Take a fresh look at your lifestyle.

తేలని వలస, రోజు వారి కూలీల లెక్కలు.. అందని ప్రభుత్వ సహాయం పస్తులుంటున్న కుటుంబాలు

తెలంగాణ రాష్ట్రంలో కొరోనా నివారణకు విధించిన లాక్‌డౌన్‌ ‌వలస కార్మికుల పాలిట శాపంగా మారింది. తాము పనిచేసే కంపెనీల్లో పనుల్లేక, తీసుకొచ్చిన కాంట్రాక్టర్లు పట్టించుకోక, సరుకులు కొనుక్కొనేందుకు చేతిలో డబ్బుల్లేక వలస కార్మికులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. కడుపు మంట తీర్చుకొనేందుకు కావాల్సిన వాళ్లను వదులుకుని వందల కిలోమీటర్ల దూరం వచ్చిన వారు అనేక అవస్థలు పడుతున్నారు. లాక్‌డౌన్‌ ఆకలి వారి జీవితంలో ఒక భాగమైపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస, రోజు వారి కూలీలను పస్తులుండకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. అయితే ఏ ప్రాంతంలో ఎంత మంది వలస కూలీలు, రోజు వారి కూలీలు ఉన్నారే సంఖ్య కార్మిక శాఖ అధికారుల వద్ద స్పష్టంగా లేదు. కొన్ని సంస్థలు మాత్రమే తమ వద్ద ఉన్న కార్మికుల పేర్లను కార్మిక శాఖలో నమోదు చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో పని చేస్తున్న వలస కూలీలు, రోజువారి కూలీలు, చిన్నచిన్న షాపులు, పరిశ్రమలు, బిల్డర్ల వద్ద ఉన్న వారి వివరాలు నమోదు కాలేదు. దీంతో కార్మిక శాఖ వద్ద ఉన్న నమోదు అయిన వారికి ప్రభుత్వ సహాయం అందుతుంది. మిగిలిన వేలాది మందిని పట్టించుకునే వారు కరువయ్యారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని వలస, వ్యవసాయ కూలీలు, రోజు వారీ అడ్డా కూలీ) పరిస్థితి ఉంది. స్వయంగా కెసిఆర్‌ ‌వలస కూలీలు పస్తులు ఉండవద్దు అంటూ ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఖర్చులకు రూ.500 నగదు ఇవ్వాలని నిర్ణయించారు. అయినా ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా కూలీలకు బియ్యం, డబ్బులు రాలేదు. రూరల్‌ ‌జిల్లా పరిధిలోని రేషన్‌ ‌కార్డు దారులకు బియ్యం ఇచ్చినప్పటికీ, అర్బన్‌ ‌జిల్లాలో అడ్డా కూలీలు, వలస వ్యవసాయ కూలీలు, వలస కార్మికులు 12 కిలోల బియ్యం, రూ.500 కరువై పోయింది. దాతలు ఇచ్చిన బియ్యం, కూరగాయాలు, పప్పులు తదితర సామాన్లతో సరిపెట్టుకుంటూ పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది.

రియల్‌ ఎస్టేట్‌, ‌బిల్డర్లు :
ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ ‌జోరుగా సాగింది. తెలంగాణ రాష్ట్రంలో హైదారాబాద్‌ ‌తర్వత పెద్ద జిల్లాగా గుర్తింపు పొందిన వరంగల్‌ ‌జిల్లా అనతి కాలంలోనే విస్తరించింది. ఐటి రంగం కూడా వరంగల్‌ ‌జిల్లాలో అడుగు పెట్టింది ఐటీ కంపెనీలు వరంగల్‌ ‌లో స్థాపించారు. కొత్తగా రూపిందించిన మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌వరంగల్‌ ‌జిల్లా ప్రాధాన్యత పెరిగింది. దీంతో వరంగల్‌ ‌జిల్లాలో రియల్‌ ‌దందా పెద్ద ఎత్తును సాగుతోంది. ట్రై సిటీలలో పెద్ద పెద్ద వెంచర్ల నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. సుమారు 150 మంది బిల్డర్లు 2000 సైట్లలో నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో స్థానిక కూలీలనే కాకుండా వరంగల్‌ ‌జల్లాకు ఇతర రాష్ట్రాల కూలీలను పెద్ద ఎత్తును తీసుకవచ్చారు. ఇక్కడి బిల్డర్లుకు ఒక్క వరంగల్‌ ‌జిల్లాలోనే 4 వేలకు పైగా వలస కార్మికులు పని చేస్తున్నారు. ఇతర చిన్నతరహా కంపెనీలు నిర్మాణ రంగంలోనూ, ఉత్పత్తి రంగంలోనూ ప్రమాదకర పనుల్లో ఈ వలస కార్మికులను ఎక్కువగా వినియోగిస్తారు. తక్కువ డబ్బులతో అత్యంత ప్రమాదకర పనులు చేయిస్తున్నారు. జార్కండ్‌, ‌చత్తీస్‌ఘడ్‌, ఒడిషా, మధ్యప్రదేశ్‌, ‌బీహార్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, అస్సాం వంటి పలు సుదూర రాష్ట్రాల నుంచి పనుల కోసం కూలీలు వరంగల్‌ ‌జిల్లాకు వచ్చారు. వారు కొంతమంది కుటుంబాలతో రాగా, మరికొందరు కుటుంబ సభ్యులను వదిలి వచ్చారు. ఇలా వచ్చిన వాళ్ళకు ఇప్పడు లాక్‌ ‌డౌన్‌ ‌నరకం చూపిస్తుంది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో వారిని పట్టించుకున్న నాధుడు లేడు. వారికి సరిపడ సరుకులు, నిత్యవసర వస్తువులు లేకపోవడం, మద్య దళారి వ్యవస్థ తోడవడంతో వారు దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో అసంపూర్తిగా ఉన్న ఇండ్లే వారి ఆవాసాలుగా నిలుస్తున్నాయి. గాలి, వెలుతురు, నీటి సదుపాయం లేని పశువుల పాకల కంటే ఘోరగా దర్శనమిస్తున్నాయి. అసంతృప్తి ఉన్న అపార్టుమెంట్లులో తలదాచుకుంటున్నారు. కనీసం తినేందుకు తిండిలేక పస్తులుంటున్నారు. వలస కార్మికులకు భోజనాలు, వంట చేసుకొనేందుకు సరుకులు ఇచ్చే వారులేకా ఆకలితో అలమటిస్తున్నారు. ఇరుకు గదిలో 20 మంది వరకు తలదాచుకుంటున్నారు. జైళ్ళ కంటే ఘోరమైన జీవితాలను వలస కార్మికులు గడుపుతున్నారు. పస్తులతో ఉండలేక ఇళ్లకు పోదామంటే రవాణా సౌకర్యం లేదు. నరకం చూస్తున్నారు.
పోటీపడి ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేస్తున్న యాజమాన్యాలు తమ కళ్లముందే ఆకలితో అలమటిస్తున్న కార్మికులకు పట్టెడు అన్నం పెట్టడం లేదని పలువురు వలస వచ్చిన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్భర జీవితాలు గడుపుతున్న కార్మికులకు ప్రభుత్వ యంత్రాంగం భోజన సౌకర్యం కల్పించడం లేదు.

వ్యవసాయ కూలీలు:

ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో మొక్కజోన్న, మిర్చి, వరి కోతలో కోసం వచ్చిన మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘఢ్‌ ‌నుంచి వచ్చిన కూలీలు కరోనా భయంతో ఎటు కదలడం లేదు. జనవరిలో వచ్చిన కూలీలు ‘మే’ చివరి వారం వరకు ఇక్కడే ఉంటారు. ములుగు, భూపాలపల్లి, మహాబూబాబాద్‌ ‌జిల్లాలో ఏ పల్లే చూసిన మహారాష్ట్ర, చతీస్‌ఘడ్‌ ‌కూలీలే కాని కనిపిస్తుంటారు. వ్యవసాయ కూలీ కోసం కొందరు కుటుంబ సమేతంగా వస్తారు. ఇలా వచ్చిన కూలీలు కొన్ని ఊళ్ళను ఎంపిక చేసుకోని అక్కడ వ్యవసాయ పనులు పూర్తి అయ్యేవరకు అక్కడే మాకాం వేసి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 వరకు పని చేస్తుంటారు. స్థానిక కూలీల ••ంటే ఎక్కవ సమయం పని చేస్తుండంతో ఇతర రాష్ట్రాలనుండి వచ్చే కూలీలకే ఎక్కవ ప్రాదాన్యత ఇస్తున్నారు. దీంతో ఎక్కవ పని దొరకడంతో ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో కూలీ పనులకు వచ్చే చతీస్‌ఘడ్‌, ‌మహారాష్ట్రా కులీలు సంఖ్య ఏడాదికి ఎడాది పెరుగుతోంది. తాజాగా ఈ ఏడాది కూడా మిరప పంట ఎక్కవ పండడంతో చాల ఆశలతో ఇతర రాష్ట్రాల కూలీలు వచ్చారు. ఇక పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఒక్కసారి కరోన రూపంలో వారిని నట్టేటా ముంచింది. దీని బారిన పడకుండా ఉండేందుకు ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పంటలను కోసేందుకు కూలీలెవరూ ముందుకు రాక రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రైతులు పండించిన పంటలకు ఎలాంటి నష్టం, కష్టం రానివ్వబోమని, మార్కెటింగ్‌ ‌శాఖ అధికారులు గ్రామాల్లోకి వచ్చి పంటలను కొంటారని, రైతులు •యపడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ ‌స్వయంగా ప్రకటించినా ఎక్కువ శాతం పంట ఇంకా పొలాల్లోనే ఉంది. కూలీలను కదిలిస్తే తామెక్కడ కరోనా బారిన పడతామోనని రైతులు భయపడుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో వరి, రెండు లక్షల ఎకరాల్లో మిర్చి, రెండున్నర లక్షల ఎకరాల్లో మొక్కజోన్న సాగు జరిగింది. దీంతో పెద్ద ఎత్తున కూలీలు కూలీ పనులు కోసం వరంగల్‌ ‌జిల్లాకు చేరుకున్నారు. కానీ వారి ఆశల పై కరోన రూపంలో ఆడ్డు పడింది. కనీసం మిర్చిని, కోసేందుకు కూలీలు రాక, కోసినా రవాణా చేసే వీలులేక కాసిన పంటంతా కుళ్లిపోతోంది. లాక్‌డౌన్‌ ‌ప్రభావం పడటంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. వీరితో పాటు వలస కూలీలు పస్తులు ఉంటున్నారు. ప్రభుత్వం వలస కూలీల కోసం రూ.500లతో పాటు ఒక్కరికి 12 కిలోల బియ్యం ఇవ్వాలి అనే అదేశాలు ఉన్నా అధికారులు మాత్రం వారిని అదుకునే పని చేయడం లేదు. దీంతో ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాకు వచ్చిన సూమారు 3500 మంది వ్యవసాయ వలస కూలీలు పస్థులు ఉంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో వలస కూలీలు తెలంగాణ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు. అంతే కాదు స్థానకంగా ఉన్న నేతలను కలిసిన మీకు బియ్యం ఇస్తాం అంటూ వివరాలు సేకరించారు. కానీ వారికి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటికి ఇటు బియ్యం కాని అటు నగదు కాని అందకపోవడంతో తప్పు ఎక్కడ జరిగిందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌వలస కూలీల అకలి తీరుస్తాం అంటు ఇచ్చిన హామీని అధికారులు ఎందుకు అమలు చేయడం లేదు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అడ్డా కూలీలు :
కోడి కూయక ముందే అడ్డాకు చేరుకోని చౌరస్తాలో నిలబడి కళ్ళలో కోటి కాంతులు నింపుకొని ఈ వేళైనా పని దొరక్కపోతుందా నాలుగు డబ్బులు జేబులోకి వెళ్ళకపోతాయా అని నిరీక్షిస్తుంటారు. పనులు దొరికితే తప్ప నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళలేని పరిస్థితి. నగరంలో 15 చోట్ల కూలీల అడ్డాలు ఉన్నాయి. వీటిలో 5 వరంగల్‌లో, మరో 5 హన్మకొండలో, ఇంకో 5 కాజీపేట, నగర శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. వరంగల్‌ ‌రామన్నపేట, హన్మకొండ ఏనుగులగడ్డ, పబ్లిక్‌గార్డెన్‌ ‌ప్రాంతాలు కూలీల అడ్డాలకు ప్రముఖమైనవి. ఈ అడ్డాల్లో ప్రతి రోజు 3వేల మందికిపైగా కూలీలు పనుల కోసం నిరీక్షిస్తుంటారు. ఇందులో సగం మంది మహిళలే. కూలికి వెళ్ళిన రోజు రూ.350 నుంచి రూ.500 వరకు సంపాదిస్తారు. కూలీలేకపోతే ఆ రోజు కుంటుంబం మొత్తం పస్తులే ఉండాలి. ఇలాంటి కూలీలకు గత 20 రోజులుగా పనులు లేవు. కనీసం బ యటకు రావడం కూడా అనుమతి లేకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో 275 కూలీల అడ్డాలు ఉన్నాయి. 45 వేల మంది కూలీలు ఉన్నారు. వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లాలో 10వేల మందికిపైగా అడ్డా కూలీలు ఉండాగా. వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లాలో 8వేలు, జనగామ జిల్లాలో 7వేలు, మహబూబాబాద్‌ ‌జిల్లాలో 9 వేలు, ములుగు జిల్లాలో 5వేలు, భూపాలపల్లి జయశంకర్‌ ‌జిల్లాలో 6 వేల మంది అడ్డాకూలీలు ఉన్నారు. వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా పరిధిలోని 11 మండలాల్లో 135 కూలీ అడ్డాలు ఉన్నాయి. ప్రతీ మండల కేంద్రంలో నాలుగు నుంచి అయిదు చోట్ల కూలీల అడ్డాలు ఉన్నాయి. ఇలాంటి ఆడ్డాకూలీలు లాక్‌ ‌డౌన్‌ ‌తో ఇంటికి పరిమితం అయ్యారు.

Leave a Reply