Take a fresh look at your lifestyle.

విద్యార్థుల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇం‌టర్‌ ‌పరీక్షలు

తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పండి
నాడు-నేడు సీమక్షలో సిఎం జగన్‌ ‌పునరుద్ఘాటన
అమరావతి, ఏప్రిల్‌ 30 : ‌విద్యార్థుల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇం‌టర్‌ ‌పరీక్షల నిర్వహించాలని అనుకుంటున్నామని సీఎం జగన్‌ ‌తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఏ పరిస్థితిలో, ఎందుకు పరీక్షలు పెడుతున్నామన్నది ప్రజలకు చెప్పాలన్నారు. పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్‌ ‌మార్కులు మాత్రమే ఇస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. కేరళలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారని గుర్తుచేశారు. పదవ తరగతి, ఇంటర్‌ ‌పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదని, నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసిందని, దీంతో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని జగన్‌ ‌తెలిపారు. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని పరీక్షలను రద్దు చేశాయని పేర్కొన్నారు. పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయని జగన్‌ ‌చెప్పారు. నాడు-నేడు పాఠశాల విద్యాశాఖపై క్యాంప్‌ ‌కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

మనబడి మొదటిదశలో 15,715 స్కూళ్లలో చేపట్టిన పనుల పురోగతిని సీఎం జగన్‌ ‌క్యాంప్‌ ‌కార్యాలయంలో సమీక్షించారు. పనులు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయన్న అధికారులు, ఆ వివరాలను ప్రజెంటేషన్‌లో చూపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ‌మాట్లాడుతూ..రూపురేఖలు మార్చుకుంటున్న స్కూళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా పాఠశాలల గోడలకు వేసినట్లు, బిల్డింగ్‌పై కూడా పెయింటింగ్స్ ‌వేయాలన్నారు. పనులు పూర్తయ్యాక, ప్రతి స్కూల్‌లో నాడు ఆ స్కూల్‌ ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది అన్న ఫోటోలు తప్పనిసరిగా ప్రదర్శించాలి. అప్పుడే ఇప్పుడు చేసిన పనులకు మరింత విలువ వస్తుంది. వాటి ప్రాధాన్యత తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఆ స్కూల్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపైనా వారికి అవగాహన కలుగుతుందని అన్నారు. స్కూళ్లలో పెయింటింగ్‌ ‌పనులు, స్మార్ట్ ‌టీవీలు, వాల్‌ ఆర్ట్‌తో సహా అన్ని పనులు తప్పని సరిగా మే చివరి నాటికి పూర్తి కావాలి. పనుల నాణ్యతలో ఎక్కడా లోపం ఉండ కూడదు.

అందుకే పేరెంట్స్ ‌కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టాయిలెట్‌ ‌నిర్వహణ వ్యవస్థ కూడా స్కూళ్లు తెరిచే నాటికి పూర్తి కావాలని తెలిపారు. ఇంగ్లిష్‌ ‌మీడియమ్‌లో బోధన సజావుగా జరిగేలా టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిం చాలి.అప్పుడే వారు ఏ ఇబ్బంది లేకుండా ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్పగలుగు తారు. పిల్లలు స్కూళ్లకు వచ్చే నాటికే విద్యా కానుక కూడా రెడీ కావాలి.ఈసారి కిట్లలో ఇంగ్లిష్‌ ‌డిక్షనరీ కూడా తప్పనిసరిగా ఉండాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మంచి చేయా లన్న తపనతోనే పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నాం. నిజానికి పరీక్షల రద్దు చేయడం చాలా సులభం. పరీక్షల నిర్వహణ ఇంకా బాధ్యతతో కూడుకున్నది. కోవిడ్‌ ‌జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలి.

కేవలం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్న విష యాన్ని ప్రతి టీచర్‌ ‌గుర్తించాలి. ఇందులో అందరి సహాయ సహకారాలు కావాలని, తోడ్పాటు కావాలన్న విషయాన్ని వారందరికీ బలంగా చెప్పండి. అలాగే పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఏ మాత్రం అలక్ష్యం చూపొద్దు.అన్ని కోవిడ్‌ ‌జాగ్రత్తలతో ఈ పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్‌ ‌సూచించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ‌పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజ శేఖర్‌, ‌పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ‌వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వ శిక్షా అభి యాన్‌ ‌స్టేట్‌ ‌ప్రాజెక్ట్ ‌డైరెక్టర్‌ ‌వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.

Leave a Reply