Take a fresh look at your lifestyle.

ఉద్యోగ, ఉపాధ్యాయులను నిరాశపరచిన స్వరాష్ట్ర మొదటి పీఆర్సీ సిఫారసులు

తెలంగాణ రాష్ట్రం కోసం ముందువరసలో నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ రోజు ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారు? తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్న ఉద్యోగ ఉపాధ్యాయులు ఈరోజు స్వరాష్ట్రంలో ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారు? స్వరాష్ట్రం కోసం నలభై రెండు రోజులు సకల జనుల సమ్మె చేసిన తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ రోజు ఎందుకు నిరసన బాట పట్టారు? దానికి కారణం ఒక్కటే,స్వరాష్ట్రంలో ఉద్యోగుల ముఖ్యంగా ఉపాధ్యాయుల సమస్యలు ఒక్కటంటే ఒక్కటి కూడా పరిష్కరించకపోగా నిరాదరణకు గురవుతున్నారు. గత ఆరున్నర సంవత్సరాలుగా అంతకంటే ముందు ఉద్యమకాలంలో రెండు సంవత్సరాలుగా మొత్తంగా గత ఎనిమిదినర సంవత్సరాలుగా ప్రమోషన్లు లేక 15,20, 25 సంవత్సరాలుగా ఒకే క్యాడర్‌ ‌లో పని చేస్తూ నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ప్రమోషన్ల పర్వం మొదలు కావడం హర్శించదగ్గ పరిణామం. గత పి.ఆర్‌.‌సి లో 43% పిట్మెంట్‌ ఇచ్చారు. ఉద్యోగ,ఉపాధ్యాయులు నాటి ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారు,నేటి తెలంగాణ ప్రభుత్వ పథకాలు వంద శాతం అమలు చేయటంలో ఉద్యోగ,ఉపాధ్యాయులు కృతార్థులు అవుతున్నారు.కాబట్టి గత పిఆర్సీలో పిట్మెంట్‌ 43% ‌కంటే ఎక్కువ ఇచ్చిన తక్కువే.కొత్త పిఆర్సి సమయం వచ్చింది, ప్రభుత్వం కూడా ముందుగానే పిఆర్సి కమిషన్ను నియమించడం ఆహ్వానించదగ్గ పరిణామం.

కానీ గత ముప్పై రెండు నెలలుగా పీఆర్సీ కమిషన్‌ ‌తన రిపోర్టు ఇవ్వకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. ముందుగానే పిఆర్సి కమిషన్‌ ‌నియమించిన లాభం లేకుండా ముప్పై రెండు నెలలు గడిచి పోయింది.దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పి ఆర్‌ ‌కమిషన్‌ ఇం‌త సమయం తీసుకుని ఉండకపోవచ్చు.ఈ కమీషన్‌ ‌తెలంగాణ రాష్ట్రంలో మొదటి పే రివిజన్‌ ‌కమిషన్‌. ‌సహజంగానే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆశలు మొదటి కమిషన్‌ ‌పై ఎక్కువగానే ఉంటాయి.గతంలో 43% ఫిట్మెంట్‌ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అంతకంటే ఎక్కువగానే ఆశిస్తారు.కానీ జరిగింది ఏమిటి?పీఆర్‌ ‌కమీషన్‌ 45 ‌సంవత్సరాల చరిత్రను తిరగరాస్తూ అతి తక్కువగా (7.5 %)పిట్మెంట్‌ ‌సిఫారసు చేయడమేకాకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టం జరిగేలా పిఆర్సి సిఫారసులు ఉండడంతో ఒక్కసారిగా ఉద్యోగ ఉపాధ్యాయ లోకంలో ఆగ్రహం,ఆవేశం కట్టలు తెంచుకుంది. పిట్మెంట్‌ 7.5 ‌శాతంగా సిఫారసు చేయడంతో ఇది %ణ% రిపోర్ట్ఆ,‌లేక పీఆర్సీ రిపోర్ట్ఆ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త రాష్ట్రంలో మొదటి పిఆర్సి కాబట్టి 63% పిట్మెంట్‌ ఉం‌డాలని ఉద్యోగ ఉపాధ్యాయులు ఆశించడం సహజం.అంత కాకపోయినా గత పిఆర్సి ఫిట్మెంట్‌ 43% ‌వరకైనా ఇస్తారులే అనుకున్నారు. సోదర రాష్ట్రం ఆంధప్రదేశ్‌ ‌లోటు బడ్జెట్లో ఉన్న 27% మధ్యంతర భృతిని గత రెండు సంవత్సరాలుగా ఇస్తుంది.కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో మధ్యంతర భృతి ఇవ్వకపోగా పిఆర్సి ఫిట్మెంట్‌ 7.5 % ‌గా సిఫారసు చేయడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు.కోరి తెచ్చుకున్న స్వరాష్టంలో ఇంత అన్యాయమా అని వాపోతున్నారు.వాస్తవంగా పి.ఆర్‌.‌సి ఫిట్మెంట్‌ ‌ద్రవోల్బణం ప్రకారం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇతర అంశాలను బేరీజు వేసుకొని నిర్ణయించాలి. కానీ ఈ కమిషన్‌ ‌పిట్మెంట్‌ ‌ని 7.5 శాతంగా ఏ ప్రాతిపాదికన నిర్ణయించింది?ఏ శాస్త్రీయ పద్ధతిని పాటించిది? ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మారింది. సాధారణంగా హెచ్‌ ఆర్‌ ఏ ‌పెంచుతారు లేదా ఉన్నది ఉన్నట్టుగానే ఉంచుతారు.

