Take a fresh look at your lifestyle.

పట్టణీకరణలో తెలంగాణ నంబర్‌ ‌వన్‌  

*టీఎస్‌ ‌బీపాస్‌ ‌బిల్లుకు శాసనసభ ఆమోదం
*ఇం‌టి నిర్మాణాల్లో సులభంగా అనుమతులు
*75 గజాల వరకు నిర్మాణాలకు నో పర్మిషన్‌
*75 ‌గజాల పైన 600 గజాల వరకు ఇన్‌స్టాంట్‌ అనుమతులు
*సభలో వెల్లడించిన ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌

‌భారతదేశంలోనే శరవేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ట్రాల్లో భారతదేశంలో తెలంగాణ నంబర్‌ ‌వన్‌ ‌స్థానంలో ఉందని ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. దాదాపుగా రాష్ట్రంలో 42 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణాల్లో సరైన మౌలిక వసతులు కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు వెల్లడించారు. పురపాలనలో సమూల మార్పులు తేవాలనే ఉద్దేశంతో నూతన పురపాలక చట్టాన్ని 2019లో తీసుకువచ్చామన్నారు.  పౌరుడు కేంద్రంగా పారదర్శకంగా సేవలందించాలని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీకి జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్‌ ‌బీపాస్‌ ‌బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ పట్టణంలో నివసించే పౌరులు సొంత ఇల్లు నిర్మించుకోవడానికి తీసుకోవాల్సిన అనుమతుల విషయంలో కొన్ని ఇబ్బందులు గమనించాం. అవినీతిని గమనించి 2015లో డెవలప్‌మెంట్‌ ‌పర్మిషన్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌సిస్టం(డీపీఎంఎస్‌)‌ను అన్ని మున్సిపాలిటీల్లో ప్రవేశపెట్టాం. దీనికి చట్టబద్ధత లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో 100 శాతం పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీఎస్‌ ‌బీపాస్‌ ‌చట్టాన్ని తీసుకువస్తున్నామని కేటీఆర్‌ ‌తెలిపారు. టీఎస్‌ ‌బీపాస్‌ ‌చట్టం వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply