- దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు అత్తగారింట్లో పోలీసుల సోదాలు
- పలువురు నేతల అరెస్టు సోదాలో రూ.18.65లక్షలు స్వాధీనం?
సిద్ధిపేటలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవనేని రఘునందన్‌రావు మామ(అత్తగారిల్లు) ఇంట్లో సిద్ధిపేట పోలీసులు సోదాలు నిర్వహించడంతో పోలీసులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు మామ ఇంట్లో డబ్బులన్నాయన్న సమాచారంతో సిద్ధిపేట పట్టణ పోలీసులు కోటి లింగాల ప్రాంతంలో ఉన్న రఘునందన్‌రావు మామ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తన మామ ఇంట్లోకి పోలీసులు చొరబడి సోదాలు చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న పోలీసులు లాక్కోని బెదిరిస్తున్న సమచారాన్ని తెలుసుకున్న రఘునందన్‌రావు హుటాహుటిన సిద్దిపేటకు చేరుకున్నారు.
రఘునందన్‌రావు వెంట బిజెపి శ్రేణులు పెద్దయెత్తున తరలిరావడంతో పోలీసులు, బిజెపి శ్రేణుల మధ్య ఒకింత తోపులాట జరిగింది. ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి ఎలా చొరబడ్డారనీ, సివిల్ డ్రెస్సులో ఉన్న వారు ఎలా ఇంట్లోకి వచ్చి సోదాలు చేస్తారనీ, ఫోన్లు ఎందుకు గుంజుకన్నారనీ, మహిళలలను ఎందుకు బెదిరించారనీ, గుండె ఆపరేషన్ చేయించుకున్న మా మామను ఎలా భయబ్రాంతులకు గురి చేస్తారనీ పోలీస్ అధికారులతో రఘునందన్‌రావు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును రఘునందన్‌రావుతో పాటు ఆయన సతీమణి, బిజెపి శ్రేణులు పోలీసుల తీరును తీవ్రంగా ఎండగట్టారు. https://lustzone.ch/