కమిషన్‌ ‌మాత్రం 30,20,14.5 ,12 శాతలుగా ఉన్న స్లాబులను 24,17, 13,11 శాతాలుగా తగ్గించి ఉద్యోగ ఉపాధ్యాయుల ఆశలపై నీళ్లు చెల్లింది.గ్రాట్యుటీ 20 లక్షలు గా డిమాండ్‌ ‌చేయగా 16 లక్షలు మాత్రమే చెల్లించాలని సిఫారసు చేసి పదవీ విరమణ చేయనున్న ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో నిరాశలు నింపింది.సిపిఎస్‌ ‌ని పూర్తిగా రద్దు చేయాలని కోరితే ఇప్పటివరకు 10% ఇస్తున్న ప్రభుత్వ కాంట్రిబ్యూషన్‌ ఇప్పుడు 14%కి పెంచి సిపియస్‌ ఇలాగే కొనసాగుతుందని చెప్పకనే చేపింది.చిల్డ్రన్‌ ‌ట్యూషన్‌ ‌ఫీజు ను పెంచమని కోరితే మొత్తంగా రద్దు చేయటం,సంవత్సరానికి ఇచ్చే వార్షిక ఇంక్రిమెంట్లను మూడు సంవత్సరాలకు పొడగించడం,వార్షిక ఇంక్రిమెంట్ల రేటును 3.36% నుంచి 2.33% కు తగ్గించడం వారికే చెల్లింది.అప్రయత్న పదోన్నతిని మార్పు చేయక పోవడం,కనీస వేతనం 25000 ఉండాలని కోరగా 19000 గా సిఫారసు చేసి చిరుద్యోగులకు అన్యాయం చేసింది.నివేదికలో ఉద్యోగ,ఉపాధ్యాయుల్లో సంబరపరిచే అంశం పదవీ విరమణ వయసు 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచడం,పిల్లల సంరక్షణ సెలవులు 90 రోజుల నుంచి 120 రోజులకు పెంచడం మాత్రమే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం తమ ఉద్యోగాలను పణంగా పెట్టి పోరాటం చేసిన ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ఆనాటి ఉద్యమ నాయకుడే నేటి ముఖ్యమంత్రి గారు కాబట్టి మా ఆవేదనను అర్థం చేసుకుని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం.

jurru narayana yadav.jp
జుర్రు నారాయణ యాదవ్‌
‌టి టి యు జిల్లా అధ్యక్షులు
మహబూబ్నగర్‌జి
9494019270.

Leave a Reply