Take a fresh look at your lifestyle.

ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలి

పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ అర్బన్‌, ‌జూలై 22, (ప్రజాతంత్ర ప్రతినిధి):రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి , టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కె.తారక రామారావు జన్మదినం సందర్బంగా ఈ నెల 24న రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ ‌కుమార్‌ ‌గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ఆధ్వ ర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం లో అందరూ పాల్గొని పెద్ద ఎత్తున విజయవం తం చేయాలని పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభి వృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అడవుల పెంపకానికి సిఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, మానవుల మనుగడకు చెట్లే ఆధారమని, పెరుగుతున్న జనాభా పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో అడువులు తరిగిపోతున్నా యన్నారు. దీనివల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు.భూభాగంలో 33 శాతం పచ్చదనం ఉండాలనే లక్ష్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి తెలంగాణ హరితహారం అనే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర భూభాగంలో అడవులు 24 శాతం మాత్రమే ఉన్నాయని, హరితహారం కార్యక్రమం ద్వారా అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెరిగేలా చర్యలు గైకొనడం జరిగింద న్నారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రం ఏర్పాటుకు ముందు ప్రభుత్వం తరుపున కేవలం 14 కోట్ల మొక్కలను నాటడం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా గత ఐదేళ్ల కాలంలో 220 కోట్ల మొక్కలను నాటించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో 21 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించా రన్నారు. దాదాపు లక్ష్య సాధనకు దగ్గరలో మనమున్నారు.

హరితహారానికి ముందు రాష్ట్ర విస్థీర్ణం 24 శాతంగా ఉండేదన్నారు. ఈ కార్యక్ర మం చేపట్టిన గత ఐదేళ్ల వ్యవధిలో ఏకంగా అటవీ విస్థీర్ణం 4 శాతం పెరిగి 28 శాతానికి చేరుకున్నదని, ఈ విషయాన్ని ఫారెస్ట్ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియానే స్వయంగా ప్రకటించిందన్నారు. హరితహారం కార్యక్రమం కొనసాగింపులో భాగంగా ఈనెల 24న కెటిఆర్‌ ‌జన్మదినాన్ని పురస్కరించుకొని వృక్షార్చన కార్యక్రమంలో మూడు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారని, నాటిన మొక్కలను సంరక్షిం చడం మనందరి బాధ్యత. ముక్కోటి వృక్షార్చనలో నాటిన మొక్కలను సంరక్షించడానికి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని మనవి చేస్తున్నానని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై కొన్ని కోట్ల మొక్కలు నాటాలని తెలంగాణ అంతా ఆకుపచ్చగా మారాలని కోరు తున్నాన్నారు. ఈనెల 24న ఉదయం 10 గంటల నుండి జరిగే ముక్కోటి వృక్షార్చన కార్యక్ర మాన్ని గ్రామ పంచాయతీలలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు, యువత రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలను నాటాలని విజ్ఞప్తి చేస్తున్నానమన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయలు, మహి ళలు,యువతీ యువకులు, రాజకీయాలకు అతీ తంగా పెద్ద ఎత్తున అందరూ పాల్గొని విజయ వంతం చేయాలన్నారు.ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో వర్షాలు అధికంగా కురుస్తున్నందున్న, కొన్ని చోట్ల వాగులు, నదులు పొంగిపొర్లుతున్నా యని, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తాను కూడా వెంటనే ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాకు వెళుతున్నానని, ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పరంగా పూర్తిగా అలర్ట్‌గా ఉన్నామని, అన్ని సహాయక చర్యలు తీసుకుంటామని, అవసర మైన చోటసహాయక చర్యలు అందించాలన్నారు.

Leave a Reply