Take a fresh look at your lifestyle.

ఇదీ! రాజకీయం!!

ఏడేండ్ల రాజకీయం
చూడు అమానవీయం

ద్రోహులు ఏలికలాయే
ఉద్యమం నివ్వెరపోయే

పవర్‌ ‌పార్టీ పాచికలు
విపక్షనేతల్లో చీలికలు

ప్రశ్నగొంతు నొక్కిండ్లు
ఇందిరాపార్కు మూసిండ్లు

కుదేలైన వామపక్షం
వాళ్ళ స్థానం హీనపక్షం

కుటంంబానిదే పెత్తనం
ఏకస్వామ్య విత్తనం

పాలన బిగి పిడికిట్లో
తెరపడునా ఇప్పట్లో

ఇది ఉన్నది ఉన్నట్టు!!
లేదు లేదు కనికట్టు!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply