Take a fresh look at your lifestyle.

డప్పుల దరువులతో ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన

ఇబ్రహీంపట్నం, జులై26,(ప్రజాతంత్ర విలేకరి) : భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మండల దళిత మోర్చ అధ్యక్షులు లితేలుకంటి గంగాధర్‌ ఆధ్వర్యంలో డప్పుల దరువులతో ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గంగాధర్‌ ‌మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి దళిత సామాజిక వర్గానికి ప్రధానంగా డప్పులు కొట్టే వారికి చెప్పులు కుట్టే వారికి కాటికాపరులకు ప్రతినెల ఐదు వేల రూపాయల పెన్షన్‌ ‌ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్‌ ‌దళిత వ్యతిరేక విధానాన్ని కొనసాగించడాన్నీ దళిత మోర్చా మండల శాఖ వ్యతిరేకిస్తున్నాదన్నారు. ఏడు సంవత్సరాలుగా దళితులను మాయమాటలతో మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారని రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దళితులకు జరిగింది, ఒరిగిందేమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం వల్ల దళితులకు న్యాయం జరగలేదని న్యాయం జరగబోదని అన్నారు. హుజురాబాద్‌ ఎలక్షన్లలో దళితులంతా ఏకమై బీజేపీకి ఓటు వేసి కేసీఆర్‌ ‌ను చావుదెబ్బ కొట్టాలని అన్నారు. అలాగే దళిత సామాజిక వర్గం అన్ని కుల వృత్తుల వారికి ఐదు వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్‌, ‌జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీదర్‌ ‌రెడ్డి గారు, మండల బీజేపీ అధ్యక్షులు బట్టు జకరయ్య, ప్రధాన కార్యదర్శి రణదీర్‌  ‌కార్యదర్శి కుమార్‌, ‌దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి నీరటి రవి,కోశాధికారి తిమ్మాని సురేష్‌, ఉపాధ్యక్షులు తాలుక నర్సయ్య, ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు రాజేందర్‌, ‌బీజేవైయం ఉపాధ్యక్షులు వంశీ., ఎర్ర గంగారాం,సుద్దాల గంగారాం,ఎర్ర మురళి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply