Take a fresh look at your lifestyle.

ఆలయ మర్యాదలు పాటించాలి

తలకు పాగా చుట్టకపోవడంపై అశోకగజపతి అసహనం
విశాఖపట్టణం, జూన్‌ 16 : ఆలయదర్శనానికి వచ్చిన తనకు కరోనా పేరు చెప్పి తలపాగ చుట్టలేదని అధికారులు చెప్పడంతోసింహాచలం దేవస్థానంఅనువంశిక ధర్మకర్త అశోక్‌ ‌గజపతి రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పూర్వీకులు ఇచ్చిన ధర్మాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మన మతాన్ని ఆరాధించాలని, ఎదుటివారి మతాన్ని గౌరవించాలన్నారు. ఇప్పడది లోపించినట్లు కనిపిస్తోందన్నారు. విధ్వంసాల విషయంలో తన మనసుకు చాలా గాయమైందన్నారు.

రామతీర్థం దేవాలయానికి అనువంశిక ధర్మకర్త పంపించలేదుగానీ, జైలు నుంచి బయటకు వచ్చి బెయిల్‌పై ఉన్న దొంగను పంపించారని అశోక్‌ ‌గజపతిరాజు అన్నారు. విగ్రహాల తయారీకి రూ. లక్ష ఇస్తే వద్దన్నారన్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలతో ఆడుకోవడం సరికాదని అన్నారు. ఈ మధ్యలో అప్పన్న ప్రసాదాల ధరలు కూడా పెంచినట్లు విన్నానన్నారు. వ్యాపార దృక్పధంతో ఆలోచించకూడదన్నది తమ అభిప్రాయమని అశోక్‌ ‌గజపతి రాజు అన్నారు.

Leave a Reply