాలు విక్రయించిన తరువాతనే రాయల్టీ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ‌తరగతులు ప్రారంభమైన దృష్ట్యా ఇప్పుడిప్పుడే పాఠ్య పుస్తకాల విక్రయాలు ఊపందుకున్నాయని ఇప్పటి వరకు 35 శాతం పుస్తకాల విక్రయాలు జరిగినట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం ముగిసిన తరువాత వచ్చే ఏడాది జూన్‌లో ముద్రాపకులు ఎన్ని పుస్తకాలను విక్రయించారు అనే  సంఖ్యను పరిశీలించి వారు ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఏవిధంగా అందజేయాలని అనే అంశాన్ని పరిశీలిస్తామని వెంకటేశ్వరశర్మ చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply