Take a fresh look at your lifestyle.

కొడిగట్టిందా…!?

చూడు సర్వేల జోరు
మూడో ప్లేస్‌ ‌కు కారు
కమలం,హస్తం మధ్య పోరు
ఇదీ ఇప్పటి రాజకీయ తీరు

ఇట్లెట్ల పరిస్థితి మారే
గులాబీ ఏల దిగజారే
సర్కారు ప్రతిష్ట మసకబారే
బలుపు వాపుగా మారే

అలవిగాని పథకాలు
అలవోకగా వాగ్ధానాలు
కుటుంబ పాలనపై మక్కువ
‘ద్రోహుల’ పై ప్రేమ ఎక్కువ

‘ఉద్యమ’ దివిటీ కొడిగట్టి పోయిందా!?
గులాబీకి రాష్ట్రం పట్టుసడలుతుందా!?
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply