Take a fresh look at your lifestyle.

తెరుచుకున్నఆలయాలు

  • ఉత్సాహంగా చేరుకున్న భక్తులు
  • కళకళలాడిన ఆలయపరిసరాలు
  • తిరుమలలో ప్రత్యేక ముస్తాబు
  • యాదాద్రిలో ప్రత్యేక ఏర్పాట్లతో దర్శనాలు

లాక్‌ ‌డౌన్‌తో కొద్ది రోజులుగా భక్తులకు దూరంగా ఆలయాలు మళ్లీ తెరచుకున్నాయి. నిబందనల సడలింపులతో ఇప్పుడు ఆలయాలు మల్లీ కళకలలాడుతూ కనిపించాయి. విశ్రాంతిలో ఉన్న దేవుళ్లు మళ్లీ భక్తులకు దర్శనమిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఆలయాలు తెరుచుకోవడంతో భక్తులు ఉత్సాహంగా ఆయా ఆలయాలకు చేరకున్నారు. ఆలయాలతో పాటు చర్చిలు, మసీదులకు అనుమతి ఇవ్వడంతో దేశవ్యాప్తంగా తెరుచుకున్నాయి. అయితే అన్ని చోట్ల పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిచ్చారు. ప్రధాన ఆలయాల్లో ముందుగా రెండురోజుల పాటు ఆలయ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్‌ ‌రన్‌ ‌నిర్వహించిన తర్వాత సామాన్య భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. తిరుమలలో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రెండున్నర నెలల తర్వాత శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ట్రయల్‌ ‌రన్‌ ‌కింద ఉద్యోగులను దర్శనానికి అనుమతించారు. మంగళవారం కూడా కొంతమంది టీటీడీ సిబ్బందికి ఆలయ ప్రవేశం ఉంటుంది. జూన్‌ ‌పదిన తిరుమలలో స్థానికులకు అవకాశం కల్పిస్తారు. ఈనెల 11 నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తారు. ఉదయం 6-30 గంటల వరకు వీఐపీ బ్రేక్‌ ‌దర్శనం.. ఆపై రాత్రి 7-30 గంటలవరకు సాధారణ భక్తులకు దర్శనం కల్పిస్తారు.

ఆన్‌ ‌లైన్‌లో 3 వేల టిక్కెట్లు అలిపిరి వద్ద ఉండే కౌంటర్ల ద్వారా మరో 3వేల టిక్కెట్లు విక్రయిస్తారు. ఆన్‌లైన్లో దర్శనం టిక్కెట్లతోపాటే అద్దెగదులను బుక్‌ ‌చేసుకోవచ్చు. ఒక గదిలో ఇద్దరికే అనుమతి ఇస్తారు. ఇది 24 గంటలకే పరిమితమని పొడిగింపుకు వీల్లేదు. ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లేదు. తీర్థప్రసాద వితరణ ఉండదు. దర్శనానికి ఎవరి సిఫారసు లేఖలు చెల్లవు. ప్రొటోకాల్‌ ఉన్న వీఐపీలు వ్యక్తిగతంగా వస్తే వారికి మాత్రమే ఉదయం 6-30 నుంచి 7-30 గంటల వరకు బ్రేక్‌ ‌దర్శనం కల్పిస్తారు. గంటకు 500 మంది భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. రోజుకు 6వేల మంది భక్తులకు మాత్రమే స్వామి వారి దర్శనం లభించనుంది. మహమ్మారి కరోనా వైరస్‌ ‌కారణంగా మూసివేసిన తిరుమల దేవస్థానాన్ని దాదాపు 75 రోజుల తర్వాత టిటిడి తిరిగి ప్రారంభించింది. ఈ సందర్భంగా స్వామి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం నుంచి ప్రారంభమైన శ్రీవారి దర్శనాలకు మొదటి రెండు రోజులు టిటిడి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. ఈ నెల 10వ తేదీన స్థానికులకు, 11వ తేది నుంచి భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు.

మాస్కులు ధరిస్తేనే లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. లడ్డు ప్రసాద కౌంటర్ల వద్ద తగిన ఏర్పాట్లు చేయనున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు దర్శనాలకు రావొద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. కొండపైకి వాహనాలకు అనుమతి నిరాకరించారు. ఇకపోతే ప్రధాన ఆలయాల్లో దర్శనాలకు అనుమమతించారు. యాదాద్రిలో ప్రత్యేక ఏర్పా•-టలు చేశారు. భక్తులను పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. దీంతో ఉదయం నుంచి భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలకు అనుమతించారు. శ్రీశైలంమహానంది, కసాపురం ఆంజనేయస్వామి, కాణిపాకం, శ్రీకాళహస్తి, వేములవాడ, భద్రకాళి, యాదాద్రి ఆలయాల్లో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన వేయి స్తంభాల గుడిలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆలయాల ప్రవేశం సందర్భంగా భక్తులకు థర్మల్‌ ‌స్క్రీనింగ్‌ ‌చేస్తూ ఆలయ సిబ్బంది లోపలికి అనుమతి ఇచ్చారు. అలాగే భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. దీంతో భక్తులు ఇలా నిబంధనలు పాటిస్తూ దైవ దర్శనం చేసుకుంటున్నారు.

జోగులాంబ ఆలయంలో మంత్రి పూజలు:
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండున్నర నెలల తర్వాత ఆలయాలు తెరుచుకోవడంతో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆలయాల్లో తగు ఏర్పాట్లు చేశారు. ఆలయాలను శానిటైజర్‌ ‌చేయడంతో పాటు భౌతిక దూరం పాటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు టెంపరేచర్‌ ‌స్కానింగ్‌ ‌చేసి మాస్కులు ఉన్న వారిని లోపలికి అనుమతిస్తున్నారు. జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొవిడ్‌ ‌నిబంధన అమలును మంత్రి పరిశీలించారు.

Leave a Reply