Take a fresh look at your lifestyle.

సిఎం కెసిఆర్‌ ‌రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

‌తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ వి•డియాతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రం నిష్పక్షపాతంగా నిధులు ఇస్తుంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వడంలేదని టీఆర్‌ఎస్‌ ‌నేతలు చెబుతున్నారని, పన్ను కడితేనే కేంద్రం నిధులు ఇస్తుందని చెబుతున్నారని అన్నారు.

ఆ పన్నులు కేసీఆర్‌ ‌జాగీరా? లేక ఆయన ఇంట్లో ముద్ర వేసి పన్నులు కడుతున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నులే కదా ప్రభుత్వం కేంద్రానికి కడుతుందని ఆయన అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply