Take a fresh look at your lifestyle.

‘‌పట్టణప్రగతి’కి శ్రీకారం

telangana govt

  • రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు..
  • పాల్గొన్న మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు
  • పెండింగ్‌ ‌సమస్యలను ఏకరువు పెట్టిన పట్టణ ప్రజలు

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దిశా నిర్ధేశం ప్రకారం సోమవారం రాష్ట్ర మంతటా పట్టణప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రమంత్రులు, జిల్లాకె•లెక్టర్‌లు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఐ.టి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ‌పట్టణప్రగతిని మహబూవ్‌నగర్‌లో ప్రారంభించారు. మార్చి 4 వరకు ఈ కార్యమ్రాలను వరుసగా నిర్వహిస్తారు. పల్లెప్రగతి రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీర్‌హరీశ్‌రావు సంగారెడ్డిలో పట్టణప్రగతి కార్యాక్రమంలో పాల్గొని సమస్యలను అడిగి తెలసుకున్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ‌వరంగల్‌లో మంత్రిఎర్రబెల్లి దయాకర్‌రావు, హుజూరాబాద్‌లో మంత్రి ఈటెల రాజేందర్‌, ‌నిజామాబాదద్‌లో మంత్రి వెముల ప్రశాంత్‌రెడ్డి, మీర్‌పేటలో సబితా ఇంద్రారెడ్డి, సూర్యాపేటలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి , మహబూబ్‌బాద్‌లో మంత్రి సత్యవతిరాథోడ్‌,‌మల్కాజిగిరిలో మంత్రి మల్లారెడ్డి పట్టణప్రగతి కార్యక్రమాలను ప్రారంభించారు. పట్టణప్రగతిలో పారిశుద్ధ్యం, పచ్చదనం, పౌరసేవలు, మంచినీటిసేవలు, క్రీడాప్రాంగణాల నిర్మాణాలకు ప్రాధాన్యం చిరువ్యాపారులకోసం ప్రత్యేక స్థలాలు, కూరగాయల మార్కెట్‌లు, మంసాహార విక్రయశాలలు, వాణిజ్యప్రాంగణాలకు స్థలాల ఎంపిక తదితర అంశాలపైన దృష్టిసారించాలని, చాలాసమస్యలకు శాశ్వత పరిష్కారాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్‌లకు,మున్సిపల్‌ ‌చైర్మన్‌లకు,కౌన్సిలర్‌లకు, మేయర్‌లకు కార్పొరేట్‌ర్లకు సూచనలు ఇచ్చారు. కాగా కొత్త మున్సిపల్‌చట్టం పౌరులు కేంద్రంగా రూపొందించామని ప్రభుత్వాధినేతలు ఇప్పటికే చాలాసార్లు తెలియచేశారు. ఈ నేపథ్యంలో వివిధ పట్టణాల్లో నిర్వహించిన పట్టణప్రగతిలో మంత్రులు, అధికారులు కొత్త మున్సిపల్‌ ‌చట్టం ప్రత్యేకతలను, ఆవశ్యకతలను వివరించారు. ప్రతీపట్టణంలో ఖాళీప్లాట్లు పెద్ద సమస్యగా తయారైనట్లు అధికారులు గుర్తించారు.

 

