Take a fresh look at your lifestyle.

ఈఎస్‌ఐ ‌కుంభకోణంలో పదిచోట్ల ఇడి సోదాలు

నాయిని అల్లుడు, ఆనాటి పిఎస్‌ల ఇళ్లల్లో తనిఖీలు
ఈఎస్‌ఐ ‌కుంభకోణంలో శనివారం ఈడీ సోదాలు కొనసాగాయి. ఉదయం నుంచి నగరంలోని 10 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌సోదాలు నిర్వహిస్తున్నది. ఆనాటి కార్మిక శాఖ మంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌ ‌రెడ్డి, నాయిని మాజీ పీఎస్‌ ‌ముకుంద రెడ్డి, దేవికారాణి, ఇతర నిందితుల ఇళ్ళల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌తనిఖీలు జరుపుతోంది. ఇన్సూరెన్స్ ‌మెడికల్‌ ‌స్కామ్‌ ‌కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల వ్యవహారంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు కుంభకోణం జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. ఈ స్కామ్‌లో ఈఎస్‌ఐ ‌మాజీ డైరెక్టర్‌ ‌దేవికారాణి సహా తొమ్మిది మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ ‌చేశారు. స్కామ్‌కు పాల్పడి విదేశాలకు నగదు బదిలీ చేసినట్టు గుర్తించింది. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు సేకరించింది. విదేశాలకు నగదు బదిలీ చేసిన నేపథ్యంలో దర్యాప్తు చేయాలని ఈడీకి ఏసీబీ లేఖ రాసింది. ఏసీబీ అధికారులు రాసిన లేఖ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా నేడు 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నది.

Leave a Reply