Take a fresh look at your lifestyle.

ఏజన్సీలో టెన్షన్‌… ‌టెన్షన్‌

  • ‌నేటి నుండి మావోయిస్టు అమవీరుల వారోత్సవాలు
  • దండకారణ్యంలో స్ధూపాలను కూలుస్తున్న డిఆర్‌జి బలగాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి ఎజన్సీ ప్రాంతంలో హై టెన్షన్‌ ‌నెలకొంది.మావోయిస్టులు ప్రతి సంవత్సరం జులై 28 నుండి అగష్టు మూడవ తేదీ వరకు అమరులు చారుమజూందార్‌, ‌కన్హయ్‌ ‌చటర్జీల పేరుతో అమర వీరుల వారోత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన రాష్ట్ర కమిటీ, డివిజన్‌ ‌కమిటీల ఏర్పాటు అనంతరం జరుగుతున్న వారోత్సవాల నేపద్యంలో భద్రాద్రి ఎజన్సీ ప్రాంతంలో హై టెన్షన్‌ ‌నెల కొంది అని చెప్పవచ్చు.నేటి నుండి ఈ నెల అగష్టు మూడవ తేదీ వరకు మావోయిస్టు పార్టీ అమర వీరుల వారోత్సవాలకు పిలుపు నిచ్చింది. సిపిఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ తో పాటు, చర్ల, శబరి ఏరియా కమిటీ పేరుతో కర పత్రాలు భద్రాచలం ఎజన్సీ ప్రాంతాలలో వెలిశాయి…ఈ కరపత్రాలలో గ్రామ గ్రామాన అమర వీరుల వారోత్సవాల ఘనంగా నిర్వహించాలని , అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వారి ఆశయ సాధనలో నడుద్దాం…నూతన ప్రజాస్వామిక విప్లవమే అశేష పీడిత ప్రజల విముక్తికి మార్గమంటూ నూతన ప్రజాస్వామిక విప్లవం వర్దిల్లాలి అంటూ కర పత్రాలలో పేర్కొన్నారు. తెలంగాణలో మావోలు తిరిగి బలం పుంజుకుంటున్నారనే ఇంటిలిజెన్స్ ‌వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర డిజిపి కె మహేందర్‌ ‌రెడ్డి ఈ నెల 18 వ తేదీన వెంకటాపురం, ములుగు, మణుగూరు ఎజన్సీ ప్రాంతంలో స్వయంగా పర్యటించి మావోయిస్టుల వారోత్సవాలను నిర్వీర్యం చేసేందుకు దిశా నిర్దేశం చేశారు. మావోలు సైతం ఆయన పర్యటనను సవాల్‌ ‌గా తీసుకుని మరుసటి రోజే తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏడుగురు సభ్యులతో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషన్‌( అలియాస్‌) ‌యాప నారాయణ కాగా చర్ల, శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా సమ్మక్క (అలియాస్‌) ‌శారద నియమించారు. డిజిపి పర్యటన అనంతరం చర్ల మండలం బత్తిన పల్లి వద్ద రోడ్డు పనులు నిర్వహిస్తున్న రెండు వాహనాలను మావోలు ద్వంసం చేసి పోలీసులకు సవాల్‌ ‌విసిరారు అనే చెప్పవచ్చు. గత ఏడాది కూడా చర్ల మండలం కొత్తూరుకు చెందిన రైతు నల్లూరి శ్రీనివాసరావును హత్య చేసి ఇదే తరహాలో పోలీసులకు సవాల్‌ ‌విసిరారు. వారోత్సవాలకు ముందు ఏదో •క అలజడి చేసి వారి ఉనికిని చాటుకుంటున్నారు.

దండకారణ్యంలో స్థూపాలు కూల్చేస్తున్న పోలీసు బలగాలు: మావోయిస్టుల అమర వీరుల వారోత్సవాల నేపద్యంలో దండకారణ్యంలో వారం రోజుల పాటు సభలు సమావేశాల కోసం మావోయిస్టులు ఏర్పాటు చేసిన స్థూపాలను చత్తీష్‌ఘడ్‌ ‌కు చెందిన డిఆర్‌జి, సిఆర్‌పిఎఫ్‌ , ‌కోబ్రా బలగాలు స్థూపాలను కూల్చి వేస్తున్నారు. దీంతో పాటు మావోలే లక్ష్యంగా అమర్చిన 40 కిలోల ఐఇడి బాంబును చత్తీష్‌ ‌ఘడ్‌ ‌జవానులు నిర్వీర్యం చేశారు. వారోత్సవాల సంవదర్బంగా మావోలు ఎమైనా అవాంఛనీయ సంఘటలకు పాల్పడే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారం మేరకు చత్తీష్‌ఘడ్‌, ‌తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన దంకారణ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు సైతం భద్రాచలం నుండి చర్ల వెంకటాపురం, వాజేడు వరకు రహదారుల వెంబడి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. దుమ్ముగూడెం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ద్విచక్రవాహనంతో పాటు మావోల కర పత్రాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఏది ఎమైనా వారం రోజుల పాటు జరిగే మావోయిస్టుల అమర వీరుల వారోత్సవాల సందర్బంగా ఎజన్సీ ప్రాంతంలో హై టెన్షన్‌ ‌నెలకుంది.ఇటీవలకాలంలో మణుగూరు ప్రాంతంలో అలజడి మొదలైంది.కొంతకాలంగా ప్రశాతంగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.దీంతో పోలీస్‌ అధికారులు అప్రమత్తం అయ్యారు.దీనికి ధీటుగా మావోయిస్టులు కూడా ప్రతీ రోజు ఏదో మండలంలో వారి ఉనికిని కాపాడుకోవడం కోసం కరపత్రాలు విడిచి హెచ్చరికలు పంపుతూనే ఉన్నారు.దీన్ని తిప్పి కొట్టేందుకు భద్రాద్రి కొత్తగూడెం పోలీస్‌ అధికారులు తగిన దీటుగా సమాదానం ఇస్తున్నారు.28 మంగళవారం నుండి ఆగష్టు 5 వతేదీవరకు జరిగే వారోత్సవాలలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయని అక్కడి సామాన్య ప్రజలు తీవ్ర భయాంధోళన చెందుతున్నారు.ఇప్పటికే మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న స్ధూపాలను పోలీస్‌ ‌బలగాలు కూల్చివేయడం జరుగుతంది.

Leave a Reply