Take a fresh look at your lifestyle.

‘సినిమా ..’ఇంటిని చక్కదిద్దుకోవాలి ..!

“టాలీవుడ్‌ ‌గా పిలుస్తున్న తెలుగు సినిమా పరిశ్రమ గడిచిన మూడు దశాబ్దాలుగా కొన్ని కుటుంబాల వారసుల గుప్పిట్లో ఉంది. ఈ కుటుంబాల్లో చిరంజీవి, ఎన్టీఆర్‌ ,అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు సినీపరిశ్రమలో చిత్ర నిర్మాణం నుంచి పంపిణీ వరకూ, తారల ఎంపిక నుంచి తమ మార్కెట్లను పెంచుకునే వరకూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇతర సినీ నిర్మాతలను, పంపిణీ దారులను వెనక్కి తోసేస్తున్నాయి.”

సినిమా టికెట్ల విషయంలో మొదట కొంత కలవరం పడినా, టాలీవుడ్‌ ‌తన పరిశ్రమను బాగానే చక్కదిద్దుకుంది. థియేటర్లు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ , థియేటర్లను తెరిచేందుకు తెలుగు సినీ పరిశ్రమ విముఖతను ప్రదర్శించింది. టికెట్ల వ్యవహారంలో తేలకపోవడం వల్లనే అలా వ్యవహరించింది. మెగా స్టార్‌ ‌చిరంజీవి సినిమా థియేటర్‌ ‌యజమానులు, సీనీ రంగ ప్రముఖులతో వరుసగా సమావేశాలను నిర్వహించి, ,సినిమా టికెట్ల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌వద్దకు ప్రతినిధి వర్గాన్ని తీసుకుని వెళ్ళేందుకు రంగాన్ని సిద్ధం చేశారు. టికెట్లపై ప్రభుత్వం జారీ చేసిన జీఓ సవరించేట్టు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

సినీ ఎగ్జిబిటర్లు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి చొరవ తీసుకున్నారు. కొరోనా వచ్చిన దగ్గర నుంచి సినీటికెట్ల వ్యవహారం పెద్ద సమస్యగా తయారైంది.చిరంజీవి ఇప్పుడు చొరవ తీసుకోవ డానికి మూవీ ఆర్టిస్టస్ అసోసియేషన్‌ (‌మా) ఎన్నికల కోసమా,లేక తాను నటించిన భారీ బడ్జెట్‌ ‌చిత్రం ఆచార్య ప్రమోషన్‌ ‌కోసమా అనేది తర్వాత విషయం. మా అధ్యక్ష పదవికి చిరంజీవి ఆశీస్సుల తో ప్రకాష్‌ ‌రాజ్‌ ‌ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చిరంజీవి సినిమా టికెట్ల వ్యవహారంపై దృష్టి పెట్టడానికి బదులు సినీ పరిశ్రమ ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపరిష్కారానికి కృషి చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. టాలీవుడ్‌ ‌గా పిలుస్తున్న తెలుగు సినిమా పరిశ్రమ గడిచిన మూడు దశాబ్దాలుగా కొన్ని కుటుంబాల వారసుల గుప్పిట్లో ఉంది. ఈ కుటుంబాల్లో చిరంజీవి, ఎన్టీఆర్‌ ,అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు ఉన్నాయి.

ఈ కుటుంబాలు సినీపరిశ్రమలో చిత్ర నిర్మాణం నుంచి పంపిణీ వరకూ, తారల ఎంపిక నుంచి తమ మార్కెట్లను పెంచుకునే వరకూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇతర సినీ నిర్మాతలను, పంపిణీ దారులను వెనక్కి తోసేస్తున్నాయి. తమ చిత్రాల మార్కెట్‌ ‌ను పెంచుకోవడమే కాకుండా, టాలీవుడ్‌ ‌పై తమ ప్రాబల్యం కాపాడుకోవడానికి ఇది దోహదం చేస్తోంది. తమ మార్కెట్‌ ‌వ్యూహానికి ఎటువంటి ముప్పు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. బాక్సాఫీసు గణాంకాలను పరిశీలిస్తే, చిన్న స్వతంత్ర నిర్మాతలలో కొందరు మాత్రమే వాణిజ్య పరమైన విజయాలను సొంతం చేసుకోగలుగుతున్నారు. చిత్ర నిర్మాణానికి పెట్టుబడులు, చిత్ర నిర్మాణం విషయంలోనూ, , నటులు, ఇతర భాగస్వాములు వీరితో పోటీపడలేకపోతున్నారు. దీంతో నిర్మాతలు కానివ్వండి, డైరక్టర్లు, నటులు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ఒప్పందాల్లో భాగస్వాములు కాలేకపోతున్నారు. తమ బ్రాండ్‌ ‌ను పెంచుకోలేకపోతున్నారు. ఆర్థిక సుస్థిరత్వాన్ని పొందలేకపోతున్నారు. ఈ సమస్యలకు తోడు చిత్రం విడుదలకు ముందే పెద్ద ఎత్తున ప్రచారానికి వ్యయం చేయలేకపోతున్నారు.

ఈ కుటుంబాలకు చెందిన నటులు , కళాకారులకు మాత్రమే ప్రచారం లభిస్తోంది. పెద్ద నటులు, కళాకారుల పారితోషికాలు ఆకాశమంత ఎత్తు పెరిగిపోవడం వల్ల చిత్ర నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయింది. డిజిటల్‌ ‌ఫ్లాట్‌ ‌ఫారమ్‌ ‌లలో కూడా చిన్న నిర్మాతలకు ప్రాధాన్యం లభించడం లేదు. కనుక చిరంజీవి టికెట్ల వ్యవహారం గురించి మాత్రమే కాకుండా థియేటర్లకు జనం వచ్చేట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కోవిడ్‌ ‌వల్ల సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. టికెట్ల ధరల వ్యవహారం కన్నా ముందు ఆయన తన ఇంటిని చక్కదిద్దుకోవాలి. ప్రేక్షకులు లేకుండా మెగాస్టార్లు, స్టార్‌ ‌డమ్‌ ‌లు, పవర్‌ ‌స్టార్‌ ‌లు ఉండరు.

Leave a Reply