Take a fresh look at your lifestyle.

28 ‌క్వింటాళ్ల రేషన్‌ ‌బియ్యం పట్టివేత ఇద్దరిపై కేసు నమోదు

నర్సంపేట, జూలై 26, (ప్రజాతంత్ర విలేకరి) : అక్రమంగా తరలిస్తున్న 28 క్వింటాళ్ల రేషన్‌ ‌బియ్యాన్ని పట్టుకుని, ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు ఖానాపురం ఎస్‌ఐ ‌నం డ్రు సాయిబాబు తెలిపారు.  సోమవారం  పెట్రోలింగ్‌ ‌చేస్తుండగా టాటా ఎసి వాహనం లో రేషన్‌ ‌బియ్యాన్ని ఖానాపూర్‌ ‌మండల లోని అయోధ్య నగర్‌  ‌మీదుగా నర్సంపేట వైపు వెళుతుండగా అనుమానం వచ్చి వాహనాన్ని తనిఖీ చేసినట్లు ఆయన చెప్పారు. వాహనం లో 28 క్వింటాళ్ల రేషన్‌ ‌బియ్యాన్ని గుర్తించినట్లు తెలిపారు. రేషన్‌ ‌బియ్యాన్ని కొత్తగూడ మండలం లోని వివిధ గ్రామాల నుండి కొనుగోలు చేసి వరంగల్‌ ‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. రేషన్‌ ‌బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని,  రేషన్‌ ‌బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు. ఆయన తెలిపారు. రసమళ్ళ రాజేష్‌ , ‌లకావత్‌ ‌సురేష్‌ ‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న రేషన్‌ ‌బియ్యాన్ని సివిల్‌ ‌సప్లై అధికారులకు అప్పగించనున్నట్లు ఆయన చెప్పారు. అక్రమ వ్యా•రానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply