Take a fresh look at your lifestyle.

విధుల్లోకి తీసుకోకుంటే ప్రభుత్వాన్ని గద్దే దించేవరకు పోరాటం చేస్తాం

ఫీల్డ్ అసిస్టెంట్లను అకారణంగా తొలగించడం సరికాదు

జగిత్యాల అర్భన్‌,‌జులై 26(ప్రజాతంత్ర విలేఖరి) : అకారణంగా 17 నెలలక్రితం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేకుంటే ప్రభుత్వాన్ని  గద్దే దీంచేవరకు పోరాటం చేస్తామని జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డం రమేష్‌ ‌ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మా సత్తా చూపెడుతామని రమేష్‌ ‌పేర్కొన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం రమేష్‌ అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిథిగా సర్పంచ్‌ల సంఘం జగిత్యాల జిల్లా మాజీ అధ్యక్షులు ఎన్నం కిషన్‌ ‌రెడ్డి హాజరయ్యారు. విధుల్లోకి తీసుకోవడానికి ఎలా ముందుకు వెళ్లాలో  సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు హుజురాబాద్‌ ఎన్నిక నోటిఫికేషన్‌ ‌రాకముందే మమ్ములను విధుల్లోకి తీసుకోవాలని లేకుంటే హుజురాబాద్‌  ‌నియోజకవర్గంలో వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లను పోటీలో నిలుపుతామణి అందులో భాగంగా జగిత్యాల జిల్లా నుంచి 32 మందిని పోటీచేయించాలని తీర్మానం చేశారు. ఈసందర్బంగా గడ్డం రమేష్‌, ఎన్నం కిషన్‌ ‌రెడ్డి లు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన 4779 జిఓను సవరించాలని 2020 మార్చి లో 9 రోజులు సమ్మె చేస్తే ఉన్న ఉద్యోగాలను తొలగించారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిం చారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులతో కలిసి ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నా విషయం కేసీఆర్‌ ‌మర్చిపోయారని విమర్శించారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు చేపడుతామని, అలాగే  కాంట్రాక్టు, ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యగాలు ఉండవని చెబితే వారిని రెగ్యులరైజ్‌ ‌చేస్తామనుకుంటే ఉన్నవాటిని ఉడగొట్టారని ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ అని వారు కేసీఆర్ను ప్రశ్నించారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేనట్లయితే ప్రభుత్వాన్ని గద్దే దీంచేవరకు పోరాటం చేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు వెనుకాడరని రమేష్‌, ‌కిషన్‌ ‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మృతి చెందగా సమావేశం రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. రాజేందర్‌, ‌సంతోష్‌, ‌నసీర్‌, ‌మహేష్‌, ‌సత్యవాణి, సుజాత, రేవతి, జిల్లాలోని ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Leave a Reply