- Advertisement -

ఖాళీప్లాట్టలో చెత్తవేయడం, చెత్త పందులకు, దోమలకు కేంద్రాలుగా మారడం జరుగుతున్నదని అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలలలో పేర్కొన్నారు. ఖాళీప్లాట్లన్నింటిపైన యజమానులు శ్రద్దతీసుకోవాలని, ఆ ప్లాట్టలో మంచి నీడనిచ్చే మొక్కలు నాటాలని, ప్రహరీలు నిర్మించాలని వారికి స్పష్టంగా వివరించి చెప్తున్నారు.చెత్తవేసే ప్రాంతాల ఎంపిక ఒక ప్రధాన సమస్యగా ఉన్నదని ప్రజాప్రతినిధిలు గుర్తించారు.రాష్ట్రవ్యాప్తంగా పరిష్కరించాల్సిన అంశాలు, మున్సిపాలిటీపరిధ ిలో, వార్డు పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలు వంటి అనేకాంశాలతో వేర్వేరుగా నివేదికలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిష్కరించాల్సిన అంశాలను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రికి, సీఎంకు నివేదించనున్నారు. కాగా మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ మొదటి రెండురోజులోనే వార్డు కమిటీల ఎంపికపూర్తికావాలని చెప్పారు. వార్డు కమిటీ సభ్యులకు చాలా బాధ్యతలు ఉంటాయని చెప్పారు. ఈ సభ్యులు ఎన్నికైన కౌన్సిలర్లను, చైర్మన్‌లను పనులు చేసేవిధంగా, ప్రజలకు సేవే చేసేవిధంగా ఆదేశించవచ్చునని చెప్పారు. కొత్త మున్సిపల్‌ ‌చట్టంలో పౌరులకు చాలా గౌరవమర్యాదుల, బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం పెరగాలని, తమ పట్టణాలను,పల్లెలను ప్రజలు తమకు అవసరమైన రీతిలో బాగుచేసుకోవాలని సూచించారు.పాలమూర్‌లోని అనేక వార్డుల్లో తాను తిరిగానని, ప్రతీ వార్డులో ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటున్నారని చెప్పారు.ఆరేడు దశాబ్దాలుగా పట్టణాల్లో ప్రగతి లేదని, ఒకేసారి అన్నీ పనులు చేయలేమని, దశలవారీగా అన్నీ పనులు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్‌లో పట్టణాల ప్రగతికి కావాల్సిన నిధులు కేటాయించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు మాట్లాడుతూ ప్లాస్టిక్‌వ్యర్థాలను పట్టణంలో ఉండవద్దని, ప్లాస్టిక్‌ ‌రహితంగా పట్టణాన్ని మార్చుకుండామని హితవు చెప్పారు.

 

రేషన్‌సరఫరా, గ్యాస్‌సకాలంలో అందకపోవడం, విద్యుత్తుతీగలు వేలాడి ఉండటం, దవాఖానాలో శ్రద్ధగా చూడకపోవడం, వంటి సమస్యలన్నింటినీ మంత్రి దృష్టికి పట్టణప్రజల తీసుకొచ్చారు. అప్పటికప్పుడు విద్యుత్తు అధికారులు, రెవెన్యూ, సానటిషన్‌ ‌తదితర అధికారులతో ఆయన మాట్లాడి పరిష్కారాలను ఇచ్చారు.కొత్తచట్టం ప్రకారం కౌన్సిలర్‌లు పనిచేయకపోతే తొలగించే అధికారం కలెక్టర్‌కు ఉన్నాయని చెప్పారు.కౌన్సిలర్లు ఉదయమే వార్డుల్లో తిరిగి ప్రజల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.పట్టణాల రూపురేఖలను మార్చేందుకే ప్రతీచోట పరిశుభ్రత ఉండాలనే సంకల్పంతో పట్టణప్రగతి వచ్చిందని ఖమ్మంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలను,ఆశయాలను మరిచిపోవద్దని, ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం అందరం నడుచుకోవాల్సిందేనని, అందరం కలిసి పట్టణాలను బాగు చేసుకోవాల్సిందేనని ఇది బాధ్యతని అన్నారు.స్థానిక అధికారులతో పరిష్కారం కానట్లయితే అడిషనల్‌ ‌కలెక్టర్‌లకు చెప్పాలని, సమస్య పరిష్కారమయ్యేవరకు ప్రయత్నం చేయాలని సూచించారు.దోమల బెడద చాలా ఎక్కువగా ఉన్నదని నివారన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.వరంగల్‌పట్టణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతుండగా వరంగల్‌కు సీఎం ప్రత్యేకంగా రూ.72కోట్లు ఇచ్చారని చెప్పారు. చారిత్మ్రాకంగా గొప్ప పేరుప్రతిష్టలు ఉన్న ఈ నగరాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు తాను కావాల్సిన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు పల్లెప్రగతి, పట్టణప్రగతి ఒకేరీతిలో జరిగేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాసనసభ్యులు రసమయి బాలకిషన్‌, ‌జోగురామన్న, కోనేరుకోనప్ప, దివాకర్‌రావు, తమ తమ నియోజకవర్గాలలోని పట్టణాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించారు.ప్రతీచోట విద్యుత్తు సమస్యలను జనం ఏకరువుపెట్టారు.

Leave a Reply