Take a fresh look at your lifestyle.

ప్రారంభం సరే.. ప్రతీ రోజు పాఠశాలల్లో పారిశుధ్యం మాటేమిటి.?

తెలంగాణ ప్రోగ్రెస్సివ్‌ ‌టీచర్స్ ‌ఫెడరేషన్‌
‌హైదరాబాద్‌,ఆగస్ట్ 31: ‌కోవిడ్‌ ‌కారణంగా దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ప్రతీ రోజు పాఠశాలల పారిశుధ్యానికి ప్రాధాన్యతనిచ్చి, విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సి ఉండగా పంచాయతీ రాజ్‌ ‌సిబ్బందికి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని మంగళ వారం విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ ప్రోగ్రెస్సివ్‌ ‌టీచర్స్ ‌ఫెడరేషన్‌ (‌టీపీటీఎఫ్‌) ‌పేర్కొంది.. ఇన్ని రోజులు నిరుపయోగంగా ఉన్న తరగతి గదులు, పాఠశాల ఆవరణలు శుభ్రం చేయడానికి పంచాయతీ రాజ్‌ ‌సిబ్బందితో సమన్వయానికి ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పాఠశాలల పునప్రారంభం ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రులు, కలెక్టర్లు వంటి మొత్తం యంత్రాంగం దృష్టి పెడితేనే పాఠశాలల సంసిద్ధత అంతంతమాత్రంగా ఉంటే ఇంకా ప్రతీ రోజు పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల చెత్త, మురికి పేరుకుపోయి విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి.

ఒక జిల్లాలో 850 కి పైగా పాఠశాలలు ఉంటే అందులో 159 పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లకు డోర్స్ ‌లేని సందర్భం ఉంది. భౌతిక వనరుల కల్పనలో ఇప్పటికి విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తుంది..కరోనాను నివారించేందుకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత అత్యంత కీలకమని ప్రచారం నిర్వహిస్తున్న ప్రభుత్వం తన అధీనంలోని పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది చిన్నారుల ఆరోగ్యాలను మాత్రం గాలికొదిలేయడం సరి కాదు. కోవిడ్‌ ‌నిబంధనల అమలులో ప్రజల పట్ల కఠినంగా ఉండే ప్రభుత్వం తాను మాత్రం అమలుచేయక పోవడం చిత్తశుద్ధి లేమికి నిదర్శనం. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బంది పాఠశాలలను శుభ్రం చేయడం ఆచరణలో సాధ్యం కాదని ఇప్పటికే తేలిపోయింది. కాబట్టి ప్రజారోగ్య రక్షణలో అత్యంత ముఖ్యమైన విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడానికి గతంలో లాగానే పాఠశాలలకు పారిశుద్ధ్య నిర్వహణ కొరకు సిబ్బందిని తక్షణమే నియమించి పాఠశాలల సక్రమ నిర్వహణకు తోడ్పడాలని టీపీటీఎఫ్‌ అధ్యక్షులు కె . రమణ, ప్రధాన కార్యదర్శి. మైస శ్రీనివాసులు డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply