Take a fresh look at your lifestyle.

నల్లమల్ల మన్యంలో టెన్షన్‌…

‌ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న గిరిజన చెంచు మహిళలు

అచ్చంపేట,ఆగష్టు5,(ప్రజాతంత్ర విలేకరి): నల్లమల ప్రాంతంలో పోడు భూములు సాగు చేసుకుంటుంన్న రైతులకు ఎక్కడో ఒకచోట అటవి శాఖ అధికారుల నుండి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. గడిచిన రెండు నెలల నుంచి అటవీశాఖ అధికారులకు నల్లమల్ల ప్రాంతంలోని జీవిస్తున్న ఆదివాసీలపై గిరిజనులకు, ఇతర గిరిజనేతర రైతుల మధ్య నిత్యం అధికారులు రైతులతో పోడు భూములకు సంబంధించి పోరు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అమ్రాబాద్‌ ‌మండలం లోని మాధవ పల్లి గ్రామంలో చెల్క్ ‌పోడు భూములలో మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులు వెళ్లారు. దీంతో మదనపల్లి గ్రామ ప్రజలు, రైతులు ,అధికారులను అడ్డుకుని బీకే తిరుమలాపూర్‌ ‌రోడ్డుపై ధర్మ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా రైతులకు,అటవీ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు తాము సాగు చేస్తున్న ఊరు భూముల్లో ఫారెస్ట్ అధికారులు బలవంతంగా మొక్కలు నాటడం భావ్యం కాదని, ఉన్న కాస్త భూమిని సాగు చేసుకుంటూ బతుకుతున్న మాకు చీకటి బతుకులు కలిగించవద్దని అధికారులను వేడుకుంటున్నారు. రైతులకు కు అటవీ అధికారులు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోని….. మా పోడు భూముల సమస్య తీర్చేవిధంగా ఉన్నతాధికారులు కనికరించి నష్టం కలిగించకుండా ఉండాలని రైతులు కోరుతున్నారు. అలాగే పోడు భూముల విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని నల్లమల్ల ప్రాంత రైతులు వేడుకుంటున్నారు.

ప్రజాప్రతినిధుల మాట వినడం లేదు
పోడు భూముల విషయంలో రైతులకు అండగా స్థానిక ప్రజా ప్రతినిధులు ఎంపీ ,ఎమ్మెల్యే, ప్రజల పక్షాన ,రైతుల పక్షాన, నిలబడి అటవీశాఖ అధికారులతో మాట్లాడుతున్న అటవీశాఖ అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు న్యాయం చేస్తామని రైతుల నుంచి పైసలు తీసుకొని మోసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఫారెస్ట్ ‌వారి దౌర్జన్యం
సాగు చేసుకుంటున్న భూములలో అన్యాయంగా నర్సరీ ఏర్పాటు చేయాలనుకోవడం దుర్మార్గమైన పద్ధతిని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దౌర్జన్యాలు అధికమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను అరెస్టు చేస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ, పోలీసు శాఖ ,రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులను అటవి శాఖ అధికారులు వాహనాలలో ఎక్కించి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంగా అధికారుల వాహనాలకు మహిళా రైతులు అడ్డుతగిలారు. ఈ సందర్భంగా రైతులకు ,అధికారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Leave a Reply