Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి

రెండు మూడు రోజుల్లో బాధ్యతల స్వీకారం
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నాగిరెడ్డి గత ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి గల ఈ పదవిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న లేదా విరమణ పొందిన అధికారులను కమిషనర్‌గా నియమించాల్సి ఉంటుంది.

1993 ఐఏఎస్‌ ‌బ్యాచ్‌కు చెందిన పార్థసారధి ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి స్థాయిలో పని చేసి పదవీ విరమణ పొందారు. అగ్రికల్చర్‌లో ఎమ్మెస్సీ చేసిన పార్థసారధి ఆదిలాబాద్‌ ‌డీఆర్‌డీఏ పీడీగా •కెరీర్‌ను ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఆయన రెండు మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తారని తెలిసింది. ఇదిలా ఉండగా, త్వరలోనే జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పార్థసారధిని నియమించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply