Take a fresh look at your lifestyle.

పి.వి గారు నిన్ను .. మరువదు ఈ తెలంగాణ గడ్డ

పి.వి తెలుగువాడు అంతకంటే ముందు తెలంగాణ ముద్దుబిడ్డ గొప్ప సాహితీవేత్త 18 భాషల్లో అనర్గలంగా మాట్లాడే గొప్ప వక్త ప్రపంచ భాషలపై పట్టున్న మహానుభావుడు గొప్ప జర్నలిస్ట్ ‌మంచి రచయిత గొప్ప కవి,గొప్ప రాజకీయవేత్త, పరిపాలనదక్షుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి,బహుభాషా కోవిదుడు పి.వి నర్సింహరావుకు ఏనాడో భారతరత్న రావాల్సి ఉంది.ఆయన భారతరత్న పదవికి అన్ని రకాల అర్హుడే .రాజకీయ కోణంతో పి.వికి అన్యాయం చేశారు.కాని తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత టి.ఆర్‌.ఎస్‌ ‌ప్రభుత్వం పి.వి నర్సింహరావు గొప్పతనాన్ని గుర్తించి ఆయన పేరు ప్రపంచంలో మారు మోగే టట్టు ప్రణాళిక రచించడం పంజాబ్‌లో తీవ్రవాదుల్ని తరిమి కొట్టిన ఘనత ఆయనదే.1988లో వాజ్‌పేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పి.వి ప్రభుత్వం.ప్రదాన మంత్రుల్లో నెహ్రు గాంధీ కుటుంబాల బయటి కుటుంబాల తర్వాత బయటి వక్త్రి పి.వి నర్సింహారావే.నిర్వహించి భారతదేశంలో ఉత్తమ ప్రధానుల్లో పి.వి నర్సింహారావు ముందు వరుసలో ఉంటారు.ఆయన ఏది చేసిన ప్రజల కోసమే ఉంటుంది.ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగాను ,మంత్రి గాను కేంద్రమంత్రిగాను,భారత భారతప్రధాన మంత్రిగా పి.వి నిర్వహించిన పాత్ర మరువలేనిది.పి.వి శతజయంతి ఉత్సవాల సందర్బంగా తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు గారు పి.వి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించడం హర్శనీయం.అంతే కాకుండా ప్రపంచంలోని 50 దేశాల్లో పి.వి శతజయంతి వేడుకలను నిర్వహిస్తామనడం హర్శనీయం.పి.వి గారి జయంతి సందర్బంగా 10 కోట్ల రూపాయల బడ్జెట్‌ను విడుదల చేయడమే కాకుండా ఆయనతో ఉన్న అనుబందం గురించి ప్రత్యేక సావనీర్లను విడుదల చేయడం చరిత్రాత్మక నిర్ణయం.కవి,రచయిత,మహావక్త అయి కే.సీ.ఆర్‌ ఇం‌త మంచి నిర్ణయం తీసుకోవటం పట్ల హర్శం వ్యక్తంచేస్తున్నారు.పి.వి తెలంగాణ ఠీవి అనే పేరిట ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వపడేలా తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందించడం.12 నెలల పాటు పి.వి నర్సింహారావు కీర్తి దశదిశల మారుమోగే విదంగా ప్రత్యేక సంచికలు వెలువరించడం పి.వి గారికి అర్పించే నిజమైన నివాళి కాగలదు.పి.వి శత జయంతి కమిటి చైర్మన్‌ ‌కేశవరావు గారు కృషి అభినందనీయం.

దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొన్నప్పుడు ఆయన ప్రధానిగా భాద్యతలు చేపట్టి భేష్‌ అనిపించుకున్నారు.మైనారిటీ ప్రభుత్వాన్ని మెజారిటీ ప్రభుత్వంగా తీర్చిదిద్దిన ఘనుడు అతడు.దూరదృష్ఠి,వాక్చాతుర్యం,సంగీతం,పఠనం ,రచన,సినుమాలు,నాటకాలు ఆయన అభిరుచులు.ఆర్ధిక సంస్కరణలు చేపట్టి విజయం సాధించి చరిత్రకు ఎక్కిన మహనీయుడు.తెలంగాణ రాష్ట్రం నుండి భారత ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన తెలంగాణ ముద్దుబిడ్డ.ఆయన ఎవరో కాదు పాములపర్తి వెంకట నర్సింహారావు.18భాషల్లో అనర్గలంగా సంభాషణ చేసే బహుబాషాకోవిదుడు.నైజాం పాలనలో విసిగి వేసారి పోరాటాలు చేస్తున్న రోజుల్లో పూర్వపు కరీంనగర్‌ ‌జిల్లా బీమదేవరపల్లి మండలం వంగరలో పాములపర్తి రుక్కబాయమ్మ సీతారామరావు అనే పుణ్య దంపతులకు 2వ సంతానంగా పూర్వ వరంగల్‌ ‌జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లిలో అమ్మమ్మ ఇంటిలో 28 జూన్‌ 1921‌లో పి.వి నర్సింహారావు జన్మించారు.ఇంతింతై-వటుడుఇంతై-అన్నట్లు తెలంగాణ నుంచి తెలంగాణ బిడ్డగా పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత శిఖరాలను అదిరోహించి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించారు.ఆయన బాల్యంలో ఆవుల కొట్టంలో లేగ దూడలతొ ఆటలు ఆడి,పాటలు పాడి కల్చర్‌ను నేర్చుకున్నారు.4 సంవత్సరాల పిన్న వయసులోనే భారత ,బాగవత రామాయణాల్లోని శతకాలను.శ్లోకాలను,పద్యాలను ఒకసారి చదివి అప్పజెప్పే ఏక సంతాగ్రహి ఆయన.వంగర వేలేరు గ్రామాల్లో 2వ తరగతి హుజురాబాద్‌ ‌జెడ్‌.‌పి హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదివి ఉన్నత విద్య కోసం ఓరుగల్లు నగరానికి వెళ్లినారు.కన్నతండ్రి సీతారామరావు అన్నగారైన రంగారావు రత్నాబాయమ్మలకు పిల్లలు లేనందున వారు పి.వీని దత్త పుత్రునిగా చేసుకొని అల్లారు ముద్దుగా పెంచినారు.పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.అన్నట్టు పి.వి చదువుకునే రోజుల్లో అన్నింటిలోను ఆయనే ముందుండేవాడు.పి.విది బాల్యవివాహాం.10 సం।।రాల పిన్నవయసులోనే కుటుంబ పెద్దలు ఆయనకు పెళ్లి చేయాలని నిర్ణయించినారు.దగ్గరి బందువుల కుమార్తె సత్యమ్మతో పి.వి కళ్యాణం అపర అయోద్య కరీంనగర్‌జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్ధానంలో 1931లో జరగడం ఒక చరిత్రాత్మకం. పి.వి అత్తగారిల్లు ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామం కావడంతో ఇరువర్గాల పెద్దలు ఇల్లందకుంట దేవస్ధానంలో కనుల పండుగగా వివాహాన్ని జరిపించారు.1937లో హయ్యర్‌ ‌సెకండరీ పరీక్షల్లో హైదరాబాదు సంస్ధానంలో నంబర్‌వన్‌గా తన సత్తాను హైదరాబాద్‌ ‌రాష్ట్రంలో నిరూపించుకున్నాడు.

నైజాం ప్రభుత్వం వందేమాతర గీతం ఆలపించడాన్ని నిషేదించినప్పటికి బానిసత్వపు గొలుసులు తెంచడానికి వందేమారత గీతాన్నిబ పాడి ఉస్మానియావిశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైనారు. అయినప్పటికి ఆయన ధైర్యంగా ఉండి పోరాట మార్గాన్ని కొనసాగించారు.1937లో హయ్యర్‌ ‌సెకండరీ పరీక్షల్లో హైదరాబాదు సంస్ధానంలో నంబర్‌వన్‌గా తన సత్తాను హైదరాబాద్‌ ‌రాష్ట్రంలో నిరూపించుకున్నాడు.నైజాం ప్రభుత్వం వందేమాతర గీతం ఆలపించడాన్ని నిషేదిమచినప్పటికి బానిసత్వపు గొలుసులుతెంచడానికి వందేమారత గీతాన్నిపాడి ఉస్మానియావిశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైనారు.అయినప్పటికిఆయన ధైర్యంగా ఉండి పోరాట మార్గాన్ని కొనసాగించారు.అదృష్టవశాత్తు బహిష్కరణ వాదులందరికి మహారాష్ట్ర,నాగపూర్‌ ‌విశ్వవిద్యాలయం మళ్లీ చదువుకునే అవకాశం కల్పించారు.మహారాష్ట్రలో చదువుకునే సమయంలో దేశభక్తులు,స్వతంత్ర సమరయోధులు,పి.సీ జోషి,బాలగంగాదర్‌ ‌తిలక్‌,‌గోపాలక్రిష్ణ,సావర్కర్‌ ‌మొదలైన వారి పుస్తకాలను చదివినారు.అప్పటి బ్రిటీష్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపినాడు.మహారాష్ట్ర నాగపూర్‌ ‌విశ్వవిద్యాలయంలో డిగ్రీలో గోల్డ్‌మెడల్‌ ‌సాధించడే కాదు,పూణలో న్యాయశాస్త్ర విద్యలో కూడా మెరో గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించి పుస్తకాల పురుగు అనే పేరును పొందారు.అందరి ప్రశంసలు పొందారు.స్వామిరామానంద తీర్ధ ఉపన్యాసాలకు ఆకర్శితుడై ఆయన శిష్యరికాన్ని స్వీకరించాడు.నైజాంరాజు ఆదేశాలను ఉల్లంఘించి ఎన్నో సార్లు జైలు శిక్షను అనిభవించారు.షేక్‌స్పియర్‌ ‌డ్రామాలను, తెలుగులోకి కధాసంగ్రహాలుగా రాసినారు. విశ్వనాధ రాసిన రామాయణ కల్ప వృక్షాన్ని పి.వి వేయిపడగలు పేరుతో హిందీలోకి అనువాదం చేశారు.ఇంగ్లీషులో వెలువడిన ది ఇన్‌సైడర్‌ అనే పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది.దేశంలోనే పుస్తక ప్రపంచంలో సంచలనం సృష్టించింది.ఒక పక్క ఉత్తమ రచనలు చేస్తూనే భారతీయ తత్వశాస్త్రం,రాజకీయ వ్యాఖ్యానం భిన్న బాషలు అభ్యసించడం పి.వికి ప్రత్యేక అభిరుచి.1956లో ఆంద్రప్రదేశ్‌ ‌పి.సి.సి ఉపాద్యక్షుడిగా ఉన్నారు.1962లో జరిగిన చైనా యుద్దం భాదితుల కోసం రక్షణ శాఖ నిధికి అత్యదిక విరాళాలు సేకరించారు.1956లో భాషా ప్రయుక్త ఏర్పాటులో భాగంగా తెలంగాణ,అంన్రు కలిపి ఆంద్రప్రదేశ్‌ ‌రాష్ట్రం ఏర్పడింది.పి.వి నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌లురాజకీయ చాతుర్యం, ఆర్ధిక పరిజ్ఞానంతో భారతదేశాన్ని ఆర్ధిక రంగంలో అత్యుత్తమ స్ధాయికి తీసుకొని వచ్చాడు. జవహార్‌లాల్‌ ‌నెహ్రు, ఇందిరాగాందీ, రాజీవ్‌ ‌గాందీ,అంబేద్కర్‌, ‌మోరార్జ్జీదేశాయ్‌, ‌శాస్త్రీజి వంటి వారికి భారతరత్న ఇచ్చారు గాని సంస్కరణల రూపశిల్పి పి.వికి భాతరరత్న, అవార్డు ఎంతైనా ఉందితెలుగు ,ఇంగ్లీష్‌, ఉర్దూ, ఫ్రెంచి, స్పానిష్‌, అరబిక్‌, ‌పార్సీ, సంస్కృతం. కన్నడం,మరాటీ బాషల్లో ఆయనదిట్ట.

