Take a fresh look at your lifestyle.

18- 44 ఏళ్ల  వ్యాక్సినేషన్ లో తెలంగాణ లాస్ట్ ..!

 టాప్ త్రీ లో రాజస్థాన్, బిహార్, యూపి రాష్ట్రాలు ..
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ ,మే 24: వ్యాక్సినేషన్ ప్రక్రియ తెలంగాణలో చాలా నెమ్మదిగా  జరుగుతుంది అని కేంద్రం విడుదల చేసిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా 18- 44 వయసు వారి జాబితాలో తెలంగాణ ఆఖరి లో ఉంది. ఈ కేటగిరిలో ఇప్పటి వరకు కేవలం 654 మందికి మాత్రమే ప్రభుత్వం వాక్సిన్ వేయగలిగింది.  కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్ష్య దీప్, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ తో పోల్చితే… ఇది పది శాతం మాత్రమే. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ తో పోల్చి చూస్తే తెలంగాణలో జరిగిన వాక్సినేషన్ చాలా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా  18-44 వయసున్న వారిలో కోటి మందికి(1, 06, 21, 235) పైగా వాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సోమవారం వెల్లడించింది. రాజస్థాన్ 13, 17, 060 మందికి వ్యాక్సిన్ వేసి ఫస్ట్ ప్లేస్ లో నిలవగా… 12,27,279 మందికి వాక్సిన్ వేసిన బీహార్ రెండో స్థానంలో నిలిచింది. యూపీ (10.70),  ఢిల్లీ (9.15), మధ్య ప్రదేశ్ (7.72), మహారాష్ట్ర(7.06), చత్తీస్ ఘడ్(7.01) లక్షలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
21. 80 కోట్ల డోసులను కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేసింది...
 దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 21.80 కోట్ల డోసుల వ్యాక్సిన్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1,80,43,015 డోసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. రానున్న 3 రోజుల్లో మరో 48 లక్షల డోసులను రాష్ట్రాలకు ఇవ్వనున్నట్లు  కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు 21,80,51,890 డోసులను రాష్ట్రాలకు ఇవ్వగా, వేస్టేజీ తో కలిపి ఇప్పటి వరకు 20,00,08,875 డోసులు రాష్ట్రాలు, యూటీలు  వినియోగించుకున్నట్లు వెల్లడించింది. మరో మూడు రోజుల్లో రాష్ట్రాలకు మరో 48,00,650 డోసులు ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.

Leave a Reply