భూకబ్జాదారుల చెరలో ప్రభుత్వ భూములు
వరద బాదిత నిరాశ్రయులను ఆదుకోవాలి : చాడ వెంకట్ రెడ్డి
హన్మకొండ, జూలై 26, (ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్రంలో పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4 నుండి 8 వరకు సిపిఐ ఆద్వర్యంలో పోడు యాత్ర నిర్వహించను న్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఆదివారం హన్మకొండ బాల సముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగు దారుల సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబి స్తున్నదన్నారు. పోడు సాగుదారులకు పట్టాలి వ్వాలనిఆదిలాబాద్ జిల్లా కొమురంబీమ్ జోడేఘాట్ స్తూపం నండి 4న యాత్ర ప్రారంభమై భద్రాచలం వరకు కొనసాగుతూ ఆగస్టు 8న ముగుస్తుందని తెలిపారు. పోడు సాగుదారులకు పట్టాలతో పాటు దళితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు సాధించేవరకు పోరాడుతామన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపిలు, రియల్ ఎస్టేట్ దారుల చేతుల్లో ప్రభుత్వ భూమి కబ్జా కు గురైంద న్నారు. వరంగల్ సమీపంలోని బొల్లికుంటలో కబ్జా కు గురైన ప్రభుత్వ భూమిలో సిపిఐ ఆద్వ ర్యంలో ఎర్రజెండాలు పాతిన తరువాతనే అది ప్రభుత్వ భూమి అని అధికారులు బోర్డు పెట్టారని గుర్తు చేశారు. మరోవైపు సిపిఐ నాయకులపై అక్రమంగా బైండోవర్ కేసులు నమోదు చేశారని, వెంటనేవాటిని ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేశారు. రాష్ట్రంలోనూ ఇతర ప్రాంతాలలోనూ ఇలాంటి భూములు ఉన్నాయని, ఎలాగైతే తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవాడికే భూమి అని పోరాడామో అలాగే నేడు పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు సాదించే వరకు భూ పోరాటాలు నిర్వహిస్తామన్నారు. వరంగల్ నగరంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వారి అనుయాయులకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పించుకుంటున్నారని, అది సరైన విధానం కాదన్నారు. సిఎం కెసిఆర్ దళితుల ఓట్ల కోసం హుజూరాబాద్‌లో దళిత బందు అమలు చేస్తే సరికాదని, రాష్ట్రంలో అణగారిన దళిత వర్గాలకు అందరికి న్యాయం జరుగాలని చెప్పారు. దళితులకు ఇవ్వాల్సిన మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్ల హామీ అమలు కావాలని చెప్పారు. ఇటీవల వర్షాలకు అతలాకుతలం అయిన జిల్లాలలో నిరాశ్రయులను ఆదుకోవాల న్నారు. హైదరాబాద్ లో ఇచ్చిన విదంగా వరద లతో నష్టపోయిన కుటుంబాలకు రూ.10వేల సహాయం అందించాలన్నారు. కాగా దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దరలు ఆకాశాన్నంటుతున్నాయని, ప్రతి రోజు పెట్రోల్, డిజిల్ దరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. మరోవైపు ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తూ ప్రశ్నించే గొంతులపై రాజద్రోహం కేసు నమోదు చేస్తున్నారని విమర్శిం చారు. మేధావులపై కూడా రాజద్రోహం కేసు పెట్టడం సరికాదని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
స్టాఫ్ నర్సులను విధులలోకి తీసుకోవాలి
రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో విధులను నిర్వహించిన స్టాఫ్ నర్సులను తొలగించడం అన్యాయం అని, రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన 1640 మంది స్టాఫ్ నర్సులను వెంటనే విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు స్టాఫ్ నర్సులు చాడ వెంకట్ రెడ్డికి వినతిపత్రం అందించి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. దీనిపై చాడ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులలో ఎక్కువ జీతాలు ఇస్తున్నప్పటికీ స్టాఫ్ నర్సులు ప్రభుత్వాన్ని నమ్ముకుని పని చేస్తే నట్టేట ముంచుతారా అని ప్రశ్నించారు. ఈ విలేకర్లల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి మేకలరవి, జిల్లా సహాయ కార్యదర్శి కర్రె బిక్షపతి, నగర కార్యదర్శి షేక్ బాష్ మియా, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వలీ ఉల్లా ఖాద్రి, సిపిఐ జిల్లా నాయకులు తోట బిక్షపతి, దండు లక్ష్మణ్ మద్దెలఎల్లేష్, గన్నారపు రమేష్‌లు పాల్గొన్నారు.