Take a fresh look at your lifestyle.

అం‌బేడ్కర్‌ ‌స్ఫూర్తితోనే తెలంగాణ సాధించాం

  • కులరహిత సమాజం కోసం తపించారు
  • రాజ్యాంగ నిర్మాతకు మంత్రులు కెటిఆర్‌, ఈటల, పలువురు నేతల నివాళి
  • జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌ ‌వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి
  • రాష్ట్ర వ్యాప్తంగా పలువురి నివాళి

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత రాంజ్యాంగాన్ని నిర్మించిన మహా గొప్ప వ్యక్తి అంబేద్కర్‌ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ 130‌వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాతకు మంత్రులు, నేతలు నివాళి అర్పించారు. ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద అంబేద్కర్‌ ‌విగ్రహానికి పూలమాల వేసి మంత్రులు, టిఆర్‌ఎస్‌ ‌నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌ ‌మాట్లాడుతూ అంబేద్కర్‌ ‌రాసిన రాజ్యాంగంలో భాగంగా ఆర్టికల్‌ 3 ‌ప్రకారమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు.. బోధించు, సవి•కరించు, పోరాడు అనే అంబేద్కర్‌ ఆశయాల్లో భాగంగా తెలంగాణను సాధించుకున్నాం.

అందుకే హైదరాబాద్‌ ‌నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్‌ ‌విగ్రహా ఏర్పాటుకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆధ్వర్యంలో ఒప్పందం జరిగిందని, త్వరలోనే ఆ నిర్మాణం చేపడతాం. కేసీఆర్‌ ‌సర్కారులో దాదాపు 1000 గురుకులాలను ఏర్పాటు చేసి అంబేద్కర్‌ ఆశయాలను అమలు చేస్తున్నాం. మున్ముందు కూడా అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అణగారిన వర్గాల కోసం.. అణచివేతకు గురైన వారి కోసం పోరాడిన వ్యక్తి అంబేడ్కర్‌ అన్నారు మంత్రి ఈటల రాజేందర్‌. ‌ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద అంబేడ్కర్‌ ‌విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన ఆయన.. అనంతరం వి•డియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల, కులాల ప్రజలందరూ కలిసి మెలసి ఉండాలని కోరుకున్నారని, స్వేచ్ఛా, సమానత్వం ఆయన ఆశయం అన్నారు.

కులరహిత, మతరహిత సమాజం అంబేడ్కర్‌ ‌లక్ష్యమన్నారు. ఈనాటికీ కూడా రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేయడం దురదృష్టకరమన్నారు. అంబేడ్కర్‌ ‌రాజ్యాంగాన్ని పాలకులు పఠనం చేసి ప్రజలకు మేలు చేయాలన్నారు. దళితులు నేటికీ భయంకరమైన జీవితం గడుపుతున్నారని ఈటల వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మంత్రులు శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌కొప్పుల ఈశ్వర్‌, ఎస్సీ ఎస్టీ కమిషన్‌ ‌చైర్మన్‌ ఎ‌ర్రోళ్ల శ్రీనివాస్‌ ‌తదితరులు పాల్గొన్నారు. అరణ్య భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌ ‌లోకా భూమా రెడ్డితో కలిసి అంబేద్కర్‌ ‌చిత్రపటానికి పూలమాలవేసి మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మసమాజ స్థాపన కోసం, దేశాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుడు డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ అని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, సూచించిన మార్గంలో పయనించి నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌జయంతి సందర్భంగా మంత్రి జగదీష్‌ ‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. హాలియాలో ఉన్న అంబేద్కర్‌ ‌విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ‌శాసనసభ్యులు కోనేరు కొనప్ప, సాగర్‌ ఈఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply