Take a fresh look at your lifestyle.

సాగర్‌ ‌వెనుకబండిందన్న మాట నిజమే: సీఎం కేసీఆర్‌

  • ఇక అభివృద్ధి రుచి చూపిస్తా.. ఇన్నాళ్ల వెనకబాటును పారదోలుతా
  • రాష్ట్ట్రంపై కేంద్రం నిర్లక్ష్య వైఖరి.. ఆంధ్రా దాదాగిరీ
  • ఆయకట్టు స్థిరీకరణకు గోదావరి జలాలు రప్పించేయత్నం
  • నియోజకవర్గానికి రూ. 150 కోట్లు
  • ప్రైమరీ హెల్త్ ‌సెంటర్ల అప్‌‌గ్రేడ్‌
  • ‌హాలియా సభలో సీఎం కేసీఆర్‌ ‌వరల జల్లు

అభివృద్ధి అంటే ఏమిటో నాగార్జున సాగర్‌కు రుచి చూపిస్తానని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఇక్కడి పరిస్థితులు చూశాక ఇన్నాళ్లు ఇది వెనకబడిందన్న మాట నిజమేనన్నారు. ఇక్కడికి పాలేరు వి•దుగా గోదావరి జలాలను రప్పించేయత్నం చేస్తామన్నారు. కృష్ణా జలాల వివాదంపై నాగార్జున సాగర్‌ ‌నియోజక వర్గం హాలియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ..కేంద్రం, ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరి కావొచ్చు…. ఆంధ్రా వాళ్లు చేస్తున్న దాదాగిరీ కావొచ్చు… కృష్ణా నదిపై ఏ విధంగా అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. కృష్ణా నీళ్లలో రాబోయే రోజుల్లో మనకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద దేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్‌ ‌నుంచి గోదావరి నీళ్లను తెచ్చి అనుసంధానం చేయాలనే సర్వే జరుగుతుంది. అది పూర్తయితే నాగార్జున సాగర్‌ ఆయకట్టు చాలా సేఫ్‌ అయ్యే అవకాశం ఉంటుందన్నారు.

పెద్దదేవులపల్లి – పాలేరు రిజర్వాయర్‌ అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వరాల జల్లు కురిపించారు. సాగర్‌ ఉప ఎన్నికలో ఇచ్చిన హావి•లను తప్పకుండా నెరవేర్చుతానని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. సాగర్‌ ‌నియోజకవర్గ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నాగార్జున సాగర్‌ ‌నియోజకవర్గ అభివృద్ధిపై హాలియా మార్కెట్‌యార్డులో సీఎం సవి•క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ.. సాగర్‌ ఉప ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్నిచ్చి ముందుకు నడిపించినందుకు ప్రజలం దరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొరోనా మహమ్మారి కారణంగా సాగర్‌కు రావడం ఆలస్యమైందన్నారు. తనను కూడా కొరోనా విడిచిపెట్టలేదని, ఎన్నికలు అయిపోయిన వెంటనే తాను అక్కడకు రాలేక పోయానని అన్నారు. సమస్యలు చాలా పెండింగ్‌లో ఉన్నాయని సీఎం తెలిపారు.

నోముల భగత్‌ అనేక సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, ఎన్నికల సందర్భంలో ఆయా నియోజకవర్గాల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వొచ్చి పని చేశారని, నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆ ఎమ్మెల్యేలు రిపోర్టు ఇచ్చారని, గ్రామాల్లో పొలాలకు వెళ్లేందుకు కూడా కల్వర్టులు సరిగా లేవని చెప్పారు. హాస్పిటళ్ల పరిస్థితి కూడా బాగాలేదని చెప్పారు. హాలియా పట్టణాన్ని చూస్తేనే తమ సమస్య అర్థమవుతుందని చెప్పారు. హాలియాను అద్భుతంగా చేయా ఇక్కడ రోడ్లు సరిగా లేవు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. వాటన్నింటిని క్రమక్రమంగా పూర్తి చేసుకుందాం అని కేసీఆర్‌ అన్నారు. నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్‌తో పాటు ఇరిగేషన్‌ ‌భూముల్లో ఉన్నవారిని క్రమబద్దీకరిస్తామన్నారు. చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఆ ఇండ్లను రెగ్యులరైజ్‌ ‌చేయాలని కోరుతూ, హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదేశిస్తున్నాం. ఈ పని నెల రోజుల్లో పూర్తవుతుందన్నారు. నందికొండ, హాలియా మున్సిపాలిటీకి నిధులు కావాలని అడిగారు.

