Take a fresh look at your lifestyle.

కేంద్ర బడ్జెట్‌పై తెలుగురాష్ట్రాల నిర్వేదం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌పై రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్ర ఆసంతృప్తిని వ్యక్తంచేశాయి. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత విభజన ఒప్పందాలను అమలు చేసే విషయంలో కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఆవేదనను ఇరు రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు, ఆర్థిక మాంద్యం వల్ల ఇరురాష్ట్రాలు తీవ్ర ఆర్థికభారాన్ని మోయాల్సి వొస్తున్నా కేంద్రం, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను అందివ్వక పోగా, ఇరు రాష్ట్రాలు ఆరేళ్ళుగా డిమాండ్‌ ‌చేస్తున్నవాటిని కూడా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలను వ్యక్తచేస్తున్నారు. ప్రధానంగా ఏపి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రత్యేక హోదా విషయాన్ని ఈ బడ్జెట్‌లో కేంద్రం ప్రస్తావించనేలేదు. అలాగే దేశ, విదేశస్తులు మెచ్చుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను కూడా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదనడానికి బడ్జెటే సాక్ష్యం. తెలంగాణలో అత్యధికంగా గిరిజన జనభా ఉండటంతో ఇక్కడ గిరిజన మ్యూజియంను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను కూడా కేంద్రం పక్కకుపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు గురించి మెచ్చుకున్న కేంద్ర పభుత్వం దాని ప్రస్తావనే చేయలేదు. నదీజలాల అనుసంధానంపైన కూడా ఎలాంటి ప్రస్తావన లేకపోవడం తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా నిరాశపర్చింది. ఇదిలా ఉంటే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ‌శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర వార్షికబడ్జెట్‌పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి మొదటి ప్రాధాన్యతనివ్వగా, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరుకు రెండవ ప్రాధాన్యతనిచ్చారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయరంగాన్ని ఆదుకోవాలన్న లక్ష్యంగా ఈ బడ్జెట్‌లో 2.83 లక్షలకోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

ప్రకృతికి, దలారి వ్యవస్థ మద్య నలిగిపోతున్న రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం ద్వారా 2022 నాటికి వారి ఆదాయన్ని రెండింతలు పెంచాలన్న లక్ష్యాన్ని నిర్ణయించింది. అయితే ఈ లక్ష్యానికి కేవలం రెండేళ్ళ వ్యవధి మాత్రమే ఉండడం వల్ల ఇది ఏమేరకు సాధ్యమన్నదే సంశయం. రెండింతల ఆదాయాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపటుతుందన్న విషయంలో కొంతవరకు వివరణ ఇచ్చినప్పటికీ పూర్తి అంశాలు వెల్లడికావాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా నీటి వసతిలేని వంద కరువు జిల్లాలను ఆదుకోవడం ఒకటి కాగా, ఇరవై లక్షల మంది రైతులకు పంపుసెట్లను అందజేస్తామని నిర్మల బడ్జెట్‌ ‌ప్రసంగంలో ప్రస్తావించింది. కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌పేరుతో రైతులకు మరింతగా రుణ సదుపాయం కల్పించడం, నాబార్డు పథకాన్ని మరికొంతకాలం పొడిగించడంలాంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపింది. రైతులను మరింతగా ఆర్థికంగా ఆదుకునేందుకు పాలు, చేపల రవాణాకోసం కొత్తగా కిసాన్‌రైలును ప్రవేశపెడుతున్నారు. సేంద్రీయ ఉత్పత్తుల విక్రయాలకు ఆన్‌లైన్‌ ‌పోర్టల్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. మరో ప్రాధాన్యాంశమైన ఆరోగ్యరంగానికి 69వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. అలాగే జల్‌జీవన్‌ ‌మిషన్‌కు 3.6లక్షల కోట్లు, స్వచ్ఛభారత్‌కు 12వేల 300 కోట్లు కేటాయించారు. జీవన మార్పులతో వొచ్చే రోగాల నివారణకు మరో నూతనపథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నారు. జీవావుషధ కేంద్రాల విస్తరణ, మిషన్‌ ఇం‌ద్ర ధనస్సు విస్తరణతోపాటు వైద్య పరికరాల ఉత్పత్తికి నూతనపథకాన్ని కేంద్రం రచిస్తున్నట్లు నిర్మల తెలిపింది. అదేవిధంగా 2025 నాటికి క్షయవ్యాధిని సంపూర్ణంగా నియంత్రించాలని కేంద్రం లక్ష్యంగా •ట్టుకుంది. ఇదిలాఉండగా ఎడ్యుకేషన్‌కు కూడా బడ్జెట్‌లో భారీగానే నిధులు కేటాయించారు. ఈ వార్షిక సంవత్సరానికిగాను 99.300 కోట్ల రూపాయలను కేటాయించగా, స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌కోసం మరో మూడు వేల కోట్లను కేటాయించారు. ఆధునిక విద్యావిధానానికి దీటుగా మన విద్యావిధానం ఉండేందుకు త్వరలో కొత్త విద్యాపథకాన్ని ప్రవేవపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఈ కొత్త పథకంకోసం ఇప్పటికే దాదాపు రెండు లక్షల మందినుండి సలహాలు కూడా కేంద్రానికి అందాయి. దీటైన విద్యను అందించేందుకు ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తున్నారు. మొదటిసారిగా డిగ్రీ స్థాయిలో ఆన్‌లైన్‌ ‌విద్యను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. అలాగే 2026 నాటికి 150 యూనివర్శిటీల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్నికూడా కేంద్రం తీసుకుంది. నేషనల్‌ ‌పోలీస్‌, ‌నేషనల్‌ ‌ఫోరెన్సిక్‌ ‌యూనివర్శిటీలనుకూడా ఏర్పాటుచేసే ఆలోచన చేస్తున్నారు. భారత్‌లో చదువాలనుకునే విదేశీ విద్యార్థులకోసం స్టడీ ఇన్‌ ఇం‌డియా ప్రోగ్రాం- ఇండిశాట్‌ను ఏర్పాటుచేయబోతున్నారు. ఇదిలా ఉండగా మెడికల్‌ ‌కాలేజీలను జిల్లా అసుపత్రులతో పిపిపి పద్ధతిలో అనుసంధానం చేయాలన్న నిర్ణయాన్ని కూడా కేంద్రం తీసుకుంది. వీటితోపాటు మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి ఊరట కలిగించే ఆదాయపు పన్ను రాయితీలను కేంద్రం ప్రకటించింది. ఇందులో గతంలోకన్నా ఎక్కువ స్లాబ్‌విధానాన్ని ప్రవేశపెట్టి, పన్ను శాతాన్ని తగ్గించింది. అయితే టాక్స్‌కట్టేవారికేగాని ఇతరులకు పెద్దగా ఉపయోగపడేదేమీలేదన్న విమర్శలేకపోలేదు. అలాగే దశాబ్దాలుగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కుంటున్నా ప్రభుత్వం దాని నివారణకోసం పెద్దగా చేపట్టిన చర్యలులేకపోవడంపైనకూడా తీవ్ర విమర్శలు వొస్తున్నాయి.

Leave a Reply