Take a fresh look at your lifestyle.

దక్షిణాదిలో బిజెపికి పరీక్షా సమయం .. !

కర్ణాటక అసెంబ్లీ   ఎన్నికల ఫలితాలు నేడు  వెలువడనున్నాయి. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు ఇప్పటికే వెల్లడించాయి. ఇవిఎంలను లెక్కిస్తే తప్ప ఎవరు నెగ్గారో తేలదు.. బిజెపి మాత్రం తాము సర్వేలను నమ్మమని, అధికారం తమదే అన్న ధీమాతో ఉంది. ప్రధానంగా దక్షిణాదిన బిజెపి అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక మాత్రమే.  ఇక్కడ ఓటమి అంటే దక్షిణాదిలో బిజెపికి దెబ్బగా భావించాల్సిందే. ఇక్కడ ఓడిపోతే దాని ప్రభావం ప్రధానంగా ఉభయ తెలుగు రాష్టాల్రపై పడుతుంది. అలాగే బిఆర్‌ఎస్‌తో జాతీయ రాజకీయాల్లోకి వొస్తున్న తెలంగాణ సిఎం కెసిఆర్‌కు కూడా బలం చేకూరు తుంది. ప్రధాని మోదీ ఛరిష్మాపైనా ప్రభావం పడుతుంది. ఇకపోతే ప్రధానంగా కర్ణాటకలో వోటర్ల మనోగతం కూడా బిజెపికి వ్యతిరేకంగానే ఉంది. పెరిగిన గ్యాస్‌, ‌పెట్రో ధరలపై ఆగ్రహంగా ఉన్నారు. జిఎస్టీ వాయింపులు, నిత్సావసర సరుకుల ధరలు, ఆదానీ వ్యవహారం కూడా సామాన్యుల్లో చర్చకు దారితీసాయి. వీటన్నింటిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని కర్ణాట• పోలింగ్‌ ‌సందర్భంగా ప్రజల మాటలను బట్టి తెలిసిపోయింది. అయితే ఇవేవీ బిజెపి పట్టించుకునే దశలో లేదు. ఈ క్రమంలో కర్ణాటక లో బిజెపి ఓడితే తెలంగాణలో ఆ పార్టీ దూకుడుకు కళ్లెం పడుతుంది.అలాగే కెసిఆర్‌ ‌మోదీ వ్యతిరేక వాదనకు బలం చేకూరు తుంది. మోదీ•ని దుయ్యబట్టేందుకు మరింత బలం వొస్తుంది. మరోవైపు ఎపిలో పొత్తుల కోసం వెంపర్లాడు తున్న బిజెపికి అక్కడి ప్రజల నుంచి విభజన సమస్యలపై డిమాండ్లు కూడా వొస్తాయి. కర్ణాటక  లో గెలిస్తే బిజెపి సాదాసీదాగా మళ్లీ ముందుకు పోవచ్చు.

కానీ ఓడితే తన విధానాలను పూర్తిగా సవి•క్షించుకోవాల్సి ఉంటుంది. ఆదానీ వ్యవహారంలో ఇంకా దాగుడుమూతలు ఆడడానికి ఉండదు. విభజన సమస్యలపై దాటవేత కుదరదు. ఈ క్రమంలో ఆంధప్రదేశ్‌ ‌రాజకీయాలు ఆసక్తిరకంగా మారనున్నాయి. కర్ణాటక లో ఓటమి చెందితే ఎపిలో బిజెపి పొత్తులతో ముందుకు సాగక తప్పదు. జనసేన అధినేత పవన్‌ ‌కల్యాణ్‌ ‌వైసీపీ విముక్త ఏపీ కోసం కలసి వొచ్చే పార్టీలను ఒప్పిస్తామని ప్రకటించారు. ఆయన ఉద్దేశంలో ఒప్పించాల్సిన పార్టీ బీజేపీ ఒక్కటే. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. ఏపీలోఎన్నికల్లో వైసిపిని ఓడించాలంటే బీజేపీ కూడా కూటమిలో ఉండాలని పవన్‌ ‌గట్టిగా నమ్ముతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో వొచ్చే ఫలితాన్ని బట్టి బీజేపీ ఏపీ పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకే పవన్‌ ‌కల్యాణ్‌ ‌బీజేపీని ఒప్పిస్తామని చెబుతున్నారు. అయితే బీజేపీ ఇప్పటి వరకూ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు.  ఆంధప్రదేశ్‌లో బీజేపీ పొత్తులు పెట్టుకోవాలంటే కేంద్ర రాజకీయాల్లో మార్పులను కూడా ఆహ్వానించాలి. ప్రజలకు మేలు చేసే పథకాలు లేదా పనుల గురించి ఆలోచన చేయాల్సి ఉంటుంది. పోలవరం లాంటి ప్రాజెక్టును ఇక ఏమాత్రం నాన్చకుండా పూర్తి చేసే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో పొత్తులు పెట్టకోవడం అనేది కేవలం.. ఏపీ రాజకీయాల వి•ద ఆధారపడి లేదు.కేంద్రంలో పరిణామాల్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో పొత్తులు ఉన్నాలేకపోయినా బీజేపీకి వొచ్చే సీట్లు పెద్దగా ఉండవు. కానీ కేంద్రంలో మాత్రం ఇక్కడ గెలిచే ప్రాంతీయ పార్టీకి చెందిన ఎంపీలు మద్దతుగా ఉండాల్సి ఉంటుంది. అందుకే బీజేపీ ఆలోచన చేయాల్సి ఉంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కర్ణాటక. అక్కడ ఓడిపోతే సెంటిమెంట్‌ ‌దెబ్బతింటుంది. గెలవకపోతే ఆ ఎఫెక్ట్ ‌తెలంగాణ ఎన్నికల్లోనూ పడుతుంది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. అదే కర్ణాటకలో గెలిస్తే పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు వొచ్చి చేరే అవకాశం ఉంది.

ప్రతికూల ఫలితం వస్తే మాత్రం.. బీజేపీకి నైరాశ్యం తప్పదు. ఇక్కడా  సహజంగానే కాంగ్రెస్‌ ‌దూకుడు పెంచుతుంది. అలాంటి సమయంలో బీజేపీ వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే..వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. కూటమి ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కూడా గుర్తించి ముందుకు సాగాల్సి ఉంటుంది. అందుకు ప్రజల్లో వొస్తున్న విమర్శల ఆధారంగా పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవల్సి ఉంటుంది. బీజేపీకి ఉత్తరాది లో గత రెండుసార్లు తిరుగులేని మెజార్టీ వొచ్చింది. ఈసారి అలాంటి ఫలితాలు కష్టమేనని ప్రజల చర్చల్లో కనిపి స్తోంది.. ప్రతీసారి అదే ఫలితాల ఆశించడం కూడా అత్యాశే కాగలదు. అలాగే మోదీ కి• తిరుగు లేదని, బిజెపికి అంతకన్నా తిరుగు లేదని అనుకోవడం కూడా భ్రమే కాగలదు. 2024లో ఎన్నికల నాటికి బిజెపి తన మొండి వైఖరులను వీడాల్సి ఆగత్యం ఉంది. బీజేపీకి అక్కడ  సీట్లు తగ్గే అవకాశం ఎలాగూ ఉంది కనుక… దక్షిణాదిలో పట్టు పెంచుకోవాలి. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలతో విన్యాసాలు చేస్తే ఇకముందు ప్రజలు నమ్మరు. కర్ణాట• ఎలాగూ చేజారుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనినిస్తున్న తరుణంలో బిజెపి ఆర్థిక విధానాలను సవి•క్షించుకోవాలి. బ్యాంకులు ప్రజలకు చేరువ కావాలి. రుణ భారాలు తగ్గాలి. కార్పోరేట్‌ అనుకూల విధానాలు తగ్గించాలి.కర్ణాట•  మినహా దక్షిణాదిలో బీజేపీ ఎలాగూ గెలిచే అవకాశాలు లేనేలేవు. ఎపిలో టిడిపి,జనసేనలతో పొత్తులకు అవకాశం ఉంది.

కానీ తెలంగాణలో అలాంటి అవకాశం లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలను బట్టి దక్షిణాదిలో బిజెపి వ్యూహాలు అనుసరించాల్సి ఉంటుంది. కర్ణాటకలో బిజెపి ప్రతిష్ట దిగజారడానికి అనేక కారణాలు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం కవి•షన్ల ప్రభుత్వంగా, అవినీతి ముద్రను వేసుకుంది. నోట్ల రద్దు, కొవిడ్‌-19 ఉపద్రవంలో అవకతవక నిర్ణయాలు, చైనా దురాక్రమణలు. ఆదానీకి మోదీ సహకరించడం, జిఎస్టీ, పెట్రో, గ్యాస్‌ ‌ధరలు వంటివి ప్రజల్లో బాగా చర్చ జరుగుతోంది. వీటన్నింటి గురించి దేశ ప్రజలకు వాస్తవాలు వెల్లడించక పోవడంతో సహా వివిధ కుంభకోణాలను ప్రజలు నిరంతరంగా గమనిస్తున్నారు.  కర్ణాటక వోటర్లను అమితంగా ప్రభావితం చేసిన ధరల పెరుగుదలకు బాధ్యులు మోదీ సర్కారే కానీ, బొమ్మై ప్రభుత్వం కాదన్న విషయం ప్రజలకు తెలిసినా…బిజెపికి అనుకూల నిర్ణయం తీసుకోరని బిజెపి గుర్తించడం లేదు. ధరల పెరుగుదల, పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం మొదలైన అంశాలే వారిని నిర్ణయాత్మకంగా ప్రభావితం చేశాయని కర్ణాటక ఫలితాలు తేల్చబోతున్నాయి.

– ప్రజాతంత్ర డెస్క్

Leave a Reply