Take a fresh look at your lifestyle.

అధికారిక కార్యక్రమాల్లో ఎన్నికల రాజకీయాలు

రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ లబ్ది కోసం పదేపదే విమర్శలు సంధించడం సరికాదు. అన్ని పార్టీలు ఈ మౌలికసూత్రం పాటించాలి. రాజకీయ నాయకుల పరస్పర విమర్శల కారణంగా ప్రజల సమస్యలకు ప్రాధాన్యం పెరగాలి. కానీ ఎన్నికలు వొస్తున్న వేళ చేసుకుంటున్న విమర్శలతో ప్రజలకు లాభం లేదు. హైదరాబాద్‌ ‌పర్యటనకు వొచ్చిన ప్రధాని మోదీ పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌వేదికగా కేసీఆర్‌ ‌సర్కార్‌పై మాటల తూటాలు పేల్చి సాధించేందే లేకుండా పోయింది. ప్రధాన సమస్యలను ఎక్కడా ప్రస్తావించలేదు. కేసీఆర్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా అవినీతి విమర్శలు చేయడం ద్వారా కేవలం రాజకీయ కోణం ఉంది తప్ప మరోటి లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి.. రాష్ట్రంలోని కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, ‌బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత బిజెపి చేస్తున్న విమర్శలకు ధీటుగానే బిఆర్‌ఎస్‌ ‌కూడా స్పందిస్తోంది. కెటిఆర్‌ ‌లేఖలతో కేంద్రాన్ని కడిగి  పారేస్తున్నారు. సమస్యలను నేరుగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా దిల్లీ  లిక్కర్‌ ‌స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కోవడం, ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరుకావడం ఇదంతా గల్లీ నుంచి దిల్లీ  వరకూ పెద్ద రచ్చే అయ్యింది. ఇక తెలంగాణలో జరిగిన టీఎస్‌పీఎస్సీ, టెన్త్ ‌పేపర్‌ ‌లీకేజీ వ్యవహారం.. దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. పేపర్‌ ‌లీకేజీలో మంత్రి కేటీఆర్‌కు సంబంధం ఉందని ఆరోపించిన వారందరికీ నోటీసులు ఇవ్వడం, ఆఖరికి పరువు నష్టం దావా వేయడం కూడా జరిగింది. మరో అడుగు ముందుకేసి టెన్త్ ‌పేపర్‌ ‌లీకేజీలో పాత్ర ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ ‌చేయడం రచ్చగా మారింది.

ఈటల  రాజేందర్‌కు కూడా నోటీసులు ఇచ్చారు. లీకేజీలపై కేసీఆర్‌ అస్సలు స్పందించనే లేదు. ఈ క్రమంలో ప్రధాని మోది• అవినీతిపరులు జైలుకేనంటూ  సంకేతాలు కూడా ఇచ్చేశారు. అవినీతిపరులను శిక్షించాలా.. వొద్దా..? రే చెప్పడం అంటూ ప్రజలను ప్రశ్నించారు. హైదరాబాద్‌ ‌సభలోచేసిన విమర్శలతో కమలం పార్టీలో ఉత్సాహం నింపినా..అంతే మొత్తంలో బిఆర్‌ఎస్‌, ఇతర లెఫ్ట్ ‌పార్టీ నేతల్లో ఆగ్రహం కూడా తెప్పించింది. బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్‌ ‌వొచ్చినట్లయ్యింది. కుటుంబ పాలన, తెలంగాణ ప్రభుత్వం అవినీతి పాలన ఆఖరికి దర్యాప్తు సంస్థల వరకూ అన్ని విషయాలను ప్రస్తావిస్తూ మోదీ మాట్లాడారు. ప్రధాని మోది• హైదరాబాద్‌ ‌పర్యటనలో కేసీఆర్‌ ‌స్వాగతించేందుకు కానీ..సభలో పాల్గొనేందుకు కానీ రాలేదు. దీనిపై ప్రజల్లో కెసిఆర్‌ ‌తీరును స్పష్టం చేయాలని  బీజేపీ యత్నించింది. పరేడ్‌  ‌గ్రౌండ్‌లో జరిగిన సభలో మోదీ సీటు పక్కనే కేసీఆర్‌ ‌కోసం ప్రత్యేకంగా కుర్చీ వేయడం ఇవన్నీ జనాల్లోకి తీసుకెళ్లి కేంద్రం అంటే పడకపోవచ్చు కానీ కనీసం అభివృద్ధి పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదనే భావన ప్రజల్లో కలిగించడం కోసం విశ్వప్రయత్నాలన్నీ చేసింది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌ప్రారంభ కార్యక్రమం అధికార కార్యక్రమమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ దాడికి దిగిన మోదీ దాదాపు ఎన్నికల ప్రచార సభలా మార్చేశారు. రాష్టాభ్రివృద్ధికి, దేశాభివృద్ధికి గొప్ప కృషి జరుగుతున్నట్టు చిత్రించుకున్నారు. తర్వాత స్వయంగా తన ప్రసంగంలోనూ అదే పాట పాడారు. దేశంలో ప్రాథమిక సదుపాయాల మెరుగుదల కోసం, రవాణా విస్తరణ కోసం కేంద్రం పరితపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని తిట్టిపోశారు. తాను అవినీతిపై పోరాడుతుంటే కుటుంబ పాలన చేసేవారు అడ్డు తగులుతున్నారని ఆరోపణలు గుప్పించారు. పరోక్షంగా  బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై, కెసిఆర్‌ ‌కుటుంబంపై కసితీరా దాడి చేశారు.రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలసి రావడం లేదని అభాండం వేశారు. తెలంగాణలో,ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న రాజకీయ పరిస్థితులు ఉన్నాయి.అక్కడ జగన్‌ ‌కేంద్రానికి అనుకూలంగా ఉన్నట్లు నటిస్తున్నా..అక్కడా పెద్దగా పనులు కావడం లేదు.

