Take a fresh look at your lifestyle.

అన్నార్తుల ఆకలి తీరుస్తున్న ఆలయాలు

కొరోనా నేపథ్యంలో ప్రధాన ఆలయాల్లో అన్నప్రసాదాలు తయారీ
‌కరోనా సంక్షోభంలో ఇప్పుడు అనేక దేవాలయాలు పేదలకు అండగా నిలుస్తున్నాయి. నిత్యాన్నదాన పథకాన్ని పేదలకు అన్నం పెట్టే సంస్థలుగా మారాయి. ప్రధాన దేవాలయాల్లో ఈ కార్యక్రమిం గత నెలరోజులుగా నిరంతరాయంగా సాగుతోంది. తిరుపతి, అన్నవరం, విజయవాడ కనకదుర్గ, వేములవాడ, సింహాచలం, యాదాద్రి, శ్రీశైలం తదితర ప్రముఖ ఆలయాలు తమవంతుగా అన్నప్రసాందతో పేదల ఆకలిని తీరుస్తున్నాయి. వేల మందిని కబళిస్తున్న కరోనావైరస్‌ ‌కారణంగా దేవాలయాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బడులు, గుడులు క్వారంటైన్‌ ‌కేంద్రాలుగా మారిపోతున్నాయి. ప్రముఖ దేవాలయాలకు చెందిన భవనాలు కూడా క్వారంటైన్‌ ‌సెంటర్లుగా మారి సేలందిస్తున్నాయి. కరోనా బాధితుల కోసం తిరుమల-తిరుపతి దేవస్థానం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు తమ దేవస్థానాల అనుబంధ భవనాలను క్వారంటైన్‌ ‌కేంద్రాలకు ఇచ్చేశాయి. ఆయా ప్రాంతాల్లో చిక్కకు పోయిన వివిధ రాష్టాల్రు, విదేశీయులు కూడా ఆశ్రయం పొందుతున్నారు. టీటీడీకి చెందిన సత్రాలు, గెస్ట్‌హౌస్‌లు ఇందులో ప్రధానమైనవి. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాదిమంది భక్తులు, కొండ పైన ఉన్న సత్రాలతో పాటు కింద ఉండే ఈ సత్రాల్లో విడిది చేస్తారు. ఈ భవనాలు నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటాయి.

తిరుపతి బస్టాండ్‌ ‌సపంలో, విశాలమైన ప్రాంగణంలో ఉన్న శ్రీనివాసం, మాధవం భవనాల్లో ప్రస్తుతం నిరాశ్రయులు, వలస కూలీలు, అన్నార్తులు సేదతీరుతున్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా సొంతూళ్లకు వెళ్లలేక, ఉన్న ఊరిలో ఆశ్రయం పొందలేక ఇబ్బంది పడుతున్న వందలాదిమంది సాధారణ ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. అలాగే టీటీడీ ఇక్కడి అన్నార్తుల ఆకలి కూడా తీరుస్తోంది. ఈ సంక్షోభ సమయంలో తమవంతు సాయంగా రోజుకు 1.4లక్షల మందికి ఆహారపు పొట్లాలను అందజేస్తోంది. దీనికోసం దాదాపు 500మంది దాకా టీటీడీ ఉద్యోగులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. కాణిపాకం దేవస్థానం అధికారులు ఆలయానికి చెందిన 100 గదుల ’గణెళిష్‌ ‌సదన్‌’ ‌భవనాన్ని కొన్నిరోజులపాటు క్వారంటైన్‌ ‌సెంటర్‌ ‌కోసం కేటాయించారు. దేవాలయ సత్రాల్లో గదులు, బాత్‌రూంలు వేరువేరుగా ఉంటాయి. కరోనా అనుమానితులు సోషల్‌ ‌డిస్టెన్స్ ‌పాటించడం చాలా అవసరం. అందుకు దేవాలయ సత్రాలు అనుకూలంగా మారాయి. శ్రీకాళహస్తి ఆలయం కూడా మొదట్లో దేవస్థానానికి చెందిన ’గంగా సదనం’ గెస్ట్‌హౌస్‌ను ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రస్తుతం శ్రీకాళహస్తిలో పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతున్నాయి. దీంతో కాళహస్తి మొత్తంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. మరోవైపు అన్ని దేవాలయాల అన్నప్రసాద కేంద్రాలు ఇప్పుడు అన్నదానం చేస్తున్నాయి. దీంతో పేదల ఆకలికి ఢోకా లేకుండా పోయింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!