1977లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిధ్యాలయం వారు గౌరవ డాక్టరేటును ప్రధానం చేశారు.2004లోస్మితప్రజ్ఞ బిరుదును పొందారు.పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ లేకున్న మొట్టమొదటి సారిగా ప్రదానమంత్రి పీఠాన్ని అదిరోహించి 5 సం।।రాలు(ఫుల్‌టైం) దిగ్విజయంగా పదవిలో కొనసాగిన ఘనత ఆయనదే.లిబరలైజేషన్‌, ‌ప్రవేటైజేషన్‌, ‌గ్లోబలైజేషన్‌ ‌వల్ల భారత ఆర్ధిక వ్యవస్ధ త్వరితంగా అభివృద్ది సాదించింది. ఆయనకు సంస్కరణల శిల్పి అనే బిరుదు వచ్చింది.పంచాయితీ రాజ్‌ ‌చట్టం నుంచి ప్రపంచ వ్యాప్త విషయాలెన్నో అవగాహాన కలిగిన వ్యక్తి ఆయన.73,74 రాజ్యాంగ సవరణలు చేసి 50% రిజర్వేషన్లను ఎస్‌.‌సి,ఎస్‌.‌టి, బి.సి వర్గాలకు అందించి ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు అందించారు.ఆర్దికసంస్కరణలైన విదేశి వ్యవహారాలైన,అణుపరీక్షలైన జంకుబొంకు లేకుండా దూరదృష్టితో విజయవంతంచెసిన ఘనత ఆయనకే దక్కుతుంది.2004 డిసంబర్‌ 23‌న ఉదయం 11.00 గంటలకు ఆయనతుదిశ్వాస విడిచారు.విది లేని పరిస్ధితిలో ఆర్ధిక రంగంలో సంస్కరణలు చేపట్టి విజయవంతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.అపారమైన పాలన అనుభవమున్న ఆయనకు ఏ పార్టీలో మిత్రులు గాని,వర్గంగాని లేదు.దేశంలో ఎందరో రాజకీయ నాయకులకు వచ్చిన గుర్తింపు పి.వికి రాకపోవడం దురదృష్టకరం.పి.వీని ఆయన పార్టీవారి కంటే పరాయి పార్టీల వారు ఎక్కువ గౌరవం చూపారు.స్వరాష్ట్రం కంటే పరాయి రాష్ట్రాలు ప్రేమతో ఆశీర్వదించాయి.తెలుగువారికి గర్వకారణంపి.వి నరసిం హారావు. చరిత్రలో పి.వీ లాంటి వారు అరుదుగా కనిపిస్తారు. ఆయన తెలుగు వారికి ఒక రోల్‌ ‌మాడల్‌ ‌రాజకీయ నాయకులకు ఒక దిక్సూచి నిస్వార్ద పరుడు, నిగర్వి అయిన పి.వీకి ప్రతీఒక్కరు శిరస్సు వంచి జోహార్లు అర్పిద్దాం.

ravula rajesham
రావుల రాజేశం, లెక్చరర్‌
‌బి.ఈ.డి కాలేజి కరీంనగర్‌

Leave a Reply