Take a fresh look at your lifestyle.

‌తెలంగాణ వైకుంఠం

తెలంగాణ ఆధ్యాత్మిక భక్తి సిగలో..
నవ సంఖ్యా విశేషాల నిధి భద్రవేది
ధగధగల శ్రీవైష్ణవ దివ్య సువర్ణమూర్తి
రామానుజాచార్యుల కొలువైన కోవెల
దేదీప్యమానం తెలంగాణ వైకుంఠం
సమతామూర్తికే శతకోటి వందనాలు !

శ్రీరామనగరం సింగారించిన వేళలు
భక్తజన సంద్రపు మధురానుభూతులు
సమత మమత సమానత్వ అడుగులు
ఆచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకలు
స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ దివ్య వెలుగులు
సర్వవ్యాప్తం సమతామూర్తి విశ్వ ఖ్యాతులు !

ముచ్చింతల్‌ ‌మనోమందిరాలు మురిసెన్‌
‌తెలంగాణ మాతృమూర్తి ధగధగ మెరిసెన్‌
‌భక్తకోటి ఆధ్యాత్మిక లోకంలో మునిగెన్‌
‌రామానుజుల దివ్యదీవెనల వాన కురిసెన్‌
‌శ్రీరామనగరి భక్తిగీతాల వరదలో తడిసెన్‌
‌తెలుగోడి ఆత్మ అమృతంతో పుణీతమయ్యెన్‌ !

‌చిన్న జీయరు స్వప్నమే సాకారమైన వేళలు
విరాట్‌ ‌విగ్రహావిష్కరణ మధుర క్షణాలు
కణకణంలో క్షణక్షణ పరమాత్ముడి దర్శనాలు
ప్రాణికోటి సమస్త సమభావనల జీవితాలు
కలియుగ కరోనా రక్కసి కసి విధ్వంసాలు
అపూర్వ భక్తి ఆయుధాలతోనే శిరచ్ఛేదనాలు !

విశ్వ మానవాళికే సమతా సూత్ర ప్రదాత
తెలంగాణ మది సిగలో వెలసిన మూర్తి
వెదజల్లాలి నిత్య చైతన్య ఉజ్వల స్పూర్తి
దీవించాలి భక్తజనుల సద్భావనల యుక్తి
విలసిల్లాలి సమాజోధరణల స్వచ్ఛ సత్కీర్తి
వర్ధిల్లాలి ధరణిన సమానత్వాల సర్వవ్యాప్తి !

మధుపాళీ
              కరీంనగర్‌  9949700037

Leave a Reply