        అయితే రెండు రాష్టాల్ల్రో అధికారం అంటూ..బిజెపి మాత్రం ఏకైక లక్ష్యంతో పావులు కదుపుతున్నది. ఇక్కడి ప్రాంతీయ పార్టీల ప్రాభవాన్ని దెబ్బ తీసి తను పాదం మోపడం కోసం ఎత్తులు వేస్తోంది. తామే అధికారంలోకి వొస్తామని చెబుతున్న కాంగ్రెస్‌ ‌విచిత్రంగా బిఆర్‌ఎస్‌, ‌బిజెపి ఒకటేనని ఆరోపిస్తున్నది. ఇదంతా తమ రాజకీయ ఎత్తుగడలో భాగంగా భావించాల్సిందే.  కొంతమంది కాంగ్రెస్‌ ‌సీనియర్లు బిజెపిని ప్రధాన ప్రత్యర్థిగా చెబుతూ బిఆర్‌ఎస్‌తో అవగాహన సాధ్యమేనన్నట్టు మాట్లాడుతుంటారు. తాజాగా కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జానారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అలాగే కాంగ్రెస్‌ ‌సహా అన్ని పక్షాలు సహకరించినట్లు అయితే …ప్రధాన ప్రచార కన్వీనర్‌గా ఖర్చులను తానే భరిస్తానని చెప్పడం ద్వారా కెసిఆర్‌ ‌తన మనోగతం వెల్లడించినట్లుగా ప్రముఖ జర్నలిస్ట్ ‌రాజ్‌దీప్‌  ‌సర్దేశాయి చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. జాతీయ స్థాయిలో ఈ మధ్య చాలా సందర్భాలలో ప్రతిపక్ష కార్యాచరణలో ఈ రెండు పార్టీలూ కలసి పనిచేస్తున్నా యి. ఎ.పి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి మోదీ• సర్కారుతో సత్సంబంధాలు నెరుపుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా బిజెపితో సత్సంబంధాలు ఉన్నట్టు  చూపించుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో సన్నిహితంగా మెలుగుతున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ ‌కళ్యాణ్‌ అం‌తకు ముందు నుంచి బిజెపితో మిత్రత్వం కొనసాగిస్తు న్నారు. టిడిపి, జనసేన కూడా బిజెపితో సఖ్యత కోసం యత్నిస్తూ…రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడి పోరాటం చేస్తున్నాయి. అయితే రాజకీయ పార్టీలు రేపటి ఎన్నికల్లో లాభం పొందేందుకు, అధికారంలోకి రావడమెలా అన్న కోణంలోనే తమవంతు రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజల సమస్యలపై ఏ ఒక్క పార్టీకి కూడా చిత్తశుద్ది లేదని గుర్తించాలి.
– ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply