Take a fresh look at your lifestyle.

అఖండ శక్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి

తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయంతో 2001 ఏప్రిల్‌ 27 ‌న నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ ‌రావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీని అంచెలంచెలుగా బలోపేతం చేస్తూ ఎన్ని అవరోధాలు, అపనమ్మకాలు వచ్చిన అధైర్య పడకుండా బలమైన నమ్మకం దృఢ సంకల్పంతో ఒక్కడిగా అడుగు ముందుకు వేసి నేడు తెలంగాణలో తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆవిర్భావిచింది. రాష్ట్రాన్ని సాధించిన కేసిఆర్‌ ‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అన్ని భావించి రెండు పర్యాయాలు సంపూర్ణ మెజారిటీతో తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. తెలంగాణ లో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక ప్రాంతీయ పార్టీగా టిఆర్‌ఎస్‌ ‌కు దాదాపు అరవై లక్షల పై చిలుకు ఉన్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఇరవై ఒకటి వసంతాలు పూర్తి చేసుకుని 22 వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది ఈ గత రెండు దశాబ్దాలుగా ఎన్నో విజయాలు సాధించి తెలంగాణ గడ్డపై చేరగని ముద్ర వేసుకుంది. దేశంలో జాతీయ పార్టీలను సైతం ఉక్కిరిబిక్కిరి చేసి అధికారం సాధించింది. దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు రావాలని మీడియా ముందు ప్రకటించి దేశ ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ యేతర పార్టీ నాయకులతో చర్చలు జరుపుతూ కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న నాయకుడు ముఖ్య మంత్రి కేసిఆర్‌ .. ‌తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతే దేశ రాజకీయాలలోకి వస్తుందని భావించి ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అయినా తాటాకు చప్పుళ్ళకు బయపడకుండా ముందుకు పోతున్న తరుణంలో దేశ నాయకులే కాదు ప్రపంచ దేశాల ముఖ్యులు తెలంగాణ వైపు చూస్తున్నారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వ నివేదికలే కాకుండా ఐక్యరాజ్యసమితి సైతం రైతు బంధు పథకాన్ని ప్రశంసించింది . టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అధ్యయనం చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వంతో సహా పథకాల పేర్లు మార్చి టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నాయి.

అన్ని వర్గాల, మతాల వారు కలిసి మెలసి సోదరభావంతో ఉన్న పార్టీ అదే కాకుండా తెలంగాణ ప్రజలందరు భిన్నత్వంలో – ఏకత్వంగా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడి నేడు తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పాటు పడుతుంది ప్రతి కార్యకర్త మాది టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అని గౌరవంగా చెప్పుకునే స్థాయికి చేరుకుంది. పార్టీ సూచనల మేరకు నిరంతరము ప్రజా సేవలో ఉండే నాయకులు, కొరోనా సమయంలో బయటకి వచ్చి ప్రజలకు చేరువ అయి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ కష్ట సమయంలో వారికి అండగా నిలిచి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారికి భరోసాను ఇచ్చారు. కొరోనా విపత్కర పరిస్థితులో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా సౌకర్యాలు కల్పిస్తూ, ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించి ప్రజా ప్రతి నిధులను అధికారులను అప్రమత్తం చేసి ప్రజల రక్షణకు కృషి చేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆవిర్భావం నుండి ఏ రాజకీయ ప్రయోజనం ఆశించకూడా తెలంగాణ ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా పని చేసింది, కాబట్టి టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఆదరణ తగ్గడం లేదు. తెలంగాణలో ఏ సభ సమావేశలు పెట్టిన అంచనాలు మించి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు అంటే పార్టీ అధినేత పైన అంత నమ్మకం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్‌ ‌తీసుకు వచ్చి మహిళ సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చెప్పాడుతూ, పరిపాలనలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించింది.

టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకుంటుంది. తెలంగాణలో సబ్బండ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణ రైతాంగం దేశానికి దిక్సూచిగా ఉండాలని వారి సంక్షేమాన్నికి రైతు బంధు, రైతు భీమా, ఉచిత 24 గంటల విద్యుత్‌, ‌పాలమూరు ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, రైతులు సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి రైతు వేదికలు మొదలయిన సంక్షేమ పథకాల ద్వారా రైతును రాజును చేయాలని దృడ సంకల్పంతో వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు. తెలంగాణ విద్యార్థి అమరుల ఆశయాలను ఆచరిస్తూ ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ ‌సిద్దాంతాలకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు. పార్టీ కోసం పని చేసినా సామాన్య కార్యకర్తలను సైతం గుర్తించి అవకాశాలు ఇచ్చింది.

టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులపై ప్రతి పక్ష పార్టీల వారు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తిగతంగా దూషించిన క్రమ శిక్షణ కల్గిన పార్టీ నాయకులుగా సమన్వయం పాటిస్తూ సమాధానము చెప్తున్నారు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నినాదం ఒకటే ‘‘తెలంగాణ అభివృద్ధి’’ తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైన అన్ని రంగాలలో ఇతర రాష్ట్రలతో పోటీ పడి ముందుకు పోతుంది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతనా ప్రపంచంలో ఉన్న ప్రముఖ కంపెనీలను తనకు అవగాహనతో వారికి తెలంగాణలో ఉన్న పరిస్థితులు వివరిస్తూ ఇక్కడ పరిశ్రమలకు కావలసిన వసతులు కల్పిస్తున్నారు కాబట్టి విదేశీ కంపెనీలు తరలి వస్తున్నాయి దీని ద్వారా స్థానిక యువత ఉపాధి పొందుతున్నారు. ఆనాడు ఆంధ్ర పాలనలో రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వెనుకబడిన తెలంగాణను ఈ ఎనిమిది ఏళ్ల కాలంలో అభివృద్ధిలో పురోగమనం సాధిస్తూ బంగారు తెలంగాణ వైపు కేసిఆర్‌ ‌సారథ్యంలో అడుగు ముందుకు వేస్తూ తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ‌జెండా ప్రతి గల్లీలో ఎగురుతుంది ఇదే ఒడుపు కొన్నాసాగే విధంగా ప్రతి కార్యకర్త పని చేయాలని భవిష్యత్తులో కూడా టిఆర్‌ఎస్‌ అధికారంలో ఉండాలని పార్టీ ముఖ్య నాయకులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
– మిద్దె సురేష్‌, ‌టిఆర్‌ఎస్వీ నాయకులు
9701209355

Leave a Reply