రెండు వేల పెద్ద నోటుకు
భారత రిజర్వ్య బ్యాంకు
బేషరతుగా గండి కొట్టింది
క్లిన్ మనీ పాలషి పేరిట
పింక్ కరెన్సీని బ్లాక్ చేసి
కాలం చెల్లినట్లు తేల్చింది
పెద్ద నోటు రద్దు తంత్రం
సామాన్య జనుల మీద
ప్రభావం చూపనప్పటికి
సంపన్న వర్గాన్ని మాత్రం
పెద్ద షాకుకు గురిచేసింది
ఆర్థిక నేరగాళ్ల ముఠాకు
ఆశనిపాతంగా మారింది
కుహనా పొలిటికల్ లీడర్ల
గుండెలో గుబులు రేపింది
ఏకంగా బ్లాక్ మనీ మూకల
భరతం పట్టి చూపిస్తామన్న
సర్కారు ఛాలెంజ్ మాటలు
నీటి మూటలని తేల్చేసింది
అయినా రాజ్య ప్రభువర్యా!
తమరి కను సంజ్ఞ లేకుండా
ఆర్బీఐ కాలు కదపపదన్నది
జగం ఎరిగిన నిష్ఠూర నిజం
పింక్ కరెన్సీ రద్దు మాటున
మీ హస్తం తప్పక ఉందన్నది
జనావళి నమ్మే చేదు సత్యం
ఇకనైనా మోటుతనం విడిచి
నాటు ప్రయోగాలు త్యజించి
నోటు రాజకీయాలు చాలించి
నీటు పాలన అందించు సామీ !
ఇంతకు మించి ఆశల్లేవు సుమీ!
(రెండు వేల నోటు ఉపసంహరణ నేపథ్యంగా…)
– కోడిగూటి తిరుపతి, 9573929493