Take a fresh look at your lifestyle.

కాలాన్ని దోసిట దాచి

కాలం సెకండ్ల ముల్లుగా
టిక్‌ ‌టిక్‌ ‌శబ్దాలతో కష్టంగా
కదులుతూ కిలోల బరువు
మోస్తూ ముళ్లై ఎదలో
గుచ్చుతూ సాగుతోంది
నిశ్శబ్దంనీకూనాకూనడుమనేకాదు
కనిపించని అంతరంగంలో కూడా
అల్లుకుని అయోమయాన్ని నింపుతోంది
ఎగసి పడే జీవన వాహిని ఘనీభవించి
కదలికల్ని కట్టడి చేస్తోంది
నిద్రరాని కళ్ళను కాపలా కాయలేక
రెప్పల తలుపులు తెరిచే ఉన్నాయి
నానుండి కలల్ని నాకు తెలియకనే
ఎవరో దొంగిలించినట్టుంది
మనుషుల అలికిడిలేని దారులు
నవ్వులు చిగురించని మోములు
పరిమళాలను పూయని పూలు
వెలుగుల ఛాయలు కానరాని
మసకచీకటి అలుముకున్న లోకాన
కనిపించని రాకాసి మనిషిమనుగడపై
అంతులేని దాడులు చేస్తూ
జన జీవన వనాన
జీవనాన్ని హరించి
బ్రతుకులను మోడుచేస్తుంటే
నిశ్చేష్టుడై మౌనంగా తూరుపు
వాకిట ఆశల అలికిడి కోసం
నిరీక్షిస్తూ కాలాన్ని దోసిట దాచి
ఆహ్వానాన్ని పలుకుతూ నిలిచాడు!
– డా. కె. దివాకరా చారి
9391018972

Leave a Reply