Take a fresh look at your lifestyle.

ఏపీలో జగ్జీవన్‌ ‌రామ్‌ ‌జయంతి వేడుకల్లో ఉద్రిక్తత

కాలేజీ స్టూడెంట్‌ను కొట్టిన ఎస్సై
అనకాపల్లి, ఏప్రిల్‌ 5 : ఏపీ అనకాపల్లి నగరంలోని దాడి వీరు నాయుడు కాలేజీ ప్రాంగణం సపంలో డాక్టర్‌ ‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సపంలో ఉన్న దాడి వీరు నాయుడు డిగ్రీ కాలేజీలో నుంచి ఎవరో ఒక వ్యక్తి జై జనసేన  అంటూ నినాదం చేశాడు. జై జనసేన నినాదంతో కాలేజీలోకి వెళ్లి స్టూడెంట్స్‌ని అనకాపల్లి టౌన్‌ ‌సబ్‌ ఇన్స్పెక్టర్‌ ‌దివాకర్‌ ‌కొట్టారని బాధితులు వాపోతున్నారు.

ఎస్సై కాలేజ్‌ ‌విద్యార్థులను కొట్టడం పట్ల ఆ కాలేజీ ప్రిన్సిలప్‌ ‌ప్రశ్నించాడు. అయినాసరే ప్రిన్సిపల్‌ని సైతం లెక్కచేయకుండా ఆ ఎస్సై తోసేశాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీమంత్రి దాడి వీరభద్రరావు , కళాశాల చైర్మన్‌ ‌దాడి రత్నాకర్‌ ఎస్సై తీరుని ఖండించారు. విద్యార్థులను కొట్టిన ఎస్సై దివాకర్‌ను వెంటనే సస్పెండ్‌ ‌చేయాలని కాలేజ్‌ ‌యాజమాన్యం డిమాండ్‌ ‌చేస్తోంది.

Leave a Reply