Take a fresh look at your lifestyle.

దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్‌

దావోస్‌ ‌లో పర్యటిస్తున్న పారిశ్రామిక, ప్రభుత్వ వర్గాలకు తెలంగాణ పెవిలియన్‌ ‌ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దావోస్‌ ‌పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఏర్పాటుచేసిన ఈ పెవిలియన్‌ ‌ను అనేక మంది ప్రముఖులు సందర్శిస్తున్నారు. భారతదేశం నుంచి తెలంగాణతోపాటు కర్ణాటక, మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రాలు మాత్రమే ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేశాయి.తెలంగాణ ప్రభుత్వ పెవిలియన్లో ఒక రిసెప్షన్‌ ఏరియాతో పాటు, రెండు  సమావేశ గదులు, ఒక వెయిటింగ్‌ ‌ప్రాంతం ఉన్నది. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వర్చువల్‌ ‌రియాలిటీ లాంజ్‌ ‌ను సందర్శించి తెలంగాణకు సంబంధించిన వర్చువల్‌ ‌రియాలిటీ ప్రెజెంటేషన్‌ ‌వీక్షించే అవకాశం కూడా ఇక్కడ ఉన్నది.

తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, పారిశ్రామిక విధానం, వార్షిక నివేదికల సమాచారం కూడా తెలంగాణ పెవిలియన్లో అందుబాటులో ఉన్నది. కేవలం పారిశ్రామిక, పెట్టుబడుల సమాచారమే కాకుండా హైదరాబాద్‌ ‌నగర చరిత్ర మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టూరిజం ప్రత్యేకతలను కూడా పెవిలియన్‌ ‌గోడలపైన అందుబాటులో ఉంచారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి కెటిఆర్‌ ‌తోపాటు పరిశ్రమలు మరియు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ ‌రంజన్‌, ‌టి హబ్‌ ‌సియివో రవి నారాయణ్‌, ‌డిజిటల్‌ ‌మీడియా డైరెక్టర్‌ ‌దిలీప్‌ ‌కొణతం మరియు పలువురు అధికారులు దావోస్‌లో పర్యటిస్తున్నారు.

Leave a Reply