Take a fresh look at your lifestyle.

కోదండరామాలయ నిర్మాణ పనుల్లో ఉద్రిక్తత

  • నిర్మాణ పనులకు మంత్రుల శంకుస్థాపన
  • వంవపారంపర్య ధర్మకర్త అశోక్‌గజపతికి అవమానం
  • శిలాఫలకంపై తన పేరు లేకపోవడంపై ఆవేదన
  • అశోక్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రులు

విజయనగరం, డిసెంబర్‌ 22 : ‌పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై రూ.3కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయ పునఃనిర్మాణానికి మంత్రులు బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజుకు ఆహ్వానం లేదని, ఆయన పేరును శిలాపలకంపై లేకుండా చేశారన్న కారణంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దేవస్థాన అధికారులు హాజరయ్యారు. శంకుస్థాపన అనంతరం వించ్‌ ‌మోటారు సహకా రంతో ట్రాక్‌ ‌దుగా శిలా ఖండాలను ఒక్కొక్కటిగా కొండపైకి చేరవేసి ఆలయాన్ని నిర్మిం చడానికి ఏర్పాట్లు చేశారు. మండపం తోపాటు ధ్వజస్తంభం, ఆలయ ప్రాకారం, వంటశాలను నిర్మించనున్నారు. నీటి కొలను సుందరీకరణ, మెట్ల మార్గం ఆధునికీకరిస్తారు. శంకుస్థాపన అనంతరం ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసేందుకు దేవదాయశాఖ ఇంజినీరింగ్‌ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ప్రస్తుతం దిగువున ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో కోదండ రాముడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. కొండపై నిర్మాణం పూర్తయిన వెంటనే విగ్రహాలను నూతన ఆలయంలో పునఃప్రతిష్టిస్తారు. అయితే ••మతీర్థం బోడికొండపై  దుండగులు ధ్వంసం చేసిన ఆల యాన్ని ప్రభుత్వం నిర్మించడాన్ని అశోక్‌ ‌గజపతి రాజు తప్పుబట్టారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ‌పేరున ఉన్న శిలాఫలకాన్ని తొలగించాలని అశోక్‌ అధికారులపై చిందులు తొక్కారు. ఆ క్రమంలోనే శంకుస్థాపం బోర్డును సైతం అశోక్‌గజపతిరాజు పీకిపారేశారు. ఆలయ ధర్మకర్త అశోక్‌ ‌గజపతిరాజు తీరుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ‌స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ’అశోక్‌ ‌గజపతి రాజు హుందాగా వ్యవహరి ంచాలి. ఆలయ ధర్మకర్తగా ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం హేయమైన చర్య. ధర్మకర్త అని చెప్పుకోవడమే తప్ప దేవాలయాన్ని ఏనాడైనా అభివృద్ధి చేశారా?. అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం రాతి ఆలయాన్ని పటిష్టంగా నిర్మిస్తుంటే సర్కస్‌ ‌కంపెనీ అని అశోక్‌ ‌గజపతి అనడంపై చర్యలు తీసుకొవడం జరుగుతుంది. ఏం జరగక పోయినా ఏదో జరిగినట్లు అశోక్‌గజ పతిరాజు రాద్దాంతం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఆలయ అభివృద్ధి చేయకపోవడం, ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం చూస్తుంటే రాముని విగ్రహం ధ్వంసంలో వీళ్ల పాత్ర ఉందేమోనని అనుమానం కలుగుతోం దని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.  అశోక్‌ ‌గజపతి దుర్బుద్ధి బయటపడిందని, ఆయన ప్రవర్తించిన తీరు, ఇలాంటి సంప్రదాయాలు జిల్లాలో ఎప్పుడూ లేవని మున్సిపల్‌ ‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శంకుస్థాపన కోసం ఆహ్వానం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారిని అవమాన• •రిచారని తెలిపారు. ఆయనకు చైర్మన్‌గా ఆలయ అభివృద్ధి సంబంధించి బాధ్యత లేదని, అందుకోసం ఏనాడు గవర్నమెంట్‌ను కోరలేదని ధ్వజమెత్తారు. అశోక్‌గజపతి రాజు రాజరికపు అహంకారంతో ఉన్నారని, తప్పు చేసిన వారిని శ్రీరాముడు చూసుకుంటాడని చెప్పారు. ఆలయ అభివృద్ధిని అయన పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేస్తోందని బొత్స చెప్పారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలు అభివృద్ధి చేస్తోందని దేవాదా యశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ దుర్గ గుడిని 70కోట్లతో అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ఆలయ ధర్మకర్తగా అశోక్‌ ‌గజపతి రాజుని ఆహ్వానించామని మంత్రి అన్నారు. శిలాఫలకం పై ప్రోటోకాల్‌ ‌ప్రకారం పేర్లు వేసామని అయితే అందుకు ఆగ్రహించిన అశోక్‌ ‌గజపతిరాజు శిలాఫలకాన్ని తోసివేయడం అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయధర్మకర్తగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. అయితే ఆలయ అనువంశిక ధర్మకర్త అయిన తనను విస్మరించడంతో అశోక్‌గజపతిరాజు ఆవేదనకు లోనయ్యారు. అక్కడున్న శంకుస్థాపన బోర్డు తీసివేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అశోక్‌గజ పతిరాజును తోసేశారు.

ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. చట్టాన్ని దేవాదాయశాఖ ఉల్లంఘిస్తోందంటూ దుయ్యబట్టారు. తర్వాత మంత్రులు బొత్స, వెల్లంపల్లి తదితరులు ఆలయ పున:నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్‌గజపతిరాజు కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన డియాతో మాట్లాడుతూ సంస్క•తి, సంప్రదాయాలను అధికారపార్టీ పాటించలేదని, ధర్మకర్త చేయాల్సిన పనులు కూడా చేయనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కొబ్బరాయ కూడా కొట్టకుండా వైసీపీ శ్రేణులు నెట్టేశారన్నారు. ప్రభుత్వం చాలా మూర్ఖత్వంగా వెళుతోందని, రాజ్యాంగాన్ని అతిక్రమించి, చట్టాలు, కోర్టులు చెప్పిన అంశాలను తుంగలో తొక్కిందన్నారు. ఏకపక్ష ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని అశోక్‌గజపతిరాజు మండిపడ్డారు.

Leave a Reply