Take a fresh look at your lifestyle.

పది పరీక్షలు రద్దు చేయాలి-తెలంగాణ బాలల హక్కుల సంక్షేమ సంఘం

  • అంతర్గత మూల్యాంకన మార్కుల ఆధారంగా గ్రేడ్లు/ఫలితాలు  ప్రకటించాలి
  • తెలంగాణ బాలల హక్కుల సంక్షేమ సంఘం విఙ్ఙప్తి.
పదవ తరగతి వార్షిక పరీక్షలు 2020 వ్రాసే విద్యార్థులకు ఇంకా ఇంగ్లీషు,గణితం,సైన్స్,సోషల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పరీక్షల  నిర్వహణ నేటి కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల దృష్ట్యా  రధ్ధు చేయాలని అందుకు ప్రత్యామ్నాయంగా గత సంవత్సరం  9వ తరగతి మరియు ఈ సంవత్సరం పదవ తరగతిలో నిర్వహించిన అంతర్గత మూల్యాంకనం(Internal Assesment Marks) ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించి ఫలితాలు ప్రకటించాలని  తెలంగాణ బాలల హక్కుల సంక్షేమ సంఘం ప్రభుత్వానికి  విఙ్ఙప్తి చేసింది
  ఇప్పటికే తల్లిదండ్రులు, విద్యావేత్తలు,బాలల హక్కుల సంక్షేమ సంఘాలు  పరీక్షలనిర్వహణ అంత సులభమైందేం కాదని, ఆ ఆలోచన మానుకోవాలని కోరుచున్నరు.
కనుక విద్యాశాఖాధికారులు ఆలోచించాలని కోరుతున్నాము. గౌరవ ఉన్నత న్యాయస్థానం ముందు   ప్రభుత్వం పూర్తి భరోసాను ఇవ్వలేకపోతుంది. ఒకవేళ ఇప్పుడు పరీక్షరాయలేక పోయిన వారు ఆగష్టులో వ్రాసుకోవచ్చని ప్రభుత్వం చెబుతుందంటే ఎంతో కొంత సమస్య తీవ్రత ఉన్నదనే విషయం చెప్పకనే చెబుతున్నది. రాష్ట్రంలో కరోనా కేసులు కూడా రోజు రోజుకు పెరుగుతున్నవి. ఇవి జూన్ జులైలో మరింత పెరగవచ్చని  సిసిఎంబి డైరక్టర్ గారు ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇంకొక ముఖ్యవిషయం ఏమిటంటే జూన్ 8 నుండి హోటళ్ళు,ప్రార్థనా మందిరాలు కూడా తెరుస్తున్నరు. మరింతగ ప్రజల సంచారం పెరుగుతుంది. ఇప్పుడు పెరుగుతున్న కరోనా  కేసులకు మించి మరిన్ని కేసులు  పెరిగే ఆస్కారం కూడా ఉందన్నవిషయం మరిచిపోవధ్ధు.. అని   జి.కిష్టయ్య, కన్వీనర్ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply