Take a fresh look at your lifestyle.

  • వైసిపి నేతల దాడితో ఆగిపోయిన ఎంపిక
  • వైసిపి తీరుపై టిడిపి ఆగ్రహం.. జోక్యం చేసుకున్న హైకోర్టు
  • హైకోర్టు ఆదేశాలతో నేడు పకడ్బందీ భద్రత మధ్య ఎన్నిక

విజయవాడ,నవంబర్‌ 23 : ‌కొండపల్లి మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ఎన్నిక  వాయిదా పడింది. మంగళవారం కూడా వైసీపీ కౌన్సిలర్లు విధ్వంసం సృష్టించారు. కొండపల్లి ఎన్నిక రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి చేరింది. హైకోర్టు తీర్పు వస్తే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని టీడీపీ తెలిపింది. కార్యాలయంలోనే టీడీపీ సభ్యులు, ఎంపి కేశినేని నాని కూర్చొన్నారు. కాగా.. వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ‌బయటకు వెళ్లిపోయారు. కొండపల్లి మున్సిపల్‌ ‌కార్యాలయం నుంచి ఎన్నికల అధికారి సునీల్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సైతం బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి సునీల్‌ ‌కుమార్‌ ‌రెడ్డి డియాతో మాట్లాడుతూ.. సర్ది చెప్పినా సభ్యులు తగ్గలేదని.. దీంతో ఎన్నికకు అవకాశం లేకుండా పోయిందన్నారు. అందుకే ఎన్నికను వాయిదా వేశామన్నారు. లోపలే ఉన్న టీడీపీ సభ్యుల గురించి అడిగితే… సునీల్‌ ‌కుమార్‌ ‌స్పందించకుండా వెళ్లిపోయారు.

కొండపల్లి మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ఎన్నికకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక బుధవారం నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. కొండపల్లి చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌కు సంబంధించిన ఎన్నికలను బుధవారం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల పక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ ‌చేయాలని హైకోర్టు సూచించింది. కేశినేని నాని తన ఓటుహక్కు వినియోగిం కోవచ్చన్న కోర్టు.. నాని ఓటు హక్కు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటుందని తెలిపింది. అప్పటి వరకు ఫలితాలను ప్రకటించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.కాగా, హైకోర్టు  ప్రతి సభ్యుడికి ప్రత్యేకంగా.. భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించించింది. కొండపల్లి మున్సిపల్‌ ఎన్నికపై లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ ‌విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్‌ అయింది. మధ్నాహ్నం 2:15 గంటలకు విజయవాడ సీపీ.. కొండపల్లి మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. తాము ఆదేశించినప్పటికీ ఎన్నిక ఎందుకు నిర్వహించలేక పోయారని ప్రశ్నించింది.

బుధవారం ఉదయం ఎన్నిక నిర్వహించి తీరాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేస్తూ.. ఈ మేరకు నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అలాగే ఎన్నికైన అభ్యర్థులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని విజయవాడ సీపీని హైకోర్టు ఆదేశించింది. కొండపల్లి చైర్‌పర్సన్‌ ఎన్నిక వాయిదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన డియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. విధ్వంసం సృష్టించి… ఎన్నిక వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేన న్నారు. ఎన్నిక నిర్వహించడం చేతగాకపోతే ఎస్‌ఈసీ, డీజీపీ పదవి నుంచి తప్పుకోవాలన్నారు. ఎన్నికను అడ్డుకునే బదులు అధికారపార్టీ వారినే చైర్మన్‌గా నియమించుకోవాలన్నారు.

భయబ్రాంతులకు గురిచేసి టీడీపీ సభ్యులను లోబర్చుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. సంబంధం లేని వ్యక్తులు మారణాయు ధాలతో హల్‌ ‌చల్‌ ‌చేస్తున్నా… అక్కడే ఉన్న  పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు క్రమశిక్షణ, ఓర్పుతో వ్యవహరిస్తున్నారని, తమ సహనాన్ని చేతగానితనంగా పరిగణించొ ద్దన్నారు. ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు అన్నారు.

Leave a Reply