Take a fresh look at your lifestyle.

‘‌దరఖాస్తు’ రాజకీయాలు

అధికార టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల మధ్య ఇంతవరకు మాటల యుద్ధం కొనసాగుతుండగా తాజాగా దరఖాస్తుల అంశం ఈ రెండు పార్టీల మధ్య దరఖాస్తుల యుద్ధానికి తెరదీసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవానికి ముందు, అవిర్భవించిన తర్వాత అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్రసమితి ప్రజలకు అనేక వాగ్ధానాలు చేసింది..ఇంకా చేస్తూనేఉంది. అయితే ఈ వాగ్ధానాలేవీ చెప్పినంత సులభంగా అమలు కావడం లేదు. అలా అని ప్రతిపక్షాలు నిత్యం ఏకరువు పెడుతూనే ఉన్నాయి. అ•దుకు తెరాస నేతలు చెబుతున్న లెక్కలు అసత్యాలంటూ ఎలుగెత్తి చాటుతున్న విపక్షాలు  రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.  అందులో బిజెపి ఒక అడుగు ముందే ఉంటున్నది. ఇప్పుడీ పార్టీ ఒక వినూత్న ఆలోచన చేసింది. ఈ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే కాకుండా వాస్తవ పరిస్థితి ఏమిటన్నది ప్రజలకు కూడా అర్థమవుతుందన్నది ఆ పార్టీ ఆలోచన.  అదే దరఖాస్తుల ఉద్యమం. కొత్తగా రాష్ట్రం ఏర్పడడానికి ముందు దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పినదగ్గరి నుండి, అధికారం చేపట్టిన తర్వాత దళితులకు మూడు ఎకరాల భూమి, విద్యావంతులైన యువకులకు నిరుద్యోగ భృతి, డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు, దాదాపుగా అన్ని కులసంఘాలకు భవనాలు లాంటి తదితర పథకాలతో పాటుగా ముఖ్యమంత్రి కొత్తగా శ్రీకారం చుట్టిన  దళిత బంధు పథకాల వరకు అర్హులైన వారంతా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథాకాలకు అర్హులైనవారంతా ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్లకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఆయన పిలుపునివ్వడంతోపాటు తాజాగా కరీంనగర్‌లో ఈ ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు కూడా. అయితే తాము కాని కోరికలేవీ కోరడంలేదు. ప్రభుత్వం శక్తికి మించినవేవీ తాము కొత్తగా డిమాండ్‌ ‌చేయడంలేదు. ఈ ప్రభుత్వం ప్రకటించిన వాటినే అమలు చేయాలన్నది మా డిమాండ్‌. ఆ ‌పథకాలకు అర్హులైనవారికి సత్వరం వాటిని వర్తింపజేయాలని ప్రభుత్వానికి గుర్తుచేయడమే ఈ దరఖాస్తుల ఉద్యమంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ‌చెబుతున్నాడు. ఒక విధంగా ప్రభుత్వ పరిపాలనకు సహకరించే ఉద్యమమే ఇది.

ఎందుకంటే ప్రభుత్వం తామిచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ఆర్హులైన ప్రజలందరి దగ్గరికి ప్రభుత్వం వెళ్ళలేకపోతున్నది. దీనివల్ల ప్రజలు తమ వద్దకు వొచ్చి మొరపెట్టుకుంటున్న నేపథ్యంలో వారినుండి దరఖాస్తులు స్వీకరించి, ప్రభుత్వానికి అందజేసే విషయంలో తమ పార్టీ కార్యకర్తలు సహకారం అందించనున్నారని, అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ఈ దరఖాస్తులను స్వీకరిస్తుందా లేదా అన్నది ప్రభుత్వానికే వొదిలేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇది ఒక విధంగా దీంతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజుకున్నట్లైంది.  దీనిపైన టిఆర్‌ఎస్‌ ‌బాగానే రియాక్ట్ అయింది. బిజెపి దరఖాస్తు ఉద్యమంపైన సెటేర్లు వేసింది. ఐటి శాఖ మంత్రి, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారకరామారావు దీనిపై స్పందిస్తూ, ప్రధాన నరేంద్ర మోడీ దేశంలోని ప్రతీ పౌరిడి జన్‌ ‌ధన్‌ ‌ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని  ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసే విధంగా ఈ దరఖాస్తులు ఉండాలని ఆయన తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రధాని ప్రకటన మేరకు అర్హులైన వారంతా బిజెపికి దరఖాస్తు చేసుకుంటే పదిహేను లక్షల రూపాయలు వొస్తాయంటూ బిజెపి దరఖాస్తు ఉద్యమంపై ఆయన సటైర్‌ ‌వేశారు. అంతకు ముందు మంత్రి హరిష్‌రావు కూడా సంజయ్‌ ‌మాటలకు కౌంటర్‌ ఇస్తూ దళిత బంధు పథకం కింద ప్రతీ కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలని బిజెపి డిమాండ్‌ ‌చేస్తున్నది. దాన్ని మేము కాదనటంలేదు. మా ప్రభుత్వం పది లక్షలు ఇస్తుంది కదా, మీరు కేంద్రం నుండి మరో నలభై లక్షలు తెప్పించి ఇవ్వండి, మేము కూడా నరేంద్రమోదీకి అభినందనలు తెలపుతం, పాలాభిషేకం చేస్తామంటూ ఆయన స్థానిక బిజెపి నేతలకు చురకలంటించారు.

ప్రజలు కూడా మిమ్ములనే మెచ్చుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కన్న కేంద్ర ప్రభుత్వమే సరైన న్యాయం చేసిందని దళితులంతా సంతోషిస్తారంటూ ఆయన బిజెపి విమర్శలకు కౌంటరిచ్చారు. 24 గంటల కరెంట్‌, ‌రైతు బంధు, ఇంటింటికి మిషన్‌ ‌భగీరథతో స్వచ్ఛమైన నీరు ఇస్తున్నం. ఊరూరికి ట్రాక్టర్‌, ‌డంప్‌యార్డు, స్మశాన వాటికల ఏర్పాటు లాంటివి అన్నవి అన్నట్లు ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వొస్తున్నం. ఇచ్చినవేవీ ఈ పార్టీలకు కనిపించడం లేదా..కాస్తా వెనుకముందు పనులు జరుగుతాయి. అంతమాత్రాన పథకాలు అమలు కాలేదని దరఖాస్తుల ఉద్యమం చేపట్టాలనుకోవడం ఒక కుట్ర మాత్రమేనని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు విమర్శిస్తుండడంతో దరఖాస్తుల చుట్టూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

Leave a Reply