హాలియాకు రూ. 15 కోట్లు, నందికొండ మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఈ మున్సిపాలిటీల అభివృద్ధికి మున్సిపల్‌ అధికారులతో సవి•క్ష నిర్వహించి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలన్నారు. ఇక సాగర్‌ ‌నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం. సిబ్బంది, భవనం ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మిని స్టేడియం కూడా మంజూరు చేస్తాం. ఆర్‌ అం‌డ్‌ ‌బీ రోడ్లు, పంచాయతీరాజ్‌ ‌రోడ్లు, కల్వర్టల నిర్మాణానికి రూ. 120 కోట్లను మంజూరు చేస్తున్నాను. మొత్తంగా రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నాను అని తెలిపారు. రెడ్డి కల్యాణ మండపం కోసం గతంలో గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో కొన్ని ఫండ్స్ ‌మంజూరు చేశారు. ఆ కల్యాణ మండపానికి స్థలం కేటాయిస్తామని, షాదీఖానా కోసం కూడా స్థలం కేటాయిస్తాం అని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. గుర్రం పోడు ప్రాంతంలో ఒక లిప్ట్ ‌పెట్టినట్లు అయితే ఐదారు గ్రామాలకు కలిపి 10 వేల ఎకరాలకు నీరు వొస్తుందని చెప్పారు. త్వరలోనే గుర్రంపోడు లిప్ట్ ‌సర్వే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇస్తాం. దీన్ని కూడా నెల్లికల్‌ ‌లిప్ట్‌తో పాటు మంజూరు చేస్తామన్నారు.

దేవరకొండలో ఐదు లిప్ట్‌లు మంజూరు చేశాం, మిర్యాలగూడలో ఐదు లిప్ట్‌లు, నకిరేకల్‌లో అయిటిపాముల వద్ద ఒక లిప్ట్‌తో పాటు ఈ జిల్లాకు మొత్తం 15 లిప్ట్‌లు మంజూరు చేయడం జరిగింది. లిప్ట్‌లన్నింటినీ రాబోయే ఒకటిన్నర సంవత్సరాల్లో పూర్తి చేసి జిల్లా ప్రజలకు అందిస్తామన్నారు. రాష్ట్రంలో హాస్పిటల్స్ ఆశించిన స్థాయిలో లేవని సీఎం తెలిపారు. ఆరోగ్య శాఖ పనితీరును మెరుగు పర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోని అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉన్న 18 వేల బెడ్స్‌ను ఆక్సిజన్‌ ‌సరఫరా చేసుకునే బెడ్స్‌గా మార్చుకున్నామని, ఏడు కొత్త మెడికల్‌ ‌కాలేజీలను మంజూరు చేసుకున్నామని, రాబోయే రోజుల్లో 33 జిల్లా కేంద్రాల్లో మెడికల్‌ ‌కాలేజీలతో పాటు ప్రతి కాలేజీలో 500 బెడ్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. హైదరాబాద్‌లో నాలుగు సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మిస్తున్నామని, సూర్యాపేట, నల్లగొండలో మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు చేసుకున్నామని, సాగర్‌లో ఉన్న ప్రైమరీ హెల్త్ ‌సెంటర్లను అప్‌‌గ్రేడ్‌ ‌చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల భగత్‌ ‌స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Leave a Reply