Take a fresh look at your lifestyle.

శివనామస్మరణతో మారుమోగిన దేవాలయాలు

Temples transformed into a Shivanamamna

శుక్రవారం రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని దేవాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. ఉదయాన్నే భక్తులు మండలంలోని బాదంపల్లి,ధర్మారం,కలముడుగు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దేవాలయాలను దర్శించుకున్నారు. బాదంపల్లి,ధర్మారం,కలముడుగు గోదావరికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్పంచులు వాల అశోక్‌రావు,కార్తీక్‌ ‌రావులు తగు ఏర్పాట్లు చేశారు. బాదంపల్లిగోదావరి వద్ద వృద్దులు,వికలాంగులు,చిన్నపిల్లలు స్నానాలచరించడానికి షవర్స్ ఏర్పాటు చేశారు.

బాదంపల్లి గోదావరి వద్ద సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందచేయగా వికాస్‌ ‌కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌  ఆధ్వర్యంలో  పండ్లు పంపిణీ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా మండలకేంద్రంలోని హనుమాన్‌ ‌దేవాలయంలో భక్తులచే వేదపండితులు గణేష్‌శర్మ,నరహరిశర్మలు సామూహిక రుద్రాబిషేకాలు నిర్వహించారు. పైడిపల్లి హనుమాన్‌ ‌దేవాలయంలో వేదపండితుడు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణంను అంగరంగవైభవంగా నిర్వహించారు.

Leave a Reply