టెక్నాలజీ ఉపయోగించడంలో ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ : హోం మంత్రి మహమూద్ అలీ
- శాంతి భద్రతల అదుపుతోనే పెట్టుబడులొస్తున్నాయి : మంత్రి హరీష్‌రావు
- రాష్ట్రానికి రోల్ మోడల్‌గా మర్కూక్ పోలీస్ స్టేషన్ : డిజిపి
టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉదనీ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం సిద్ధిపేటలోని మర్కూక్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను మంత్రులు మహమూద్ అలీ, తన్నీరు హరీష్‌రావు, డిజిపి మహేందర్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడుతూ…దేశంలోనే మెరుగైన శాంతి భద్రతలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిలిపారనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్పోలీస్ శాఖకు అధునాతనమైన వాహనాలు సమకూర్చి ప్రజలకు సత్వర సేవలు అందించడానికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు సత్వర సేవలు అందించడంతో పాటు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడం టెక్నాలజీతో ఉత్తమ సేవలు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో గత 6 సంవత్సరాల నుండి నూతన పోలీస్ పోలీస్ స్టేషన్లు, కమిషనర్ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాలు నిర్మించడం జరుగుతుందన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… గడిచిన ఆరేండ్లలో హైదరాబాద్‌లో కర్ఫ్యూ లేదు, మత ఘర్షణలు లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మొట్టమొదటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుశాఖకు నిధులు కేటాయించి అత్యాధునిక వాహనాలు సమకూర్చడం ద్వారా పోలీసులు ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు, రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఒకే విధంగా చూసి సేవలు అందించడం జరుగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు కష్టపడి పని చేస్తున్నారనీ, శాంతిభద్రతల సమస్యలు లేనప్పుడే పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టడం ద్వారా నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. డిజిపి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మర్కూక్ పోలీస్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో అత్యాధునిక టెక్నాలజీతో మర్కూక్ మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు సమకూర్చునందున్న పోలీస్ స్టేషన్ త్వరగా నిర్మించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా సేవలు అందించడం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండడం మన పోలీసు వ్యవస్థ ప్రత్యేకత అన్నారు.