Take a fresh look at your lifestyle.

కొరోనా కష్టాలు – కన్నీళ్ళు పరీక్షలు రాసే విద్యార్థుల్లో గందరగోళం..

  • టెన్త్, ఇం‌టర్‌, ‌డిగ్రీ, పిజి, నీట్‌, ఎం‌సెట్‌- ‌పరీక్షలెప్పుడో?

కోట్లాది మంది విద్యార్థుల జీవితాలను ‘కొరోనా’ ఆగమాగం చేసింది. అతలాకుతలం చేసింది. త్రిశంఖు స్వర్గంలోకి నెట్టింది. టెన్త్, ఇం‌టర్‌, ‌డిగ్రీ, పీజీతో సహా వందలాది వృత్తి విద్య, ఇతర• కోర్సులు చదివేవారి భవిష్యత్తు గందరగోళంలో పడింది. అనూహ్యంగా, ‘కొరోనా’ మహమ్మారి అందరి జీవితాలతో చెలగాటం ఆడుతుంది. విద్యాశాఖ మీద కొరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. టీచర్లు, లెక్చరర్లు, పాఠశాలలు, కళాశాలల భవిష్యత్తు ఏమి? ఎప్పుడు నడుస్తాయి? ఎప్పుడు టెన్త్, ఇం‌టర్‌, ‌డిగ్రీ, పీజీ, ఎంసెట్‌, ‌నీట్‌, ఐకార్‌, ఎడ్‌సెట్‌, ‌లాసెట్‌, ‌టీఎస్‌పీఎస్‌సీ, ఏపిపిఎస్‌సీ వంటి ఎగ్జామ్స్, ఎం‌ట్రన్స్ ‌పరీక్షలు జరుగుతాయి? అసలు జరుగుతాయా, లేదా అనేది తెలియటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో 11 లక్షల మంది పదో(టెన్త్) ‌తరగతి పరీక్ష రాస్తున్నారు. మార్చి 19న టెన్త్ ‌క్లాసు పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇంకా 8 పేపర్ల పరీక్షలు జరుపవల్సి ఉంది. మే 3 దాక లాక్‌డౌన్‌ ‌పొడిగించటం వల్ల టెన్త్ ‌పరీక్షలు జూన్‌లో జరుగవచ్చు. మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 6 ‌వరకు జరిగే పరీక్షల టైంటేబుల్‌ ‌ప్రకటించవల్సి ఉంది. 11 )క్షల మంది ఇంటర్‌ ‌విద్యార్థులు ఇంటర్‌ ‌పరీక్షలు రాశారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియకు ‘కొరోనా’ అడ్డంకిగా మారింది. సంస్క•తం పేపర్లతో ప్రారంభించిన తర్వాత కొరోనా ‘లాక్‌డౌన్‌’ ‌వల్ల ఇంటర్‌ ‌పేపర్‌ ‌వాల్యువేషన్‌ ఆగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ సెమిస్టర్‌, ‌బీ.ఈడి. డీ.ఈడి, ఎం.ఈడీ వంటి పరీక్షలు మార్చి నెలలో జరుగవల్సి ఉంది. విశ్వవిద్యాలయాల పరీక్షల నియంత్రణ అధికారులు డిగ్రీ పరీక్షల నిర్వాహణ మీద సకల ఏర్పాట్లు చేశాక ‘కొరోనా’ కారణంగా అకస్మాత్తుగా ఆగిపోయాయి.

టెన్త్ ‌పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడి చేసే సరికి 2020-21 విద్యా సంవత్సరంలో 2 నెలలు గడిచిపోనుంది. జూన్‌ 12‌న పాఠశాలలు తెరువాలి. మరి ఈసారి ఎప్పుడో తెలియని పరిస్థితి. టెన్త్ ‌ఫలితాలు, టెన్త్ ‌సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ‌పూర్తి చేస్తే కానీ ఇంటర్‌ అడ్మీషన్లు ప్రారంభం కావు. జూన్‌ 30 ‌నుండి ఇంటర్‌ అడ్మీషన్లు జరుగాలి. కానీ ఈసారి జులై/ అగష్టు వరకు జరిగేటట్లు ఉంది. ఇంటర్‌ ‌ఫలితాల ఆలస్యం వల్ల డిగ్రీ స్థాయి కోర్సుల మీద తీవ్ర ప్రభావం పడనున్నది. ఎంసెట్‌, ‌నీట్‌, ఎడ్‌సెట్‌, ‌లాసెట్‌, ‌డైట్‌సెట్‌, ‌పాలిసెట్‌ ‌పరీక్షల పరిస్థితి, నిర్వాహణ అగమ్యగోచరంగా మారింది. జూన్‌ ‌నెల నుండి ప్రారంభం అయ్యే 2020-21 విద్యా సంవత్సరం గందరగోళంతో పడనుంది. ప్రవేశ పరీక్షల నిర్వాహణ గాడితప్పే అవకాశం ఉంది. పీజీ కోర్సుల ప్రవేశాలు ఆగమాగం అవుతాయి. కొరోనా అదుపులోకి వస్తే అన్ని రాష్ట్ర, జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు ‘శుభం కార్డు’ పడనున్నది. ఇప్పటికే ఎంసెట్‌, ‌నీట్‌ ‌వంటి పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రకృతి విపత్తైన కొరోనా మహమ్మారి ప్రజలు, విద్యార్థులు, అందరి బ్రతుకులను చిన్నాభిన్నం చేసింది. అన్ని రంగాలు దెబ్బ తింటున్నాయి. విద్యారంగం మీద కూడా కొరోనా ప్రభావం తీవ్రమైనది. లక్షలాది మంది జీవితాలు గందరగోళంలో పడ్డాయి. దేవుడా! నీవే రక్షించాలి!.

ravula rajesham

Leave a Reply